Prabhas – Junior NTR : ప్రభాస్ స్టామినా ని తన్ని అవతల వేసిన జూనియర్ ఎన్టీఆర్ .. ఎంత ఎదిగిపోయాడో వామ్మో !
Prabhas – Junior NTR : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో మొదటి వరుసలో ఉండేది ప్రభాస్, ఎన్టీఆర్. ఈ ఇద్దరు హీరోలకు విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా హిట్ అయింది అంటే రికార్డులు బ్రేక్ అయిపోతాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఇటీవల ఎక్కువైపోతున్నాయి. తాజాగా ప్రభాస్ వర్సెస్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే.
యాష్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “వార్ 2″లో ఎన్టీఆర్ విలన్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ పాత్ర కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తారక్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే సినిమాలో తారక్ తో పాటు హీరోగా నటిస్తున్న హృతిక్ రోషన్ కూడా ₹100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సమాంతరమైన రెమ్యూనరేషన్ తారక్ కి వార్ 2 కి ఇవ్వడానికి యాష్ ఫిలిమ్స్ సంస్థ ఏమాత్రం
వెనకడుగు వేయకుండా గ్రీన్ సిగ్నల్ అవ్వడం జరిగిందంట. ఈ పరిణామంతో కొందరు జనాలు ప్రభాస్ కంటే ఎన్టీఆర్ గ్రేట్ అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. ఇప్పటివరకు సరైన హిట్టు కొట్టలేదు. కానీ తారక్ సోలోగా బాలీవుడ్ ఎంట్రీ ఇప్పటివరకు ఇవ్వకపోయినా గానీ ఫస్ట్ టైం విలన్ పాత్రతో ఎంట్రీ ఇస్తూ వంద కోట్లు రెమ్యూనరేషన్ అందుకోవటం మామూలు విషయం కాదు… ఇది ప్రభాస్ నీ మించిపోయిన విషయం ఎన్టీఆర్ స్టామినా ముందు ప్రభాస్ రాబోయే రోజుల్లో నిలవలేడని.. తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.