
Chiranjeevi : చిరంజీవి సినిమా కోసం చంద్రముఖి కాంబోని పట్టుకొస్తున్న అనీల్ రావిపూడి..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబోకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం మనం చూశాం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెగా 157′ మూవీలో హీరోయిన్ నయనతార నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రోల్ కోసం ఆమె ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
Chiranjeevi : చిరంజీవి సినిమా కోసం చంద్రముఖి కాంబోని పట్టుకొస్తున్న అనీల్ రావిపూడి..!
ఇక ఈ మూవీపై మరో క్రేజీ న్యూస్ సైతం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని.. అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రోల్‌లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారనే టాక్ నడుస్తోంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం.. విశాఖలో ఈ మూవీ కోసం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.
ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరు, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అటు దర్శకుడు అనిల్ రావిపూడితోనూ విక్టరీకి మంచి అనుబంధం ఉంది. ఓ కీలక రోల్ కోసం ఆయన్ను సంప్రదించగా ఓకే అన్నారని సమాచారం. పూజా కార్యక్రమానికి సైతం వెంకీ హాజరు కాగా సినిమాలో ఆయన నటిస్తున్నారనే వార్తలకు బలం చేకూరినట్లైంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.