Chiranjeevi : చిరంజీవి సినిమా కోసం చంద్ర‌ముఖి కాంబోని ప‌ట్టుకొస్తున్న అనీల్ రావిపూడి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి సినిమా కోసం చంద్ర‌ముఖి కాంబోని ప‌ట్టుకొస్తున్న అనీల్ రావిపూడి..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : చిరంజీవి సినిమా కోసం చంద్ర‌ముఖి కాంబోని ప‌ట్టుకొస్తున్న అనీల్ రావిపూడి..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబోకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డం మ‌నం చూశాం. త్వ‌రలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వస్తున్నాయి. మెగా 157′ మూవీలో హీరోయిన్ నయనతార నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రోల్ కోసం ఆమె ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi చిరంజీవి సినిమా కోసం చంద్ర‌ముఖి కాంబోని ప‌ట్టుకొస్తున్న అనీల్ రావిపూడి

Chiranjeevi : చిరంజీవి సినిమా కోసం చంద్ర‌ముఖి కాంబోని ప‌ట్టుకొస్తున్న అనీల్ రావిపూడి..!

Chiranjeevi భ‌లే సెట్ చేశాడుగా..

ఇక ఈ మూవీపై మరో క్రేజీ న్యూస్ సైతం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని.. అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రోల్‌లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారనే టాక్ నడుస్తోంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం.. విశాఖలో ఈ మూవీ కోసం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.

ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరు, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అటు దర్శకుడు అనిల్ రావిపూడితోనూ విక్టరీకి మంచి అనుబంధం ఉంది. ఓ కీలక రోల్ కోసం ఆయన్ను సంప్రదించగా ఓకే అన్నారని సమాచారం. పూజా కార్యక్రమానికి సైతం వెంకీ హాజరు కాగా సినిమాలో ఆయన నటిస్తున్నారనే వార్తలకు బలం చేకూరినట్లైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది