K Raghavendra Rao : యాంకర్ సుమపై కేసు పెడతానంటున్న దర్శకుడు రాఘవేంద్రరావు.. నువ్వు చేసేదంతా మోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

K Raghavendra Rao : యాంకర్ సుమపై కేసు పెడతానంటున్న దర్శకుడు రాఘవేంద్రరావు.. నువ్వు చేసేదంతా మోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు

K Raghavendra Rao : ప్రముఖ యాంకర్ సుమ గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ళుగా తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయనీయకుండా బుల్లితెర మీద యాంకర్‌గా, సినిమా ఆడియో ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. చిన్న వారి నుంచి మెగాస్టార్ చిరంజీవి, లెజండరీ డైరెక్టర్స్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు లాంటి వారి వరకు అందరినీ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఎంత సీనియర్ నటీ నటులైనా, దర్శకులైనా వారితో తనకున్న చనువుతో బాగానే ఆట […]

 Authored By govind | The Telugu News | Updated on :29 September 2021,7:00 am

K Raghavendra Rao : ప్రముఖ యాంకర్ సుమ గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ళుగా తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయనీయకుండా బుల్లితెర మీద యాంకర్‌గా, సినిమా ఆడియో ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. చిన్న వారి నుంచి మెగాస్టార్ చిరంజీవి, లెజండరీ డైరెక్టర్స్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు లాంటి వారి వరకు అందరినీ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఎంత సీనియర్ నటీ నటులైనా, దర్శకులైనా వారితో తనకున్న చనువుతో బాగానే ఆట పట్టిస్తుంటుంది. ఇక షో ఎలాంటిదైనా యాంకర్ సుమ అంటే డెఫినెట్‌గా క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది.

K Raghavendra Rao Fire on Anchor suma

K Raghavendra Rao Fire on Anchor suma

ఇక సుమ బుల్లితెర మీద చేస్తున్న షోస్‌లో ఒకటి క్యాష్. ఈ షోకి బుల్లితెర మీద సందడిన్ చేస్తున్న ఇతర యాంకర్స్, సీరియల్ నటీ నటులు, సినీ తారలు ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ సుమ క్యాష్ షోకి వచ్చి సందడి చేస్తుంటారు. అలాగే తాజాగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్ళి సందడి సినిమా రూపొందించారు. గౌరీ రోనంకి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇందులో హీరోగా నటించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Anchor Suma Has Been Suffering From A Disease

K Raghavendra Rao : రాఘవేంద్ర రావు తన ప్యాంటు సర్దుకున్నారు.

అప్పటి పెళ్ళి సందడి సినిమాకి వచ్చినంత హైప్ ఈ సినిమాకి కూడా వచ్చింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో క్యాష్ ప్రోగ్రాం ద్వారా ప్రమోషన్స్ చేశారు. ఈ షోకి వచ్చిన సందర్భంలో రాఘవేంద్ర రావు తన ప్యాంటు సర్దుకున్నారు. ఇది కూడా వదలని సుమ చిరంజీవిలాగా స్టెప్ వేశారని సెటైర్ వేసింది. దానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. దానికి ఏమాత్రం తగ్గకుండా సుమ..సుమ నేను నా ప్యాంట్ జారిపోకుండా అలా సర్దుకుంటే దానిపై నువ్వు వెక్కిరిస్తావా.. నీపై కేసు పెడతాను నేను..అంటూ రివర్స్‌లో సుమ మీద కౌంటర్ వేశారు. ఇది యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది