Raghavendra Rao : నీ మీద అప్పుడే కన్నేశా!.. హీరోయిన్ మీద దర్శకేంద్రుడి కామెంట్స్

Advertisement

Raghavendra Rao : దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు అంటే అందరికీ కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే తెలుగు వారికి ముఖ్యంగా ఆయన తెరకెక్కించే పాటలు, రొమాంటిక్ మేకింగ్ గుర్తుకు వస్తుంది. ఇక ఏదో ఒక పండును.. ఏదో రకంగా వాడటం, వాటిని హీరోయిన్లపై వింత వింతగా ప్రయోగించడం రాఘవేంద్రరావుకు చెల్లుతుంది. అయితే హీరోయిన్లలోని అందాలను పసిగట్టడం, వాటిని కొత్త పద్దతుల్లో చూపించడంతో దర్శకేంద్రుడు సిద్దహస్తులు.

Advertisement
K Raghavendra Rao funny Comments On Heroine Sada
K Raghavendra Rao funny Comments On Heroine Sada

ఒకప్పుడు రాఘవేంద్రరావు మాట్లాడేవాడే కాదు. ఇక సినిమా సెట్‌లో తప్పా ఇంకా ఎక్కడా కనిపించేవాడు కాదు. సినిమా ఫంక్షన్లలోనూ ఆయన కనిపించేవాడు కాదు. ఎప్పుడో అలా వచ్చి.. ఓ ముక్క మాట్లాడి వెళ్లేవాడు. అలా మౌనమునిలా ఉన్న రాఘవేంద్రరావు ఇప్పుడు తనలోని కొత్త కోణాన్ని చూపుతున్నాడు. స్టేజ్ ఎక్కితే చాలు దంచి కొడుతున్నాడు. మైకు అందితే చాలు వదలడం లేదు. అలా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇప్పుడు బుల్లితెరపైనా రచ్చ చేస్తున్నాడు.

Advertisement

సదాపై రాఘవేంద్రరావు కొంటె కామెంట్లు..

K Raghavendra Rao funny Comments On Heroine Sada
K Raghavendra Rao funny Comments On Heroine Sada

బుల్లితెరపై దసరాకు స్పెషల్ ఈవెంట్లు రెడీ అవుతున్నాయి. ఇందులో అన్ని ఈవెంట్లలోనూ పెళ్లి సందడి టీం సందడి కనిపించనుంది. అలా మొత్తానికి ఈటీవీలో దసరా బుల్లోళ్లు అనే ఈవెంట్ రాబోతోంది. ఇందులో సదా కూడా వచ్చింది. అయితే సదా మీద రాఘవేంద్రరావు కన్నేశాడట. జయం సినిమాలో వెళ్లవయ్యా వెళ్లు అనే డైలాగ్ వచ్చినప్పటి నుంచి నీ మీద కన్నేశా.. కానీ మనకు చాన్స్ దొరకలేదు.. సినిమా తీయలేకపోయానంటూ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నాడు.

Advertisement
Advertisement