K. Viswanath : టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ అనారోగ్య కారణాలతో గురువారం నాడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కె. విశ్వనాధ్ ను టాలీవుడ్ కోల్పోయింది. అంతటి లెజండరీ దర్శకుడు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసులు లేరా ఇండస్ట్రీలోకి ఎందుకు రాలేదు. విశ్వనాథ్ గారి అబ్బాయిగా వస్తే ఇండస్ట్రీలో అతడికి ఒక రేంజ్ ఉంటుంది. విశ్వనాథ్ గారి అబ్బాయి అంటే ఏ సినిమా చేయడానికి అయినా నిర్మాతలు ముందుకు వస్తారు కానీ ఎందుకు ఆ ప్రయత్నాలు చేయలేదు అని అందరికీ సందేహాలు వస్తున్నాయి.
విశ్వనాథ్ గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. వారి పేర్లు కాశీనాధుని నాగేంద్ర నాథ్, కాశీనాధుని రవీంద్రనాథ్. కూతురు పేరు పద్మావతి దేవి. చిన్నప్పటినుంచి ఇద్దరు కొడుకులకు విశ్వనాథ్ గారి లాగానే దేవుడు పై అమితమైన భక్తి ఉండేదట. అంతే కాదు చదువులో అందరికంటే ముందు ఉండేవాళ్ళట, చాలా చురుకుగా ఉంటే వారట. వాళ్ళ అభిరుచులను తెలుసుకున్న విశ్వనాధ్ వీళ్లు పెద్దయ్యాక కచ్చితంగా నాలాగా సినిమాలలోకి రారని అనుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే ఇద్దరు వ్యాపార రంగంలో మంచిగా స్థిరపడిపోయారు.
ఈ విషయాలన్నీ కళాతపస్వి కె. విశ్వనాథ్ బ్రతికి ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విశ్వనాధ్ గారి కొడుకులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విశ్వనాధ్ గారు దర్శకత్వ వహించిన శంకరాభరణం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. దీంతోపాటు విశ్వనాథ్ గారు ఐదు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. క్లాస్ సినిమాలు చేయడంలో విశ్వనాధ్ గారిని మించిన వారు ఎవరు లేరు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.