K. Viswanath : విశ్వనాథ్ చనిపోయిన తరవాత ఆయన గురించి బయటపడిన బిగ్ విషయం ఇదే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

K. Viswanath : విశ్వనాథ్ చనిపోయిన తరవాత ఆయన గురించి బయటపడిన బిగ్ విషయం ఇదే..!!

K. Viswanath : టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ అనారోగ్య కారణాలతో గురువారం నాడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కె. విశ్వనాధ్ ను టాలీవుడ్ కోల్పోయింది. అంతటి లెజండరీ దర్శకుడు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసులు లేరా ఇండస్ట్రీలోకి ఎందుకు రాలేదు. విశ్వనాథ్ గారి అబ్బాయిగా వస్తే ఇండస్ట్రీలో అతడికి ఒక రేంజ్ ఉంటుంది. విశ్వనాథ్ గారి అబ్బాయి అంటే ఏ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 February 2023,8:00 pm

K. Viswanath : టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ అనారోగ్య కారణాలతో గురువారం నాడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కె. విశ్వనాధ్ ను టాలీవుడ్ కోల్పోయింది. అంతటి లెజండరీ దర్శకుడు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసులు లేరా ఇండస్ట్రీలోకి ఎందుకు రాలేదు. విశ్వనాథ్ గారి అబ్బాయిగా వస్తే ఇండస్ట్రీలో అతడికి ఒక రేంజ్ ఉంటుంది. విశ్వనాథ్ గారి అబ్బాయి అంటే ఏ సినిమా చేయడానికి అయినా నిర్మాతలు ముందుకు వస్తారు కానీ ఎందుకు ఆ ప్రయత్నాలు చేయలేదు అని అందరికీ సందేహాలు వస్తున్నాయి.

విశ్వనాథ్ గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. వారి పేర్లు కాశీనాధుని నాగేంద్ర నాథ్, కాశీనాధుని రవీంద్రనాథ్. కూతురు పేరు పద్మావతి దేవి. చిన్నప్పటినుంచి ఇద్దరు కొడుకులకు విశ్వనాథ్ గారి లాగానే దేవుడు పై అమితమైన భక్తి ఉండేదట. అంతే కాదు చదువులో అందరికంటే ముందు ఉండేవాళ్ళట, చాలా చురుకుగా ఉంటే వారట. వాళ్ళ అభిరుచులను తెలుసుకున్న విశ్వనాధ్ వీళ్లు పెద్దయ్యాక కచ్చితంగా నాలాగా సినిమాలలోకి రారని అనుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే ఇద్దరు వ్యాపార రంగంలో మంచిగా స్థిరపడిపోయారు.

K Viswanath real life mystery revealed

K. Viswanath real life mystery revealed

ఈ విషయాలన్నీ కళాతపస్వి కె. విశ్వనాథ్ బ్రతికి ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విశ్వనాధ్ గారి కొడుకులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విశ్వనాధ్ గారు దర్శకత్వ వహించిన శంకరాభరణం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. దీంతోపాటు విశ్వనాథ్ గారు ఐదు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. క్లాస్ సినిమాలు చేయడంలో విశ్వనాధ్ గారిని మించిన వారు ఎవరు లేరు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది