Kaikala Satyanarayana : ఆస్పత్రిలో కైకాల సత్యనారాయణ.. ఆరోగ్యంపై క్లారిటీనిచ్చిన కుటుంబ సభ్యులు..

Kaikala Satyanarayana : టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా రంగంలో ప్రఖ్యాత నటుడిగా పేరొందారు. వృద్ధాప్యం వల్ల సినిమాల్లో నటించడం తగ్గించేశారు కైకాల. ఇటీవల తన ఇంట్లో జారిపడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన్ను ఆయన కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.కైకాల ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇకపోతే వయసు పరిమితుల దృష్ట్యా కైకాల ఇంటికే పరిమితమయిన సంగతి తెలిసిందే.

kaikala satyanarayana kaikala hospitalised due to ill health

కాగా, కైకాల చివరిసారిగా తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాలో కనిపించారు. ఈ చిత్రానికి ముందర ఆయన నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ చిత్రంలో ఓ పాత్ర పోషించాడు. నవరస నటనా సార్వభౌమగా పేరుగాంచిన కైకాల సత్యనారాయణ.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావుకు డూప్‌గానూ నటించారు. దాదాపుగా 750 చిత్రాల్లో నటించిన కైకాల బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగానే కాకుండా కైకాల.. నిర్మాతగా, డైరెక్టర్‌గానూ చిత్రాలు చేశారు. రాజకీయాల్లోనూ కైకాల రాణించారు. పదకొండో లోక్ సభ సభ్యుడిగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కైకాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. తెలుగు దేశం పార్టీ తరఫున కైకాల పోటీ చేసి గెలుపొందారు. చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ డూప్ వేషాలు వేసి కైకాల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన ‘అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణి’ చిత్రంలో కైకాలకు అవకాశమిచ్చారు.

Kaikala Satyanarayana : బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల..

kaikala satyanarayana kaikala hospitalised due to ill health

ఇక ఆ తర్వాత కైకాల వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాల్లో అవకాశాలు రాగా కైకాల పాత్రలను తనదైన శైలిలో పోషించి మంచి పేరు సంపాదించుకున్నాడు. విలన్ పాత్రలతో పాటు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ ముందుకు సాగాడు. పౌరాణిక పాత్రలు అయితే ఎన్టీఆర్ తర్వాత కైకాల సత్యనారాయణే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. పరమేశ్వురుడిగా, కర్ణుడిగా, భరతుడిగా, దుశ్శాసనుడిగా, ఘటోత్కచుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణదేవరాయుడిగా, యమధర్మరాజుగా, భీముడిగా, రావణుడిగా విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు తెరపైన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు కైకాల.

Recent Posts

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

23 minutes ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

1 hour ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

2 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

3 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

4 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

5 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

6 hours ago

Allu Family | అల్లు ఫ్యామిలీకి మ‌రో ఝ‌ల‌క్.. ఈ సారి ఏకంగా ఇల్లే కూల్చేయ‌బోతున్నారా?

Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…

7 hours ago