Nagarjuna : ఆ విషయంలో నాగార్జున కు నో చెప్పిన కాజల్.. కార‌ణం ఇదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nagarjuna : ఆ విషయంలో నాగార్జున కు నో చెప్పిన కాజల్.. కార‌ణం ఇదేనా..?

Nagarjuna : టాలివుడ్ మన్మధుడు, అక్కినేని నాగార్జునకు గత కొద్ది రోజులుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఆరవై ఏళ్ల వయస్సు దాటినా… నాగ్ అందం ఏమాత్రం తగ్గడం లేదు. ఓ వైపు వరుస సినిమాలతో, మరోవైపు బిగ్ బాస్ షోతో ఆయన నిత్యం బిజీగా గడుపుతున్నారు. అయితే నాగ్ కు సినిమాల పరంగా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ దొరకడం లేదు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు పై […]

 Authored By kranthi | The Telugu News | Updated on :2 December 2021,8:20 pm

Nagarjuna : టాలివుడ్ మన్మధుడు, అక్కినేని నాగార్జునకు గత కొద్ది రోజులుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఆరవై ఏళ్ల వయస్సు దాటినా… నాగ్ అందం ఏమాత్రం తగ్గడం లేదు. ఓ వైపు వరుస సినిమాలతో, మరోవైపు బిగ్ బాస్ షోతో ఆయన నిత్యం బిజీగా గడుపుతున్నారు. అయితే నాగ్ కు సినిమాల పరంగా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ దొరకడం లేదు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు పై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగర్జునకు సినిమాలు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి.

ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న ఘోస్ట్ సినిమా కూడా అంతే స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం…కొవిడ్ రెండో దశ కారణంగా ఆలస్యమైంది. అసలే బడ్జెట్ నష్టంతో ఉన్న ఈ చిత్ర బృందానికి మరో షాక్ ఎదురైంది. మొదటగా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్… ఇప్పుడు నాగ్ సరసన నటించడానికి హాండివ్వడంతో చిత్ర బృందం చిక్కుల్లో పడింది.నాగార్జునకు కాజల్ నో చెప్పడంతో… ఈ 60 ఏళ్ల మన్మథుడి కోసం చిత్ర బృందం మరో హీరోయిన్ ను రంగంలోకి దించబోతున్నారట.

kajal aggarwal and Nagarjuna ghost movie Update

kajal aggarwal and Nagarjuna ghost movie Update

Nagarjuna: నాగార్జునకి నో చెప్పిన కాజల్:

ఆల్ రెడీ చిత్ర బృందం సన్నజాజి సుందరి, గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించినట్లు సమాచారం. ఇదే కాక… ఎఫ్ -2 ఫేమ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదాను ఏకంగా ఫైనల్ చేశారని మరో మాట వినిపిస్తుంది.భారీ బడ్జెట్‌ తో రూపొదిస్తున్న ఈ సినిమా లో జబర్థస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. నాగార్జున ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది