kajal aggarwal pregnancy Viral
kajal aggarwal : చందమామ కాజల్ అగర్వాల్ మంచి ఊపుమీదున్నప్పుడే సినిమాలను మానకుండా అత్యంత సన్నిహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్ళి చేసుకుంది. గత ఏడాది పెళ్ళి చేసుకున్న కాజల్ హనీమూన్ ట్రిప్ కూడా మాల్దీవుల్లో బాగా ఎంజాయ్ చేసింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇలా రెండు పడవల ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
kajal aggarwal pregnancy Viral
ఈ సినిమాను కాజల్ పూర్తి చేసింది. శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే బాలీవుడ్ మూవీ ఒకటి చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రవీణ్ సత్తారు – నాగార్జున కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గోస్ట్ మూవీలో కూడా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలై శరవేగంగా సాగుతోంది. నాగార్జున ఫస్ట్‌లుక్ అలాగే టైటిల్ పోస్టర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో కాజల్ పేరు అనౌన్స్ అయినప్పటి నుంచి ఆమెది వేశ్య పాత్ర అని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ పాత్ర కాజల్‌కి బాగా పేరు తీసుకు వస్తుందని చెప్పుకుంటున్నారు.
Social Media Rumors on kajal agarwal pregnant
అయితే ఈ మధ్య నాగార్జున గోస్ట్ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుందని వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆమె ప్రస్తుతం గర్భందాల్చినట్టు అందుకే ఇక సినిమాలకి గుడ్‌బై చెప్పి రెస్ట్ తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా కాజల్ స్పందించలేదు. కానీ ఆమె ఇటీవల రెగ్యులర్‌గా మాత్రం ఫొటో షూట్స్‌లో పాల్గొంటూ సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. ఇక గోస్ట్ నుంచి తప్పుకోవడంతో సీనియర్ హీరోయిన్స్ త్రిష, ఇలియానా పేర్లు ఇప్పుడు గోస్ట్ సినిమాకి పరిశీలిస్తున్నారట. త్వరలో దీనిపై మేకర్స్ గానీ, హీరోయిన్ కాజల్ గానీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
kajal aggarwal pregnancy Viral
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
This website uses cookies.