Home » Entertainment » Kajal Emotional With Manas In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : ఇష్టమంటూనే ఏడ్చేసింది.. మానస్‌తో కాజల్ ట్రాక్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 7, 2021, 7:15 am
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో రిలేషన్స్ ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ఈ రోజు ఫ్రెండ్స్‌గా ఉన్నవారు మళ్లీ రేపు ఎలా ఉంటారో కూడా చెప్పలేం. క్షణక్షణానికి అక్కడ పరిస్థితులు మారిపోతోంటాయి. ఇక కొందరు మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా స్నేహితుల్లా కలిసి మెలిసి ఉంటారు. అయితే కొందరి రిలేషన్స్‌కు మాత్రం పేరు పెట్టలేం. అవి ఏంటో వారికే తెలియవు. ఇక అలానే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో వింత వింత ట్రాకులు నడుస్తున్నాయి.

Advertisement

Kajal Emotional With Manas In Bigg Boss 5 Telugu

ఈ ట్రాకులు, లవ్ స్టోరీలు, గాసిప్పులు మాట్లాడటంలో కాజల్ ముండేది. మొదట్లో ఈ ట్రాకుల గురించి అందరి దగ్గర ప్రస్తావించింది. అలా చివరకు బ్రోకర్ అనే పేరు తెచ్చుకుంది. అయితే కాజల్ ఇప్పుడు సపరేట్ ట్రాక్ నడుపుతోంది. ఆమె ఇప్పుడు సన్నీ, మానస్‌లతో క్లోజ్‌గా ఉంటోంది. నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం కాజల్‌కు ఎదురుదెబ్బ తగలింది. మానస్ ఆమెను దూరంగా పెట్టేసినట్టు కనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని మానస్‌ను కాజల్ అడిగింది.

Advertisement

Bigg Boss 5 Telugu : మానస్‌తో కాజల్ గుసగుసలు..

Bigg Boss 5 Telugu

మనిద్దరి మధ్య ఏముంది? మనది ఏ రకమైన ఫ్రెండ్ షిప్ అని అందరూ అడుగుతున్నారు.. షణ్ముఖ్ ఇప్పుడే అడిగాడని మానస్ చెప్పుకొచ్చాడు. నాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి ఎవరో ఒకరు కావాలి అని నువ్ అన్నావ్.. అప్పుడు సన్నీని అలానే వాటేసుకున్నావ్ నాకు తెలుసు..చూశాను అంటూ మానస్ అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటూ మానస్ గురించి మనసులో మాట చెప్పేసింది. మన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా? అని కాజల్ ఏడ్చేసింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో వారికే తెలియాలి. బ్రదర్, సిస్టర్ అంటూ కాజల్, మానస్, ప్రియాంకలు నిన్న మాట్లాడుకున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి