Kajol : ప్ర‌పంచంలో అత్యంత భ‌యాన‌క ప్ర‌దేశం రామోజీ ఫిల్మ్ సిటీ.. కాజ‌ల్ స్టన్నింగ్ కామెంట్స్.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kajol : ప్ర‌పంచంలో అత్యంత భ‌యాన‌క ప్ర‌దేశం రామోజీ ఫిల్మ్ సిటీ.. కాజ‌ల్ స్టన్నింగ్ కామెంట్స్.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Kajol : ప్ర‌పంచంలో అత్యంత భ‌యాన‌క ప్ర‌దేశం రామోజీ ఫిల్మ్ సిటీ.. కాజ‌ల్ స్టన్నింగ్ కామెంట్స్.. వీడియో !

Kajol  : హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఎంత పాపుల‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫిల్మ్ సిటీలోనే వివిధ స్పాట్స్ లో ఎప్పటికప్పుడు చిత్రీకరణలు జరుగుతూనే ఉంటాయి. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటాయి. దీంతో కెరీర్ లో దాదాపు అందరు నటీనటులు అక్కడికి వెళ్లే ఉంటారు.

Kajol ప్ర‌పంచంలో అత్యంత భ‌యాన‌క ప్ర‌దేశం రామోజీ ఫిల్మ్ సిటీ కాజ‌ల్ స్టన్నింగ్ కామెంట్స్ వీడియో

Kajol : ప్ర‌పంచంలో అత్యంత భ‌యాన‌క ప్ర‌దేశం రామోజీ ఫిల్మ్ సిటీ.. కాజ‌ల్ స్టన్నింగ్ కామెంట్స్.. వీడియో !

Kajol  : జీవితంలో అక్క‌డికి వెళ్ల‌ను..

అయితే బాలీవుడ్ నటి కాజోల్.. ఓ ఇంటర్వ్యూలో రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను నటించిన ఓ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగ్గా.. తాను నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నానని కాజోల్ వ్యాఖ్యానించారు. కొన్ని ప్రదేశాలు భయానకంగా ఉన్నాయని ఆరోపించారు. అక్కడి నుంచి వెంటనే బయటకు వెళ్లిపోవాలని అనుకున్నానని, మళ్లీ మరోసారి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లాలనుకోలేదని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా వర్ణిస్తూ ఆరోపణలు చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తిగతంగా భయపడి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఇప్పుడు కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి కాజోల్ వ్యాఖ్యలు.. ఇప్పుడు నెట్టింట భారీ చర్చకు దారితీశాయి. కాగా, కాజోల్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సత్తా చాటారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ గా నిలిచారు. మా అనే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కాజోల్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది