kalki 2898 Ad Movie : ప్రభాస్ అభిమానులని క్షమాపణ కోరిన అమితాబ్.. కల్కి ముందు ఈ ట్విస్ట్ ఏంటి?
kalki 2898 Ad Movie : ప్రభాస్, దీపికా హీరో హీరోయిన్స్‌గా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం కల్కి. ఈవారంలోనే జూన్ 27వ తేదీన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ థియేటర్లలోకి రానుంది. కల్కి మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్‍తో పాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ ప్రమెషన్స్ లో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమా మంచి హిట్ సాధించేలా వారి వంతు కృషి చేస్తున్నారు. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్.. ప్రభాస్‌కి సంబంధించి కొన్ని సీక్రెట్ రివీల్ చేశాడు. కల్కి 2898 ఏడీ సినిమాలో తాను ప్రభాస్‍ను కొట్టే సీన్లు ఉన్నాయని అమితాబ్ బచ్చన్ చెప్పారు. అందుకే ప్రభాస్ అభిమానులందరూ తనను క్షమించాలని, తనపై దాడి చేయవద్దని బిగ్‍బీ సరదాగా అన్నారు. అయితే అందరూ మీ ఫ్యాన్సే అని అమితాబ్‍తో ప్రభాస్ అన్నారు….
కల్కి 2898 ఏడీ సినిమాలో తాను భారీ కాయంతో కనిపిస్తానని అమితాబ్ అన్నారు. దర్శకుడు నాగ్‍అశ్విన్ నా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఈ మూవీలో నేను, ప్రభాస్ ఎలా కనిపిస్తామో కొన్ని ఫొటోలు చూపించారు. ది ప్రభాస్‍ను కొట్టే భారీ వ్యక్తిని నేను. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించండి. నేను చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. సినిమాలో నేను ఏం చేశానో చూసి నాపై దాడి చేయవద్దు” అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్ మాటలకు ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. వాళ్లందరూ మీ అభిమానులే అని బిగ్‍బీతో ప్రభాస్ చెప్పారు. అమితాబ్ మాటలకు అందరూ సరదాగా నవ్వారు.
kalki 2898 Ad Movie : ప్రభాస్ అభిమానులని క్షమాపణ కోరిన అమితాబ్.. కల్కి ముందు ఈ ట్విస్ట్ ఏంటి?
ఇక కల్కి ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్ర పోషించారు అమితాబ్. దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో క్రమశిక్షణ ఎక్కువ ఉంటుందని అమితాబ్ బచ్చన్ అన్నారు. కల్కి 2898 ఏడీ సినిమా సెట్స్ ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉండేదని అన్నారు. కమల్ హాసన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సూపర్ హీరో, గ్రే షేడ్స్, ఫన్నీ ఇలా అన్ని కలిసి తన పాత్ర ఉంటుందని ప్రభాస్ చెప్పారు. కల్కి చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో భారీ ట్విస్ట్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. జూన్ 27న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. 2డీ, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్లలో వస్తోంది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.