kalki 2898 AD Movie : క‌ల్కి బిజినెస్ అన్ని వంద‌ల కోట్లా.. లాభం రావాలంటే ఎంత రాబ‌ట్టాలి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

kalki 2898 AD Movie : క‌ల్కి బిజినెస్ అన్ని వంద‌ల కోట్లా.. లాభం రావాలంటే ఎంత రాబ‌ట్టాలి అంటే..!

kalki 2898 AD Movie : గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హంగామా లేక‌పోవ‌డంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు కూడా క‌ల్కి చిత్రం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించగా, ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2024,5:00 pm

kalki 2898 AD Movie : గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హంగామా లేక‌పోవ‌డంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు కూడా క‌ల్కి చిత్రం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించగా, ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించారు. టైం ట్రావెల్ కథతో రూపొందిన ఈ చిత్రాన్ని పలు యుగాల కాలలకు వెళ్లి డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

kalki 2898 AD Movie హిట్ కావాలంటే ఎంత రావాలి..

చిత్రంలో ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న యువకుడిగా కనిపించబోతున్నాడు. అతనికి బుజ్జి అనే వాహ‌నం కూడా ఉంటుంది. ఇక ఇటీవ‌ల మూవీకి సంబంధించిన ప‌లు వీడియోలు విడుద‌ల కాగా, అవి చూసిన‌ప్ప‌టి నుండి చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రాండ్‌ రిలీజ్.. ప్రమోషన్ విజువల్ వండర్‌గా రాబోతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని జూన్ 27న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయినప్పటికీ ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ ఓ రేంజ్‌లో జ‌రుగుతుంది. ప్ర‌భాస్ క్రేజ్, మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్స్ చూసిన అభిమానులు సినిమాని చూసేందుకు ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది.

kalki 2898 AD Movie క‌ల్కి బిజినెస్ అన్ని వంద‌ల కోట్లా లాభం రావాలంటే ఎంత రాబ‌ట్టాలి అంటే

kalki 2898 AD Movie : క‌ల్కి బిజినెస్ అన్ని వంద‌ల కోట్లా.. లాభం రావాలంటే ఎంత రాబ‌ట్టాలి అంటే..!

ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 70 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 83 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రభాస్ మూవీకి రూ. 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి..కర్నాటకలో రూ. 28 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 385 కోట్లు వ్యాపారం జరిగింది. మొత్తంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు రూ. 385 కోట్లు బిజినెస్ జ‌ర‌గ‌గా, రూ. 388 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది