The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’ రిలీజ్ తర్వాత మళ్లీ మారుతిపై ట్రోలింగ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’ రిలీజ్ తర్వాత మళ్లీ మారుతిపై ట్రోలింగ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 February 2026,9:50 pm

ప్రధానాంశాలు:

  •  The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’ రిలీజ్ తర్వాత మళ్లీ మారుతిపై ట్రోలింగ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

The Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫలితంగా ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంత పెద్ద స్టార్ హీరో అవకాశం ఇచ్చినా, కథా–కథనం, దర్శకత్వం విషయంలో సరైన న్యాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు.

The Raja Saab ఓటీటీలో ది రాజాసాబ్ రిలీజ్ తర్వాత మళ్లీ మారుతిపై ట్రోలింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్

The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’ రిలీజ్ తర్వాత మళ్లీ మారుతిపై ట్రోలింగ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

The Raja Saab : ఆగ‌ని ట్రోలింగ్..

సినిమా విడుదల సమయంలోనే మారుతిపై ట్రోలింగ్ పెద్ద ఎత్తున సాగింది. కథ బలహీనంగా ఉందని, ప్రభాస్ ఇమేజ్‌కు సరిపడని స్క్రిప్ట్ ఎంచుకున్నారని అభిమానులు మండిపడ్డారు. కొందరు మరీ హద్దులు దాటి దర్శకుడి ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పార్సిల్స్, మెడికల్ పార్సిల్స్ పంపించడం వరకు వెళ్లారు. ఈ విషయాన్ని మారుతీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. తరువాత ఆ వివాదం కొంతకాలం నిశ్శబ్దంగా మారినట్టు కనిపించింది.అయితే తాజాగా ‘ది రాజాసాబ్’ ఓటీటీ రిలీజ్ కావడంతో మళ్లీ ట్రోలింగ్ ఊపందుకుంది. సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత నెటిజన్లు చిత్రంలోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని సన్నివేశాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుడు మారుతీని ట్యాగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక మరికొందరు అభిమానులు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ స్థానంలో డూప్ ఉపయోగించారని ఆరోపిస్తూ వీడియో క్లిప్స్, ఫోటోలు షేర్ చేస్తున్నారు. “ప్రభాస్‌తో కాకుండా మరెవరితోనో సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మ‌రోవైపు ప్రభాస్ మాత్రం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్న ప్రభాస్, కల్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ది రాజాసాబ్  నిరాశను మరిచిపోయేలా వచ్చే చిత్రాలతో ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది