Kallu Chidambaram : కోట్ల ఆస్తులు ఉన్నా, కళ్లు చిదంబరం కంటికి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా?
Kallu Chidambaram : హాస్యం అనేది తెలుగు సినిమాలో ఎల్లపుడూ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అలనాటి హాస్య నటులు గురించి చెప్పాల్సిన పనే లేదు. వారు నిజమైన కళామ్మతల్లి బిడ్డలు. ఎక్కడా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కి తావు ఇవ్వకుండా తమ హావభావాలతో కడుపుబ్బ నవ్వించేవారు. కాని ప్రస్తుతం తెలుగు సినిమాకి ఇలాంటి కామెడీ స్టార్ లు కరువయ్యారు. మరోవైపు టీవీలో వచ్చే కామెడీ షోలు టాలెంట్ వున్న వారి జోలికి రావడమనే మానేశాయి.. కొత్తదనం పేరుతో చెత్త షోలు చేయడం,డబుల్ మీనింగ్ డైలాగ్స్ పేల్చేవారిని ఎంటర్‌టైన్ చేయడం జరుగుతుంది.
నాటక రంగం నుండి సినిమా రంగంలోకి వచ్చి చాలా మంది కమెడీయన్స్ ప్రేక్షకులకి ఎంతో వినోదం పంచారు. వారిలో కళ్లు చిదంబరం ఒకరు. ఈయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర, ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాదు చేతిలో మాట్లాడే మేకను కొని మోసపోయే సీన్ లో ఈయన కామెడీ చాలా అద్భుతంగ ఉంటుంది. అమ్మోరు చిత్రం కూడా ఈయనకి మంచి గుర్తింపు తెచ్చింది. అయితే నాటకాలు వేస్తూ వేస్తూ చాలా సేవలు చేసిన చిదంబరం, సరిగ్గా తిండి లేక నిద్రలేకపోవడం వల్ల ఒక చిన్న నర్వ్ (నరం) అలా పక్కకి జరగడంతో మెల్ల కన్ను వచ్చింది.
Kallu Chidambaram : ఇది కారణమా?
దాన్ని సరి చేయోచ్చు అని డాక్టర్లు కూడా చెప్పారు. కానీ ఉద్యోగం, నాటకాలు ఇలా బిజీగా ఉండటంతో.. తరువాత చూద్దాం తరువాత చూద్దాం అని నిర్లక్ష్యం చేయడంతో మరింత ఎక్కువైంది. కళ్లు నాటకాన్ని చూసిన ఎంవీ రఘు కళ్లు సినిమాకు తీసుకున్నారు. ఒక్క సినిమా చేశాక మెల్ల కన్ను సరిచేద్దామని అనుకున్నారు. కానీ అదే కలిసి వచ్చిందని అలానే ఉంచేశారు. ఒక్క సినిమా చేసి ఆపేద్దామని అనుకున్నారు. ఆ తరువాత ముద్దుల మావయ్య అనే సినిమా వచ్చింది. రెండో చిత్రం చేసేసి ఇక ఆపేద్దామని అనుకున్నారు. కానీ అలా వరుసగా సినిమాలు వచ్చాయి. డిపార్ట్మెంట్ వాళ్లు కూడా హెల్ప్ చేయడంతో సినిమాల్లోనే కంటిన్యూ అయిపోయారు. కాగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, కళాకారులను ప్రోత్సహించారు.