Sreeja Daughter : శ్రీజ కూతురి బర్త్ డే.. కళ్యాణ్ దేవ్ విషెస్ చెబుతాడా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 5 July 2022, 2:30 pm

Sreeja Daughter : శ్రీజ కూతురు నివృత్తి పుట్టిన రోజు నేడు (జూలై 5). గతంలో అయితే కళ్యాణ్ దేవ్ స్పెషల్‌గా విషెస్ అందించేవాడు. పార్టీ చేసేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. విడిపోయారా? కలిసే ఉన్నారా?అనే విషయాల్లో క్లారిటీ ఉండటం లేదు. ఏ విషయమూ అధికారికంగా ప్రకటించడం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఇంకెన్నాళ్లు ఉంటుందో కూడా చెప్పలేం. సోషల్ మీడియాను బట్టి చూస్తే మాత్రం ఈ ఇద్దరూ చాలా కాలం నుంచి వేర్వేరుగా ఉంటున్నారని అర్థమవుతోంది. గత ఏడాది దీపావళి, క్రిస్మస్ నుంచి ఈ ఇద్దరూ దూరంగానే ఉంటున్నట్టు అనిపిస్తోంది.

ఎందుకంటే సంక్రాంతి వేడుకలు, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో కళ్యాణ్ దేవ్ ఎక్కడా కూడా కనిపించలేదు. పైగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి కళ్యాణ్ దేవ్ పేరుని తీసేసింది. అంతే కాకుండా అన్ ఫాలో కూడా చేసింది. కేవలం శ్రీజ మాత్రమే కాదు.. నిహారిక వంటి వారు కూడా అన్ ఫాలో చేసేశారు. అంతలా వారి మధ్య ఏం సమస్యలు వచ్చాయో తెలియడం లేదు. మొత్తానికి కళ్యాణ్ దేవ్‌ను మెగా ఫ్యామిలీ పూర్తిగా దూరం పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక కళ్యాణ్ దేవ్ సినిమాలు అయితే వచ్చాయా? వెళ్లాయో కూడా తెలియకుండా అయిపోయాయి. సూపర్ మచ్చి, కిన్నెరసాని అనే చిత్రాలు దారుణమైన డిజాస్టర్లుగా మిగిలాయి.

Kalyaan Dhev May Send Wishes For Sreeja Daughter Nivrithi

Kalyaan Dhev May Send Wishes For Sreeja Daughter Nivrithi

అృయితే కళ్యాణ్ దేవ్, శ్రీజ మధ్య ఇంకా ఓ కామన్ పాయింట్ ఉంది. అదే నవిష్క. శ్రీజ కళ్యాణ్‌లకు కలిగిన సంతానమే నవిష్క. అయితే నవిష్క ఫోటోలు, వీడియోలను మాత్రం శ్రీజ, కళ్యాణ్ ఇద్దరూ షేర్ చేస్తుంటారు. ఆ ఒక్క విషయంలోనే ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా పోస్టులు ఏకిభవిస్తున్నాయి. అయితే నివృత్తి కూడా తన తండ్రి గురించి ఎక్కడా చెప్పడం లేదు. ఇది వరకు అయితే కళ్యాణ్ దేవ్ గురించి చెబుతూ పోస్టులు వేసేది. మరి ఇప్పుడు పూర్తిగా మానేసింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో నివృత్తి బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ విషెస్ చెబుతాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. చెబితే వాళ్లు రియాక్ట్ అవుతారా? లేదా? అన్నది కూడా చూడాలి.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp