Home » Entertainment » Kalyan Dev Not Attends To Promotions
Entertainment

Kalyan Dev : మెగా అల్లుడి సినిమా అలా వ‌దిలేశారేంటి.. హీరో ప‌ట్టించుకోవ‌ట్లేదు, మెగా ఫ్యామిలీ అంత‌కన్నా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: January 12, 2022 6:03 pm
Advertisement

Kalyan Dev : మెగా ఫ్యామిలీ హీరోలు మంచి మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా పరిచయమై ఇప్పుడు పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి మూవీ చేస్తున్నారు. ఇందులో రచిత రామ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి.ఈ రోజు చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. లవ్ అండ్ యాక్షన్ అంశాలు కలబోసి ఫ్యామిలీ ఎంటర్‏టైనర్ గా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.

Advertisement

ప్రయాణం ఆపేస్తే.. గమ్యానికి విలువ ఏముంది అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కళ్యాణ్ దేవ్ పోనీటైల్ తో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. కాకపోతే అతనికి వేరే వారితో డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్‌తో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు.సూప‌ర్ మ‌చ్చి సినిమాను కొంత ఎక్కువ మొత్తంతోనే తెర‌కెక్కించారు.

kalyan dev not attends to promotions

Advertisement

Kalyan Dev : మెగా ఫ్యామిలీతో క‌ళ్యాణ్ దేవ్‌కి చెడిందా?

థమన్ మ్యూజిక్ ఇలా బాగానే ఖర్చు చేసారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ లకు ఆయన కనిపించడం లేదు. ఆఖరికి ట్రయిలర్ ను కూడా సింపుల్ గా వదిలేసారు. చిన్న సినిమాల‌కు పెద్ద స‌పోర్ట్‌గా నిలిచిన చిరంజీవి ఈ సినిమా ఊసే ఎత్త‌డం లేదు. చ‌ర‌ణ్ కూడా ఎప్పుడు మాట్లాడ లేదు. ఇవ‌న్నీ చూస్తుంటే మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ కు మధ్య దూరం పెరుగుతోందని ఆ మధ్య గ్యాసిప్ లు వినిపించాయి. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఆ గ్యాసిప్ లు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి