Kalyan Ram : టీడీపీ జెండా పట్టుకున్న కళ్యాణ్ రామ్.. పేటలో ఎటు చూసినా బాబాయ్.. ఇద్దరు అబ్బాయిల ఫ్లెక్సీలే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalyan Ram : టీడీపీ జెండా పట్టుకున్న కళ్యాణ్ రామ్.. పేటలో ఎటు చూసినా బాబాయ్.. ఇద్దరు అబ్బాయిల ఫ్లెక్సీలే..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kalyan Ram : టీడీపీ జెండా పట్టుకున్న కళ్యాణ్ రామ్.. పేటలో ఎటు చూసినా బాబాయ్.. ఇద్దరు అబ్బాయిల ఫ్లెక్సీలే..!

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి విజయశాంతి ఆయన తల్లిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, అశోక క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Kalyan Ram టీడీపీ జెండా పట్టుకున్న కళ్యాణ్ రామ్ పేటలో ఎటు చూసినా బాబాయ్ ఇద్దరు అబ్బాయిల ఫ్లెక్సీలే

Kalyan Ram : టీడీపీ జెండా పట్టుకున్న కళ్యాణ్ రామ్.. పేటలో ఎటు చూసినా బాబాయ్.. ఇద్దరు అబ్బాయిల ఫ్లెక్సీలే..!

Kalyan Ram : ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రమోషన్లో టీడీపీ జెండాతో కళ్యాణ్ రామ్ సందడి

ఇటీవల విడుదలైన ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కళ్యాణ్ రామ్ యాక్షన్ సన్నివేశాలు, విజయశాంతి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం నరసరావుపేటలో భారీ ఎత్తున అభిమానులతో ర్యాలీగా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

నరసరావుపేటలో ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రమోషన్ సందడి నెలకొంది. ఎటుచూసినా నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ర్యాలీలో పాల్గొన్న అభిమానులు టీడీపీ జెండాలను ప్రదర్శించగా, కళ్యాణ్ రామ్ స్వయంగా అడిగి మరీ ఆ జెండాను తీసుకున్నారు. ఈ సంఘటన టీడీపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గత కొద్దీ నెలలుగా చంద్రబాబు కు దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్..ఇప్పుడు జెండా పెట్టుకొనేసరికి చంద్రబాబు కు దగ్గర కాబోతున్నాడా..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే సందర్భంగా మరికొంతమంది తన సినిమా కోసమే ఇలా టీడీపీ జెండా పట్టుకున్నాడని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఘటన గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది