kamal hassan admitted into the hospital
Kamal Hassan : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు అనారోగ్యం వలన లేదంటే కరోనా వలన కన్నుమూసిన విషయం తెలిసిందే. వారి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటుగా మారింది. అయితే ప్రముఖులు ఎవరైన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారంటే అభిమానులలో ఆందోళన కలుగుతుంది. తాజాగా కమల్ హాసన్ మరోసారి ఆసుపత్రిలో కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఇటీవల కరోనా మహమ్మారి వలన కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న కమల్ డిశ్చార్జ్ అయ్యాక తమిళ ‘బిగ్ బాస్’ తాజా సీజన్ ను హోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మరోసారి కమల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అనే విషయం ఆయన అభిమానులను ఆందోళకు గురి చేస్తోంది.
కమల్ ఆరోగ్యంపై ఆందోళన
ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరినట్టు చెప్తున్నారు. జనరల్ చెకప్ అయితే వెంటనే కమల్ ఇంటికి వెళ్లనున్నారు. కాబట్టి ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే కమల్ ఆసుపత్రిలో చేరారన్న విషయంపై ఇంకా అఫీషియల్ ప్రకటన కూడా ఏమీ రాలేదు. ప్రస్తుతం కమల్ “విక్రమ్”, “ఇండియన్-2” సినిమాలు చేస్తున్నారు. “విక్రమ్” సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరో ఇద్దరు సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి కనిపించబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 31న విడుదలకు సిద్ధమవుతోంది.
kamal hassan admitted into the hospital
కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థ సంయుక్తంగా తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు తొలి ప్రయత్నంగా శివకార్తికేయన్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే కమల్ రీసెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌తో కలిసి పుష్ప చిత్రాన్ని చూశారు. ఈ విషయాన్ని రాక్‌స్టార్ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
This website uses cookies.