Indian 2 Movie : తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బిజినెస్ లెక్కలివే.. కమల్ కెరీర్ బెస్ట్..!
Indian 2 Movie : లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తుంది. తనకు పేపర్ లో ఎక్కడైనా అవినీతికి సంబందించిన వార్త చదవగానే సేనాపతి గుర్తుకు వస్తాడు. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా చేశానని అన్నారు శంకర్. ఇక ఈ సినిమా కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా భరీగా రిలీజ్ చేస్తున్నారు.కమల్ హాసన్ సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భారతీయుడు సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రాబోతున్న ఇండియన్ 2 సినిమాకు కూడా మంచి బిజినెస్ జరిగింది. ఇండియన్ 2 సినిమాను తెలుగులో సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. ఐతే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇండియన్ 2 బిజినెస్ లెక్కలు సర్ ప్రైజ్ చేస్తున్నాయి.
తెలుగులో కమల్ కి ఉన్న క్రే ధృష్ట్యా ఇండియన్ 2 బిజినెస్ కూడా భారీగానే జరిగింది. సినిమాను నైజాం లో 9 కోట్లకు, ఆంధ్రా లో 11 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు మొత్తంగా 24 కోట్ల బిజినెస్ తో ఇది రిలీజ్ అవుతుంది. సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ చూస్తే ఇదేమంత పెద్దది కాదని చెప్పొచ్చు. ఇండియన్ 2 సినిమా 25 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ అన్నట్టు లెక్క.
Indian 2 Movie : తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బిజినెస్ లెక్కలివే.. కమల్ కెరీర్ బెస్ట్..!
కొన్నాళ్లుగా కెరీర్ లో ఫాం లో లేని కమల్ విక్రం సినిమాతో తిరిగి ఫాం లోకి వచ్చారు. ఆ సినిమా నుంచి వరుసగా సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఈమధ్యనే ప్రభాస్ కల్కి సినిమాలో సుప్రీం యాస్కిన్ పాత్రలో మెప్పించారు కమల్. శుక్రవారం ఇండియన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియన్ 2 సినిమా మీద అటు డైరెక్టర్ శంకర్, ఇటు కమల్ హాసన్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.