Indian 2 Movie : తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బిజినెస్ లెక్కలివే.. కమల్ కెరీర్ బెస్ట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indian 2 Movie : తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బిజినెస్ లెక్కలివే.. కమల్ కెరీర్ బెస్ట్..!

Indian 2 Movie : లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తుంది. తనకు పేపర్ లో ఎక్కడైనా అవినీతికి సంబందించిన వార్త చదవగానే సేనాపతి గుర్తుకు వస్తాడు. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా చేశానని అన్నారు శంకర్. ఇక ఈ సినిమా కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా భరీగా రిలీజ్ చేస్తున్నారు.కమల్ హాసన్ సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Indian 2 Movie : తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బిజినెస్ లెక్కలివే.. కమల్ కెరీర్ బెస్ట్..!

Indian 2 Movie : లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తుంది. తనకు పేపర్ లో ఎక్కడైనా అవినీతికి సంబందించిన వార్త చదవగానే సేనాపతి గుర్తుకు వస్తాడు. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా చేశానని అన్నారు శంకర్. ఇక ఈ సినిమా కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా భరీగా రిలీజ్ చేస్తున్నారు.కమల్ హాసన్ సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భారతీయుడు సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రాబోతున్న ఇండియన్ 2 సినిమాకు కూడా మంచి బిజినెస్ జరిగింది. ఇండియన్ 2 సినిమాను తెలుగులో సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. ఐతే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇండియన్ 2 బిజినెస్ లెక్కలు సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

Indian 2 Movie భారతీయుడు 2 హిట్ అనిపించుకోవాలంటే..

తెలుగులో కమల్ కి ఉన్న క్రే ధృష్ట్యా ఇండియన్ 2 బిజినెస్ కూడా భారీగానే జరిగింది. సినిమాను నైజాం లో 9 కోట్లకు, ఆంధ్రా లో 11 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు మొత్తంగా 24 కోట్ల బిజినెస్ తో ఇది రిలీజ్ అవుతుంది. సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ చూస్తే ఇదేమంత పెద్దది కాదని చెప్పొచ్చు. ఇండియన్ 2 సినిమా 25 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ అన్నట్టు లెక్క.

Indian 2 Movie తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బిజినెస్ లెక్కలివే కమల్ కెరీర్ బెస్ట్

Indian 2 Movie : తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బిజినెస్ లెక్కలివే.. కమల్ కెరీర్ బెస్ట్..!

కొన్నాళ్లుగా కెరీర్ లో ఫాం లో లేని కమల్ విక్రం సినిమాతో తిరిగి ఫాం లోకి వచ్చారు. ఆ సినిమా నుంచి వరుసగా సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఈమధ్యనే ప్రభాస్ కల్కి సినిమాలో సుప్రీం యాస్కిన్ పాత్రలో మెప్పించారు కమల్. శుక్రవారం ఇండియన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియన్ 2 సినిమా మీద అటు డైరెక్టర్ శంకర్, ఇటు కమల్ హాసన్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది