Samantha : ఆసమంత నాగ చైతన్య విడాకులపై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
Samantha నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు నేషనల్ స్టార్స్ అయ్యారు. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంత బాలీవుడ్‌లో దుమ్ములేపేసింది. ఇక నాగ చైతన్య అయితే ఏకంగా ఆమిర్ ఖాన్‌తోనే నటించాడు. లాల్ సింగ్ చద్దా అంటూ ఆమీర్ పక్కనే నటించాడు. లవ్ స్టోరీ ఈవెంట్‌లో చైతూ గురించి ఎంతో గొప్పగా చెప్పేశాడు. అయితే అలా ఈ ఇద్దరూ ఇప్పుడు బాలీవుడ్‌లో ఫేమస్.
అందుకే అక్కడి జనాలు కూడా చైసామ్ విడాకుల గురించి రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా కంగనా రనౌత్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది, మామూలుగానే విడాకులు అయ్యాయంటే.. అందరూ కూడా ఆడవారిదే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు.. సమాజం కూడా అలానే చూస్తోందంటూ కంగనా రనౌత్ మండిపడింది. మగ, ఆడ వారి మధ్య ఇదే తేడా ఉందని, సమాజం కూడా అలానే ఉందని, ఎప్పుడూ ఎందుకు ఆడవారినే తప్పు అంటారని ఫైర్ అయింది.
Samantha నాగ చైతన్య, సమంతలపై కంగనా రనౌత్
దాదాపు పదేళ్ల కంటే ఎక్కువగా రిలేషన్ షిప్‌లో ఉంది, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి.. విడాకులు ఇచ్చిన ఆ దక్షిణాది నటుడు ఈ మధ్య బాలీవుడ్ డైవర్స్ స్పెషలిస్ట్, ఎక్స్‌పర్ట్‌తో కలిసి నటించాడు. ఆయన ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. అయితే ఇదంతా ఏమీ సులభంగా జరగలేదు.. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది అంటూ కంగనా రనౌత్ పోస్ట్ వేసింది. అంటే ఆమీర్ ఖాన్‌తో నటించడం వల్లే నాగ చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని కంగనా అర్థం పర్ధం లేని థియరీని చెబుతోంది.