Karan Johar : స్టార్ హీరో భార్యను లవ్ చేసిన కరణ్ జోహర్.. ఆమె రిప్లై అదిరిపోయిందిగా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karan Johar : స్టార్ హీరో భార్యను లవ్ చేసిన కరణ్ జోహర్.. ఆమె రిప్లై అదిరిపోయిందిగా!

 Authored By mallesh | The Telugu News | Updated on :26 August 2022,5:20 pm

Karan Johar : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అవసరం లేదనుకుంట.. హిందీ ఫిలిం ఇండస్ట్రీని కొంత మంది బడా హీరోలతో కలిసి గ్రిప్‌లో పెట్టుకున్నాడు.అంతేకాకుండా స్టార్ హీరో తనయులను, కూతుర్లకు ఎప్పుడూ అందలం ఎక్కిస్తాడు.మిగతా వారికి కనీసం అవకాశాలు కూడా రానివ్వడని బాలీవుడ్‌లో కరణ్ జోహర్‌కు పేరుంది. మెయిన్‌‌గా ఖాన్ ఫ్యామిలీస్‌కు కరణ్ ఆప్తమిత్రుడిగా ఉంటూ వారి వ్యవహారాలు అన్నింటినీ చక్కదిద్దుతాడని మనోడి పేరుంది.

Karan Johar : కరణ్ నన్ను ఆ మాట అన్నాడు..

క‌ర‌ణ్ జోహర్ అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత స్టార్ నిర్మాతగా అవతరించాడు.కాఫీ విత్ కరణ్ అనే షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు.సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ షోలో ఎక్కువగా తారాల శృంగార జీవితం..లవ్ ఎఫైర్స్ గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతాడు కరణ్.. దీంతో కరణ్ షోకు రావాలంటేనే కొందరు భయపడుతుంటారు. తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే కరణ్.. ఇప్పటివరకు ఏ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తూ కనిపించలేదు. కానీ స్టార్ హీరోయిన్ల కూతుర్లను వెంటబెట్టుకుని తిరుగుతుంటాడు. అంతేకాకుండా స్టార్ హీరోయిన్స్‌తో టచ్ లో ఉంటాడని టాక్.

Karan Johar lover star hero wife

Karan Johar lover star hero wife

ఎందుకంటే వారికి అవకాశం దక్కాలంటే కరణ్ ను ప్రసన్నం చేసుకోవాలని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉండగా కరణ్ నపుంసకుడు అని ఓ టాక్ కూడా ఈ మధ్యకాలంలో హల్చల్ చేసింది. తను మగాడిని అని చూపించుకునేందుకే హీరోయిన్లను వెంటబెట్టుకుని తిరుగుతాడని అంతా అనుకుంటున్నారు. అయితే, కరణ్ మాత్రం గతంలో ఓ హీరోయిన్‌ను ప్రేమించానని చెప్పాడు. ఆమె మరెవరో కాదు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ కన్నా. తాను ఆమె ఒక్కదాన్ని మాత్రమే ప్రేమించానని చెప్పాడు.ఈ విషయం పై ట్వింకిల్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. కరణ్ ఒకప్పుడు తనను లవ్ చేశాడని వివరించింది. త‌న‌కు లైట్ గా మీసం ఉండేదని.. నీ మీసం చాలా హాట్ గా ఉందని, అదంటే నాకు ఇష్టమని చెప్పేవాడని ట్వింకిల్ ఖన్నా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది