Karate Kalyani : సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా కొంత పాపులారిటీ తెచ్చుకున్న ఈవిడ ఎక్కువగా వివాదాలో హాట్ టాపిక్ అవుతుంది. కరాటే కళ్యాణిని పేకాట కళ్యాణి అని విమర్శిస్తూ ఉంటారు చాలామంది. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో తరచూ వివాదాల్లో నిలుస్తుంటుంది. c టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అలాగే టివి సీరియల్స్ లో కూడా కరాటే కళ్యాణి నటించింది.
రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి బాబీ అంటూ ఓ సీన్ లో నటించగా ఆ సీన్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అప్పటి నుండి కళ్యాణికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలానే వచ్చాయి. బిగ్ బాస్ ఆఫర్ కూడా ఈవిడ తలుపు తట్టగా, దానిని పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. అలా వెళ్లి ఇలా వచ్చేసింది. 136 గంటల పాటు హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా హరి కథ చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ గున్నిస్ రికార్డు దక్కించుకుంది. ఆమో స్వస్థలం విజయనగరం జిల్లా. ఆమెకు వ్యక్తిగత జీవితం కలిసి రాలేదు. ఆమె ప్రేమించినోడు.. పెళ్లి చేసుకున్నోడు కూడా తనను మోసం చేశారని ఎన్నోసార్లు వాపోయింది.
ఇటీవల బిజెపిలో చేరిన కరాటే కల్యాణి ఆ పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడే వాళ్ల పై నిప్పులు చెరుగుతూ ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూ లలో తాను పూర్తిగా సినిమా లకు కూడా గుడ్ బై చెబుతా అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… హరికథలు, పురాణాలు చెబితే రాని గుర్తింపు తనకు వ్యాంప్ పాత్రల ద్వారా వచ్చినట్టు తెలిపింది. సినిమాల్లోకి వచ్చి తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించారు అని పేర్కొంది. ఇప్పటికీ తాను ఏ షో కు వెళ్ళినా బాబీ అంటూ పిలుస్తారని చెప్పింది. ఇలా వ్యాంప్ పాత్రల ద్వారా తనకు గౌరవం దక్కడం పట్ల బాధపడాలో సంతోషించాలో అర్ధం కాని విధంగా ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.