Karate Kalyani troubles continues
Karate Kalyani : వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతుంది కరాటే కళ్యాణి. బిగ్ బాస్ షోతోను పాపులారిటీ దక్కించుకుంది. ఈవిడ రీసెంట్‌గా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై దారుణంగా దాడి చేసింది. కొన్నేళ్లుగా శ్రీకాంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో వల్గర్ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఆంటీలు, అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. వాళ్లతో సెక్స్ గురించి మాట్లాడటం, కామ కోర్కెలు రగిల్చేలా పచ్చి బూతులు మాట్లాడి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. అందుకే శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ అతన్ని చితకబాదానంది కరాటే కళ్యాణి. ‘నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతన్ని చెంపపై కొట్టింది.
ఆమె అనుచరులు కూడా ఒక్కసారిగా దాడి చేయడంతో శ్రీకాంత్ రెడ్డి తిరగబడ్డాడు.కరాటే కళ్యాణితో పాటు.. తనని కొట్టిన వ్యక్తిపై దాడి చేశాడు శ్రీకాంత్ రెడ్డి. ఈ గొడవలో కరాటే కళ్యాణి చెంప పగలగేలా కొట్టాడు. ఈ కొట్లాటలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత మళ్లీ లేచి.. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించి గుడ్డలు ఊడేట్టుగా కొట్టింది కరాటే కళ్యాణి. ఆమెతో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల అందించి వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది.
Karate Kalyani troubles continues
అయితే అదే టైమ్ లో వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. అలా అడిగినందకు కరాటే కళ్యాణి అతనిపై దాడికి దిగింది. నన్ను అడగడానికి నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని అతను తెలిపాడు. ఈ క్రమంలో తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.