Karthika Deepam 01 August 2022 Episode : రౌడీలు నిరుపం సౌర్యలను ఒకటే గదిలోఎందుకు బంధిస్తారు.? నిరుపం, శౌర్యలు ఒక్కటైపోతారా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 01 August 2022 Episode : రౌడీలు నిరుపం సౌర్యలను ఒకటే గదిలోఎందుకు బంధిస్తారు.? నిరుపం, శౌర్యలు ఒక్కటైపోతారా..

 Authored By prabhas | The Telugu News | Updated on :1 August 2022,10:02 am

Karthika Deepam 01 August 2022 Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదల అయింది. 1 సోమవారం ఎపిసోడ్ 419 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. సౌర్య నిరూపం, హిమ లను చూసి బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య ఆటోలో వెళుతూ.. నిరూపం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆటోకి ఎదురుగా ఒక వ్యక్తి ఫీట్స్ తో పడిపోయి ఉంటాడు. అప్పుడు సౌర్య ఆటో ఆపి తన దగ్గరికి వెళ్తుంది. తన చేతిలో ఒక ఇనప రాడును పెడుతుంది. ఇంతలో అక్కడికి ఇంకొక నలుగురు రౌడీలు వస్తారు. వాళ్లు ఎవరో కాదు సౌర్య మీద ఇంత ముందు పాత కక్ష ఉన్నవాళ్లు, సౌర్య వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని కొడుతుంది. కానీ అయినా రౌడీలు తనని గట్టిగా బంధించి కారులో తీసుకొని ఒక ఇంట్లోకి తీసుకొచ్చి కట్టిపడేస్తారు. కట్ చేస్తే సౌర్య కోసం ఇంట్లో వాళ్లు కంగారుపడుతూ ఉంటారు. నైట్ అయినా ఇంతవరకు శౌర్య ఇంటికి రాలేదు. అని హిమ తనకి ఫోన్ చేస్తుంది. సౌర్య ఫోను నాట్ రీచబుల్ అని వస్తుంది. కానీ హిమ తనకోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.

మళ్లీ ఇంట్లో నుంచి మనకి దూరంగా వెళ్లిపోయి ఉంటుందా నాయనమ్మ అని హిమ సౌందర్యను అడుగుతుంది. అప్పుడు ఆనందరావు ఏం కాదులే అమ్మ ఫోన్ స్విచాఫ్ అయి ఉంటుంది వస్తుందిలే అని అంటాడు. కానీ సౌందర్య దానిని చూస్తే అలా లేదండి. అది మళ్లీ మనల్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వెళ్లిపోతుందండి. అని అంటుంది. అప్పుడు నిరూపం హిమ మేము బయటకెళ్ళి చూస్తాము అని వెళ్ళిపోతారు. కట్ చేస్తే సౌర్యను కట్టిపడేసి, శోభకి ఫోన్ చేసి పని అయిపోయింది మేడం. అని చెప్తారు. ఓకే నేను చెప్పే వరకు అక్కడే ఉంచండి దానిని అని అంటుంది. సౌర్య గట్టిగా అరుస్తూ రౌడీలను తిడుతుంది. అరే ఎదవల్లారా నాకట్లు ఇప్పి చూడండి రా.. మీరు జీవితాంతం జైల్లో ఉండేటట్టు చేస్తాను. అని అంటుంది. అప్పుడు రౌడీలు తన నోటికి ప్లాస్టర్ వేస్తారు. నిరుపం వెతుక్కుంటూ తన ఆటో ఆగిన దగ్గరికి వస్తాడు. సౌర్య సౌర్య అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక పిచ్చోడు పాపని ఎత్తుకెళ్లిపోయారు.

Karthika Deepam 01 August 2022 Full Episode

Karthika Deepam 01 August 2022 Full Episode

నేను అన్ని చూశాను. నేను చెప్తాను.. అని అంటాడు. నాకు పది రూపాయలు ఇస్తే అన్నం తింటాను. అని అంటాడు. అప్పుడు నిరూపం తనకి ₹10 ఇస్తాడు. అప్పుడు ఎవరు ఎలా ఉంటారు. ఎక్కడికి తీసుకెళ్లారు. అని ఆ పిచ్చోడిని నిరూపం అడుగుతాడు. అప్పుడు ఆ పిచ్చోడు వీధి చివరన ఒక బంగ్లా ఉంటుంది అందులోకి తీసుకెళ్లారు అని చెప్తాడు. అప్పుడు అక్కడ నుంచి నిరుపమ ఆ బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉండగా.. ప్రేమలు నిరుపముకి ఫోన్ చేస్తారు. అప్పుడు నీరూపం వాళ్లకి సౌర్య ఆటో కనిపించింది. కానీ సౌర్య కనిపించలేదు. నేను ఒక ప్లేస్ కి వెళ్తున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అని చెప్పి తను ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి చూస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న రౌడీలు ఏదో శబ్దం అవుతుంది. అని బయటికి వచ్చి చూసి ఎవరు లేరు అని మళ్ళీ లోపలికి వెళుతుండగా.. నిరూపం ఒక్కసారిగా డోర్ ని తన్ని తను లోపలికి వెళ్లి రౌడీలను కొట్టి సౌర్యను విడిపిస్తాడు.

రౌడీలు అక్కడ నుంచి బయటికి వెళ్లి డోరు వేసి గడియ పెడతారు. అప్పుడు నిర్పం, సౌర్య బయటికి వెళ్లడానికి వస్తే గడియ పెట్టి ఉంటుంది. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లడానికి దారులు వెతుకుతూ ఉంటారు. కానీ అన్ని గడియలు పెట్టేసి ఉంటాయి. అప్పుడు అక్కడికి ప్రేమ్, హిమ వాళ్లు వస్తారు. వాళ్లు రౌడీలు పారిపోతుంటే చూసి కంగారు పడుతు.. ఆ ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడు సౌర్య, నిరుపమ లను చూసి ఏమైంది. ఏంటి అని బయట నుండే అడుగుతారు. అప్పుడు నిరూపం జరిగిందంతా చెప్తాడు. సరేలే గాని డోర్ తీయి ప్రేమ్ అని అడుగుతాడు. వాళ్లు డోర్ కి పెద్ద తాళం వేశారు రా… అని డ్రామా చేస్తారు. హిమ ప్రేమ్ కలిసి శౌర్యను, నిరూపమును ఒక్కటి చేయాలని ప్లాన్ వేస్తారు. వాళ్లని అందులోనే ఉంచి బయట హిమ ప్రేమ్ లు ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది