Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 29 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన దాసు.. సుమిత్ర కోసం దీప సాహసం
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం: ఇది నవ వసంతం’ (Karthika Deepam: Idi Nava Vasantham). కార్తీక్, దీపల కాంబినేషన్, శౌర్య అమాయకత్వం, కుటుంబంలో జరిగే ఎమోషనల్ డ్రామా ఈ సీరియల్ ను టాప్ రేటింగ్ లో నిలబెట్టాయి. తాజా ఎపిసోడ్ లోని ఒక సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. కుటుంబ గొడవల మధ్య నలిగిపోతున్న కాశీని (Kasi), ఇంటి పెద్ద దిక్కుగా కాంచన (Kanchana) ఓదార్చిన తీరు హైలైట్ గా నిలిచింది. రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ లో నేటి (జనవరి 29) ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చూడండి.
#image_title
Karthika Deepam 2 Today Episode :కాశీ ఆవేదన – కాంచన ఓదార్పు
గత కొన్ని రోజులుగా సీరియల్ లో శ్రీధర్ (Sridhar) రెండో పెళ్లి వ్యవహారం, స్వప్న (Swapna) పుట్టుక చుట్టూ కథ నడుస్తున్న విషయం తెలిసిందే. తన భర్త శ్రీధర్ చేసిన మోసం తెలిసినా, కాంచన చాలా హుందాగా ప్రవర్తిస్తోంది. అయితే, ఈ గొడవల వల్ల స్వప్న భర్త అయిన కాశీ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. అటు అత్తగారి ఇల్లు, ఇటు తన భార్య స్వప్న కుటుంబం మధ్య జరుగుతున్న సంఘర్షణ కాశీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తాజాగా కాశీ డల్ గా ఉండటం గమనించిన కాంచన, అతని దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పింది. “జరిగిన తప్పుల్లో నీ వాటా ఏమీ లేదు బాబు.. నువ్వు బాధపడకు” అంటూ అమ్మలా ఓదార్చింది. స్వప్న, శ్రీధర్ కూతురే అయినప్పటికీ.. ఆ కోపం కాశీపై చూపించకుండా, అతనికి అండగా నిలబడటం కాంచన గొప్పతనానికి నిదర్శనం. కాశీ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, కాంచన చెప్పిన మాటలు సీరియల్ లోనే బెస్ట్ ఎమోషనల్ సీన్ గా నిలిచాయి.
జ్యోత్స్న – పారు భయం
మనం చేసిన తప్పులకు దొరికిపోయామని జ్యోత్స్న (Jyotsna) తన అమ్మమ్మ పారు (Paaru) తో భయంగా చెబుతుంది. రిపోర్ట్స్ మ్యాచ్ కాకపోవడంతోనే సగం దొరికిపోయామని, దశరథ ముఖం చూస్తే అనుమానం వచ్చినట్లే ఉందని పారు అంటుంది. ఆస్తి ఇంకా మన చేతికి రాలేదని, నువ్వు నాకు సపోర్ట్ గా ఉండాలని జ్యోత్స్న కోరుతుంది. అయితే, దాసు (Dasu) ఏమైపోయాడో తెలియక పారు కంగారు పడుతుండగా, అనుకోని విధంగా రౌడీల ఫోన్ నుంచి దాసు మాట్లాడుతాడు.
రాక్షసివని దాసు వార్నింగ్
దాసు ఫోన్ చేసి జ్యోత్స్నకు గట్టిగా క్లాస్ పీకుతాడు. “నీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది.. నీ బుద్ధి మారడం లేదు.. నువ్వు నిజంగా రాక్షసివి” అని మండిపడతాడు. అంతేకాకుండా, కార్తీక్ (Karthik) ను ‘బ్రహ్మదేవుడు’ అని పొగుడుతూ, వాడి నుంచి నువ్వు తప్పించుకోలేవని హెచ్చరిస్తాడు. దీప (Deepa) మహర్జాతకురాలని, ఆమెకు ఏ గండం ఉండదని, ఇక కష్టాలన్నీ నీకే అని జ్యోత్స్నను భయపెడతాడు. నిజం ఒప్పుకుని కాళ్ళ మీద పడటం తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో జ్యోత్స్న తీవ్ర భయాందోళనకు గురవుతుంది.
సుమిత్ర కోసం దీప సాహసం
మరోవైపు ఆసుపత్రిలో సుమిత్ర (Sumitra) ఆరోగ్యం గురించి కార్తీక్ ఆందోళన చెందుతుంటాడు. ఇంటితో సంబంధం లేని దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయని డాక్టర్ ప్రశ్నిస్తుంది. అయితే, సుమిత్రమ్మకు వెంటనే ఆపరేషన్ జరగాలని, అందుకు తన శాంపిల్స్ పరీక్షించమని దీప ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. సొంత కూతురు జ్యోత్స్న బ్లడ్ ఇవ్వడానికి భయపడినా, దీప మాత్రం సుమిత్రను కాపాడాలని తాపత్రాయ పడటం చూసి డాక్టర్ ఆశ్చర్యపోతుంది. దీప, సుమిత్రల మధ్య ఉన్న బంధం గురించి కార్తీక్, డాక్టర్ చర్చించుకుంటారు. చివరికి దీప శాంపిల్స్ టెస్ట్ చేయడానికి డాక్టర్ ఒప్పుకుంటుంది.
పారుకు కార్తీక్ షాక్
ఇంటికి వచ్చిన కార్తీక్ ను పారు, దీప గురించి ఆరా తీస్తుంది. దీంతో కార్తీక్ కు కోపం వచ్చి పారుపై విరుచుకుపడతాడు. “నిజమైన తల్లివి అయితే కనిపించకుండా పోయిన కొడుకు (దాసు) కోసం వెతికేదానివి.. కానీ నువ్వు ఆస్తి కోసం పాకులాడుతున్నావు” అని చురకలు వేస్తాడు. దాసు మామయ్య కిడ్నాప్ విషయం, ఆయన కనిపించకుండా పోవడంలో జ్యోత్స్న పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా, పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇద్దామని పారుతో అనడంతో, పారు ముఖంలో రంగులు మారతాయి.
ట్విస్ట్‌లతో సాగుతున్న కథ
మరోవైపు కార్తీక్ (Karthik), దీప (Deepa) ల మధ్య బంధం బలపడుతుండగా.. జ్యోత్స్న (Jyotsna) చేసే కుట్రలు ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. కాంచన తీసుకున్న ఈ నిర్ణయం.. రాబోయే రోజుల్లో స్వప్న, కాశీల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. శ్రీధర్ చేసిన తప్పుకు కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తున్న తరుణంలో, కాంచన తీసుకుంటున్న నిర్ణయాలు కథను మలుపు తిప్పుతున్నాయి. అలాగే, రాబోయే ఎపిసోడ్ లో దీప శాంపిల్స్ సుమిత్రకు మ్యాచ్ అవుతాయా? దాసు వార్నింగ్ తో జ్యోత్స్న ఏం చేయబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.