Karthika Deepam 01 July Today Episode : చీ.. జీవితంలో హిమ మొహం చూడను అన్న జ్వాల.. నిరుపమ్ ను ప్రేమించడం జ్వాల ఆపేస్తుందా? వేరే పెళ్లి చేసుకుంటుందా?

Karthika Deepam 01 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 1393 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోనీ.. నీకు వేరే సంబంధం ఏమైనా చూడమంటావా అని జ్వాలను అడుగుతాడు ఆనంద రావు. దీంతో వద్దు అంటుంది. నా జీవితం మొత్తం డాక్టర్ సాబ్ కోసమే అనుకున్నా. ఆయన్ను కాదని నేను వేరే పెళ్లి చేసుకోను.. చేసుకోలేను. నా జీవితంలో డాక్టర్ సాబ్ లేకపోతే.. ఇక ఎవ్వరూ వద్దు. నాకు చెల్లి ఎలా లేదో.. ఇప్పుడు నాకు పెళ్లి కూడా లేదు.. అని సౌందర్య, ఆనంద రావుకు చెబుతుంది జ్వాల. ఆ తర్వాత కార్తీక్ ఫోటోను తీసుకొని ఆ ఫోటోతో మాట్లాడుతుంది జ్వాల. ఏంటి నాన్న నా జీవితం ఇలా తయారైంది. కనీసం నా మొగుడు డాక్టర్ అని చెబుదామనుకున్నా అనుకుంటుంది. కానీ.. ఇంతలోనే ఇలా జరిగింది అంటుంది. మరోవైపు హిమ కూడా కార్తీక్, దీప ఫోటోలతో మాట్లాడుతుంది. నేను ఎంత చేసినా శౌర్య, నిరుపమ్ బావలను కలపలేకపోతున్నాను అంటుంది.

karthika deepam 01 july 2022 full episode

మోసపోయాను నాన్న. ఆ తింగరి నా కలలను మొత్తం మోసం చేసింది అని అంటుంది జ్వాల. మీ డాక్టర్ సాబ్ అంటూ గొప్ప ద్రోహం చేసింది నాన్న అంటుంది జ్వాల. పాపం.. శౌర్య నా మూలంగా కష్టాలు పడుతోంది అనుకుంటుంది హిమ. ఎక్కడో పెరిగింది. ఆటో నడుపుకుంటోంది అంటుంది హిమ. ఇలాంటి నా జీవితంలో డాక్టర్ సాబ్ పరిచయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని అనుకుంటుంది జ్వాల. నాలో కొత్త ఆశలు రేపింది. ఒక ఆడపిల్లనని మరిచిపోయిన నాకు డాక్టర్ సాబ్ ను చూశాక కొత్త జీవితం మొదలైనట్టుగా అనిపించింది. మోసపోయాను నాన్న. ఆ తింగరి చేతిలో మోసపోయాను. అమ్మను మోసం చేసి నీ జీవితంలోకి మోనిత ఆంటి ఎలా వచ్చిందో.. అలాగే తింగరి డాక్టర్ సాబ్ ను చేసిందని నా అనుమానం నాన్న అంటుంది జ్వాల. శౌర్య మన దగ్గర ఎంత కాలం ఉంది డాడీ. అందరం కలిశాం అనుకునే లోపే మీకు అలా యాక్సిడెంట్ జరిగింది అంటుంది హిమ.

ఏం చేయమంటావు నాన్న. అందరిలా పెద్ద వాళ్ల అండ లేదు. నాకంటూ కుటుంబం లేదు. ఒంటరి దాన్ని. ఏడవడం కూడా ఎప్పుడో మరిచిపోయాను అనుకుంటుంది జ్వాల. శౌర్యకు నువ్వంటే ఎంతో ప్రేమ. శౌర్య ఎవరి ప్రేమకు నోచుకోలేదు. అందరి ప్రేమకు దూరం అయింది. శౌర్య జీవితంలో ఆనందం నింపాలంటే నిరుపమ్ బావతో తనకు పెళ్లి చేయడం తప్ప ఇంకేం చేయలేం. అయినా నేను ఓడిపోలేదు డాడీ. ఇంకా నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను అంటుంది హిమ.

Karthika Deepam 01 July Today Episode : శౌర్యకు వేరే సంబంధం చూద్దామని హిమతో చెప్పిన సౌందర్య

నిరుపమ్ బావను, శౌర్యను కలపమని నానమ్మను అడగాలని అనుకుంటన్నా. నానమ్మ తలుచుకుంటే ఏదైనా చేయగలదు.. అంటుంది హిమ. నా అన్నవాళ్లు అందరూ ఉన్నా ఎవరూ లేని దానిలా మిగిలాను నాన్న. మీరే లేనప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా ఏంటి. ఒంటరిగానే పోరాడుతాను నాన్న అంటుంది జ్వాల.

మరోవైపు హిమను ఓదార్చుతారు సౌందర్య, ఆనంద రావు. మీరు సపోర్ట్ చేయండి అంటుంది హిమ. శౌర్యకు మంచి సంబంధం చూద్దాం. శౌర్యను సంతోషపెట్టాలంటే నిరుపమ్ తోనే పెళ్లి చేయాలా? ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి కదా. దాని కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు అంటుంది సౌందర్య.

నిరుపమ్ జీవితాన్ని ఎందుకు అర్థం చేసుకోవు అంటుంది సౌందర్య. శౌర్యకు నా మీద పట్టలేనంత ధ్వేషం ఉంది. అమ్మ నాన్నల చావుకు కారణం నేనే అని ధ్వేషం పెంచుకుంది. తనకేదైనా చేయాలనుకుంటే ఇంతకు మించి మనం ఏం చేయలేం నానమ్మ. ఈ రకంగానైనా తన మీద ఉన్న కోపాన్ని తగ్గించగలుగుతాం అంటుంది హిమ.

కట్ చేస్తే.. రవ్వ ఇడ్లీకి యాక్సిడెంట్ అయిందని దుర్గ ఫోన్ చేసి చెబుతాడు. ట్రీట్ మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాను జ్వాల అంటాడు. అప్పటికే హిమ.. రవ్వ ఇడ్లీ దగ్గరికి వెళ్తుంది. అతడికి ట్రీట్ మెంట్ చేస్తుంది. ఊరికే కలుద్దాం అంటే ఎవరూ రారు కదా.. కానీ.. ఇలా దెబ్బలు తాకితే మాత్రం వస్తారు కదా అంటాడు.

అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటుంది హిమ. రవ్వ ఇడ్లీకి ట్రీట్ మెంట్ చేస్తుండగానే ఇంతలో అక్కడికి జ్వాల వస్తుంది. డాక్టరమ్మకు నువ్వే ధైర్యం నేర్పించావట కదా జ్వాల అంటాడు రవ్వ ఇడ్లీ. నీ పేరు చెబుతూ ఇంజెక్షన్ చేసింది. అసలు నొప్పే పెట్టలేదు తెలుసా అంటాడు రవ్వ ఇడ్లీ.

మరోవైపు జ్వాల వెళ్తుండగా ఆపి.. జ్వాల నేను చెప్పేది విను ప్లీజ్ అంటుంది హిమ. దీంతో ఏం చెబుతావు.. నువ్వు ఎలా నన్ను మోసం చేశావో చెబుతావా అని అంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ ను ప్రేమించడం ఆపొద్దు అని చెబుతాను. మనసును చంపుకోవద్దు అని చెబుతాను అంటుంది హిమ.

దీంతో జ్వాల షాక్ అవుతుంది. ఛీ.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. దీంతో హిమకు ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత ఆటోను ఆపుతుంది జ్వాల. ఈ తింగరికి నేను ఎలా కనిపిస్తున్నాను. చేసిన మోసం చేసింది. ఇప్పుడేమో మళ్లీ కొత్తగా మనసు చంపుకోవద్దు అని చెబుతోంది. తనకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా. జీవితంలో తన మొహం చూడకూడదు ఛీ.. అని అనుకుంటుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

51 minutes ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

2 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

3 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

4 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

5 hours ago

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

6 hours ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

7 hours ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

8 hours ago