Home » Entertainment » Karthika Deepam 03 June 2022 Full Episode
Entertainment

Karthika Deepam 03 June Today Episode : ప్రేమ్ ప్రపోజ్ చేసిన వీడియో హిమ చుసిందా.!? జ్వాలను అడ్డంగా బుక్ చేసిన శోభ..

Authored By
S Kumar
The Telugu News | Updated on: June 4, 2022, 10:15 am
Advertisement

Karthika Deepam 03 June Today Episode : శోభ దగ్గరకి తన పనిమనిషి శాంతబాయ్ వచ్చి జ్వాల వాళ్ళ బాబాయి, పిన్ని వాళ్ళు దొంగలని చెబుతుంది. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు శాంతబాయ్.. జ్వాల కరెక్ట్ గా దొరికావే నువ్వు.. నన్నే చెంప దెబ్బ కొట్టవు కదా.. ఈ ఇన్ఫర్మేషన్ వాడుకుని నీ సంగతి తెలుస్తాను అని అనుకుంటుంది శోభ..! హిమ నీ మనసులో ఏముందో మాకు చెప్పమని సౌందర్య, ఆనందరావు అడుగుతారు. హిమ అసలు ఏం జరిగిందో చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు ప్రేమ్ హిమ నా ప్రేమని నువ్వే యాక్సెప్ట్ చేయాలని తను లవ్ ప్రపోజ్ చేస్తున్న వీడియోని హిమకు పంపిస్తాడు. హిమ వాళ్ళ నానమ్మ తాతయ్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ ఫోన్ ను విసిరికొడుతుంది.. ఏమై ఉంటుంది హిమ ఎందుకు నా వీడియో ఎందుకు చూడలేదు. హిమ హిమ త్వరగా నా వీడియో చూడు అని మనసులో అనుకుంటాడు ప్రేమ్..

Advertisement

డాక్టర్ సాబ్ ఒక ప్రశ్న అడగనా అని జ్వాల అంటుంది.. అడుగు జ్వాల నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అని అంటాడు.. మీరు ఇదివరకటిలాగా ఉండటం లేదు..  చాలా డల్ గా ఏదో కోల్పోయిన వారిలా కనిపిస్తున్నారు. నేను ఏమైనా హెల్ప్ చేయగలనా.. చెప్పండి డాక్టర్ సాబ్ అంటుంది.. నీతో కాసేపు అలా గడిపితే నేను ప్రశాంతంగా ఉంటాను అని అంటాడు. హమ్మయ్య మీరు నవ్వేసారు. చాలా సేపటి తర్వాత మీరు నవ్వారు. మీ నవ్వు చాలా బాగుంటుంది డాక్టర్ సాబ్.. శోభ హిమకు ఫోన్ చేసి నేను ఒక పార్టీ ఇస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి అని అంటుంది. నీతో పాటు ఆ అమ్మాయి ఆటో అమ్మాయిని కూడా తీసుకురా అని అంటుంది శోభ. ఈ ఫంక్షన్ కి స్వప్న ఆంటీ కూడా వస్తుంది అని శోభ అనగానే.. హిమ మనసులో స్వప్న ఈ ఫంక్షన్ లో ఏమైనా వీళ్ళ పెళ్లి గురించి అనౌన్స్ చేస్తుందా..

karthika deepam 03 june 2022 full episode

Advertisement

ఒకవేళ అలా అనౌన్స్ చేస్తే కనుక వెంటనే నానమ్మతో సౌర్య ప్రేమ గురించి చెప్పి.. ఇద్దరికీ పెళ్లి చేసేలా చేయాలి అని అనుకుంటుంది హిమ. జ్వాలాకి ఫోన్ చేసి ఈ ఫంక్షన్ కి రమ్మని చెప్పాలి అని అనుకుంటుంది. ఇంద్రుడు, చంద్రుడు ఒక హోటల్ కి పని కోసం వెళ్తారు. అక్కడే ఒక పక్కన శోభ కూర్చుని ఉంటుంది. ఇంద్రుడు, చంద్రుడు అంటే విళ్లేనా వీళ్లని అడ్డం పెట్టుకుని ఆ జ్వాల సంగతి చూడాలి అని అనుకుంటుంది శోభ. ఆ హోటల్ మేనేజర్ ఇంద్రుడు చంద్రుడు కి ఒక చోట క్యాటరింగ్ ఉందని అక్కడికి వెళ్లి బుద్ధిగా పని చేసుకోమని చెబుతాడు అక్కడ పని బాగా చేశారు.

అని నాకు తెలిస్తే మీకు ఒక రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చి భోజనం కూడా పెడతానని చెబుతాడు సరే అని ఇంద్రుడు ఆ కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు.. శోభ స్వప్న దగ్గరకు వచ్చి జ్వాల వాళ్ళ బాబాయ్ పిన్ని దొంగలు అని చెబుతుంది. ఈరోజు ఫంక్షన్ లో వాళ్ళని దొంగల గా ప్రూవ్ చేస్తాను. దాంతో వాళ్లు మన ముందు తలదించుకుని ఉంటారు. ఆ జ్వాల ఏడుస్తూ తల దించుకుని మన ముందు నుంచి వెళ్తుంది.. చాలా రోజుల తరువాత నాకు గొప్ప అవకాశం వచ్చింది అని స్వప్న అనుకుంటుంది. ఈ దెబ్బతో జ్వాలా అనే క్యారెక్టర్ కి పులిస్టాప్ పెట్టొచ్చు ఆంటీ అని శోభ అంటుంది.

S Kumar

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి