Karthika Deepam 03 Sep Today Episode : దీపని, కార్తీక్ గుర్తుపట్టకుండా ఉండడానికి ఎన్నో డ్రామాలాడుతున్న మోనిత…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 3, 2022, 10:00 am

Karthika Deepam 03 Sep Today Episode : కార్తీకదీపం సీరియల్. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 1448 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ దీప చెప్పిన పేర్లను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సౌర్య అమ్మానాన్నల కోసం ఎంత వెతికినా కనిపించడం లేదు అని బాధపడుతూ ఉండగా… వారణాసి వాళ్ళు కనిపించడానికి ఎక్కడున్నారమ్మ అని అంటారు. అప్పుడు ఒక్కసారిగా సౌర్య వారణాసి పై కోప్పడుతుంది. తర్వాత అమ్మానాన్న ఫోటోలు ఉంటే వాటిని పోస్టర్లుగా అతికించి అందర్నీ అడుగుదాం అని చెప్తుంది. కట్ చేస్తే మౌనిత దీప గురించి ఆలోచిస్తూ కంగారుపడుతూ భయపడుతూ ఉండగా… దీప బిర్యాని తీసుకొచ్చి డాక్టర్ బాబుని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ సంతోషంతో నన్ను డాక్టర్ బాబు అని పిలవకండి అని అంటాడు. నాకు అలా పిలవడం ఇష్టమని చెప్పి మీరు నన్ను అండి అనకండి పేరు పెట్టి పిలవండి అని అంటుంది.అప్పుడు మౌనిత దీపపై కోప్పడుతూ ఉంటుంది.

అప్పుడు కార్తీక్ ఏం కాదులే మౌనిత ఎందుకు తనపై కోప్పడతావు ఏదో ఒక పేరుతో పిలవనివ్వు అని అంటాడు. దీప కార్తీక్ బిర్యానీ వడ్డిస్తూ ఉండగా కార్తీక్ తింటూ నీ పేరేంటి అని దీపాన్ని అడుగుతాడు. అప్పుడు తన పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు ఎలా పిలుస్తారో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ చెప్పావు గుర్తుంది అని ఇలాంటి బిర్యాని రోజు తింటే ఇంకేం కావాలి అంటూ దీప ని మెచ్చుకుంటాడు. అప్పుడు దీప తేగ సంతోష పడిపోతూ ఉంటుంది. అలా తినేసి కార్తీక్ రూంలోకి వెళ్లి పోతాడు. ఇక మౌనిత దీప మధ్య చిన్న ఘర్షణ జరుగుతుంది దీప చూసావు కదా.. నా డాక్టర్ బాబు నాకు ఎలా దగ్గరవుతున్నాడో అని అంటుంది. అప్పుడు మౌనిత నువ్వు ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా తను నా సొంతం అని అంటుంది. కట్ చేస్తే సౌర్య భోజనం చేస్తూ దీపచేసిన బిరియాని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వారణాసి తనకి సర్ది చెప్పి ధైర్యం చెబుతూ తినమని బ్రతిమిలాడతాడు. కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పేస్తుంది. అప్పుడు డాక్టర్ నువ్వు ఇలా కార్తిక్ కి గతం గుర్తు చేస్తున్నావని తాను గమనించి ఇంకాస్త డోస్ పెంచుతుందేమో నువ్వు అది గమనించు అని దీపకు చెప్తూ ఉంటాడు.

Karthika Deepam 03 September 2022 Full Episode

Karthika Deepam 03 September 2022 Full Episode

అప్పుడు అది ఇలాంటివి ఏం చేసినా నా భర్తని నా నుండి దూరం చేయలేదు అని అంటుంది. నిన్ను గుర్తుపట్టే లోపు వాళ్ళిద్దరూ ఒకటైతే అనే డాక్టర్ అంటాడు. అలా జరగదు అన్నయ్య అని అంటుంది. అప్పుడు పెద్ద ఆవిడ అది దేనికైనా తెగిస్తుంది అమ్మ దాంతో జాగ్రత్తగా ఉండు అని అంటుంది. కట్ చేస్తే సౌర్య, వారణాసి నీ ఫోన్లో ఫోటోలు ఉన్నాయ్ అన్నావ్ కదా అవి ఏవి అని అడుగుతుంది. అప్పుడు వారణాసి అవి అన్ని డిలీట్ అయ్యాయి అమ్మ అని చెప్తాడు. ఇప్పుడు ఎలా అని సౌర్య అంటుంది. అప్పుడు అయ్యగారిని అడిగి ఒకటి పంపించమని చెబుదాం అని అంటాడు. అప్పుడు సౌర్య వద్దు.. వాళ్లకి నేను ఇక్కడ ఉన్నాను సంగతి తెలియదు.. వాళ్లకు తెలిస్తే నా దగ్గరికి వస్తారు.

వాళ్లు ఇక్కడికి వస్తారు నన్ను రమ్మంటారు నేను వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటా అని అంటుంది. అప్పుడు వారణాసి మరి హిమ మీద కోపం ఎప్పుడు పోతుంది. అక్కడికి ఎప్పుడు వెళ్తావు అమ్మ అని అడుగుతాడు. అప్పుడు శౌర్య అమ్మానాన్నలు బ్రతికి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్తా అని అంటుంది. అప్పుడు వారణాసి నీకు వాళ్ళు లేరు అన్న సంగతి ఎలా అర్థమవుతుందమ్మా అని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే దీప కూరగాయలు తీసుకొని వచ్చి డాక్టర్ బాబు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీపని కార్తీక్ గుర్తుపట్టకుండా ఉండేందుకు కార్తీక్ తననీ తిట్టేందుకు డ్రామాలాడుతూ ఉంటుంది మౌనిత. కార్తిక్ డ్రామాలన్ని నమ్మి దీపని తిట్టడానికి వచ్చి తిడుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp