Karthika Deepam 08 Sep Today Episode : కార్తీక్ గతం గుర్తొచ్చేలా చేస్తున్న వంటలక్క… దీప చెప్పిన విధంగా చేస్తున్న డాక్టర్ బాబు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 08 Sep Today Episode : కార్తీక్ గతం గుర్తొచ్చేలా చేస్తున్న వంటలక్క… దీప చెప్పిన విధంగా చేస్తున్న డాక్టర్ బాబు…

 Authored By prabhas | The Telugu News | Updated on :8 September 2022,10:00 am

Karthika Deepam 08 Sep Today Episode : కార్తీకదీపం ఈ సీరియల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1452 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… గుడిలో దీప ప్రమాణం చేసి మౌనితని కూడా చేయమని అడుగుతూ ఉండగా.. మౌనిత కంగారుపడుతూ దిక్కులు చూస్తూ ఉండగా.. శౌర్య అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సౌర్యాన్ని చూసి వీళ్లంతా నా చుట్టే ఉన్నారు. వీళ్ళెవరు నన్ను చూడవద్దని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని కంగారుపడుతూ కార్తీక్ ని లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు దీప చూసావా.. డాక్టర్ బాబు నేను ప్రమాణం చేశాను తనను చేయమంటే ఇలా తప్పించుకుంటుంది.. ఇకనైనా మీరే అర్థం చేసుకోండి ఎవరు తప్పు చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు అక్కడ నుంచి కార్తీక్, మౌనిత వెళ్ళిపోతారు. తర్వాత వారణాసి, సౌర్య కూడా వెళ్ళిపోతారు. మౌనిత కార్తీక్ కార్లో వెళ్తూ ఉండగా.. మోనిత, కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్లంతా తెలిసే వచ్చారా ఏంటి మమ్మల్ని చూశారా..

అని భయపడుతూ కంగారుపడుతూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ వంటలక్క ఏ తప్పు చేయలేదు కాబట్టి ప్రమాణం చేసింది. నువ్వే ప్రమాణం చేయకుండా తప్పించుకొని వస్తున్నావు.. అని మౌనిత అని తిడుతూ ఉండగా… మౌనిత మండిపడుతూ కారు ఆపమని దిగి కార్తీక్ ని నీకు ఆ వంటల ఎక్కువ నేను ఎక్కువ దాని గురించి ఎందుకు ఊరికే మాట్లాడతావు దాన్ని ఎందుకు నమ్ముతున్నావు దానిని ఇక కలవను, మాట్లాడను అని నాకు ప్రమాణం చేయి అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఈ ఊరికే ఈ ప్రమాణాలు ఏంటి అసలు నువ్వు అసలు నా భార్య నా.. లేదా టీచర్ వా అని కోప్పడుతూ మౌనితని రోడ్డుపైనే వదిలేసి తను వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనిత కంగారు పడుతూ ఉంటుంది. కట్ చేస్తే వారణాసి సౌర్య ఒక దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ సౌర్య వాళ్ళ అమ్మానాన్న గురించి వాళ్ళు ఎక్కడున్నారు? ఎప్పుడొస్తారు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వారణాసి తను కూడా బాధపడుతూ శౌర్యకి ధైర్యం చెప్తాడు.

Karthika Deepam 08 September 2022 Full Episode

Karthika Deepam 08 September 2022 Full Episode

కట్ చేస్తే దీప పెద్దావిడ దగ్గరకి వెళ్లి గుడిలో జరిగిందంతా చెబుతుంది. పాపం చేసిన వాడు ఏనాడు ప్రమాణం చేయలేరు అని దీపతో అంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వచ్చి తప్పు చేసిన వాడు ఏనాటికైనా బయటపడతాడు తప్పించుకోలేరు. కాబట్టి ఇవన్నీ నువ్వేమి పట్టించుకోకుండా నీ ప్రయత్నం గట్టిగా చేయి అని దీపాకి చెప్తూ ఉంటాడు. అప్పుడు సరే అన్నయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్, డాక్టర్ వాళ్ళ అమ్మ మౌనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే కార్తీక్ మౌనికను తిట్టుకుంటూ వస్తూ ఉంటాడు కానీ ఇంటికి ఎటువైపు ఎల్లాలో అర్థం కాక ఒక దగ్గర ఆగిపోయి.. అప్పుడు కంగారు పడుతూ ఉంటాడు నన్ను ఎవరు తీసుకెళ్తారు అని. అప్పుడు దీప వచ్చి తనని తీసుకొని వెళుతుంది. అంతలో మౌనిత కూడా ఇంటికి వచ్చి చూడగా కార్తీక్ కి దీప తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన మౌనిత ఫాస్ట్గా తన దగ్గరికి వెళుతూ ఉండగా.. దీప సైలెంట్ అని తనకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు కార్తీక్ మౌనిత ని చూసి వచ్చావా.. అని అంటాడు. అప్పుడు మౌనిత నువ్వు దీన్ని తీసుకొచ్చావు దీన్ని ఎలా నమ్ముతున్నావు ఇది నన్ను చంపాలని చూసింది అని అంటూ ఉండగా..

కార్తీక్ తను ఏ తప్పు చేయలేదు అందుకే ప్రమాణం చేసింది. నువ్వే తప్పించుకొని తిరుగుతున్నావు అని మౌనిత అని అంటూ ఉంటాడు. తను లేకపోతే నేను ఈరోజు ఇంటికి వచ్చే వాన్నే కాదు.. అని జరిగింది చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తనకి గుర్తు రాకపోయేసరికి దీపని చెప్పావని అడుగుతాడు. అప్పుడు దీప నేను చెప్పడం కాదు.. మీరే చెప్పాలి గుర్తు తెచ్చుకోండి అని అంటూ ఉండగా కార్తీక్ నెమ్మదిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత మా ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు థాంక్స్ అని దీప బాధపడేలా చెప్తూ ఉంటుంది. అప్పుడు దీప నువ్వు అప్పట్లో కూడా ఇదే విధంగా చేశావు కార్తీక్ బాబు అప్పుడు నిన్ను తన్ని తరిమేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని మౌనితకి వార్నింగ్ ఇస్తుంది. ఇక దీప వెళ్తూ నేను వినాయకుడు పండుగ చేసుకుంటున్నాను డాక్టర్ బాబు మీరు కూడా రావాలి అని అంటుంది. అప్పుడు నవ్వుతూ సరే వంటలక్క అని అంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది