karthika deepam 1 april 2022 full episode
Karthika Deepam 1 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1315 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య, ఆనంద రావు.. ఇద్దరూ హిమ, శౌర్య గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇల్లు కళకళలాడాలి. అది హిమ పెళ్లితోనే సాధ్యం అవుతుంది అంటాడు ఆనంద రావు. శౌర్య మనల్ని చూసి కూడా తప్పించుకొని తిరుగుతుందేమో.. శౌర్య కనిపించేదాకా తన పెళ్లి మాట ఎత్తొద్దని హిమ చెప్పింది అంటుంది సౌందర్య. ఇటు హిమ అటు ప్రేమ్.. అటు శౌర్య ఇటు నిరుపమ్.. రెండు జంటలుగా మారితే బాగుంటుందని చిన్నప్పుడే అనుకున్నాం కదా అంటాడు ఆనంద రావు.
karthika deepam 1 april 2022 full episode
మరోవైపు జ్వాల.. హిమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను హిమ గురించి ఆలోచిస్తుంటే.. ఈ తింగరిది గుర్తొస్తుందేంటి అని అనుకుంటుంది. నాకేంటో ఈ తింగరిది తగిలింది అని అనుకుంటుంది జ్వాల. వట్టి అమాయకపు పక్షిలా ఉంది అని అనుకుంటుంది. అప్పుడు హిమ.. ప్రతి విషయంలోనూ ఇదేంటి.. అదేంటి అని అడుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ తింగరిది కూడా ఇలాగే ప్రశ్నలు వేస్తోంది. నాకు అసలే కోపం ఎక్కువ. హిమ మీద కోపాన్ని ఈ తింగరి మీద చూపించినా చూపిస్తాను.. అయినా ఆ తింగరి మీద చూపించడం ఎందుకు.. తనను బాధపెట్టడం ఎందుకు. రేపటి నుంచి నేను అటు వెళ్లను. తను బాధపడితే ఆ డాక్టర్ సాబ్ కూడా బాధపడతారు.. అనుకుంటుంది జ్వాల.
అమ్మ నాన్నను డాక్టర్ బాబు అని పిలిచేది. నేను ఇప్పుడు అతడిని డాక్టర్ సాబ్ అని పిలుస్తున్నాను ఏంటి అని అనుకుంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ ను తలుచుకుంటేనే మనసు ఏదోలా అవుతోంది అని అనుకుంటుంది. ఇంతలో ఇంద్రుడు, చంద్రమ్మ వస్తారు.
వాళ్లను చూసి.. ఏంటిది.. ఇప్పుడా ఇంటికి రావడం అంటుంది జ్వాల. ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. తనకు వంటావార్పు చేసి పెట్టాలని తెలియదా అంటుంది. ఇప్పటి దాకా ఎక్కడ తిరుగుతున్నారు అని అడుగుతుంది. చేతి విద్యను ప్రదర్శిస్తున్నారా ఏంటి అని అడుగుతుంది.
ఇంటికి పిల్లలు ఆలస్యంగా వస్తే తిట్టే తల్లిదండ్రులు ఉంటారు.. మనింట్లో ఏంటి పిన్ని అంతా రివర్స్ లో జరుగుతోంది అని అంటుంది జ్వాల. బాబాయి.. నువ్వు మారవా.. పిన్ని మీరు మారరా.. అంటుంది. మనోహర్ సార్.. మీకొక అవకాశం ఇచ్చారు. ఉద్యోగం ఇప్పించారు. అయినా మీరు మారరా అంటుంది.
మరోవైపు హిమ.. రాత్రి అయినా ఇంటికి రాదు. ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని టెన్షన్ పడుతుంటుంది హిమ. ఇదే విషయాన్ని ఆనంద రావుకు చెబుతుంది సౌందర్య. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తను చాలా భయంగా ఉంది. చాలా భయపడుతోంది అని చెబుతుంది సౌందర్య.
మరోవైపు తాము చిన్నప్పుడు బస్తీలో ఉన్న ఇంటికి వెళ్తుంది హిమ. ఎన్ని రోజులకు బస్తీ వచ్చాను. నా మెమోరీస్ అన్నీ అలాగే ఉన్నాయి. మోనిత ఆంటి ఇల్లు ఎలా ఉందో ఏంటో అని అనుకుంటుంది హిమ. అక్కడ కార్తీక్ ఫోటోను చూసి కాసేపు ఏడుస్తుంది హిమ.
కట్ చేస్తే మరోవైపు బస్తీకి వెళ్లాలి వస్తావా అని ఓ వ్యక్తి జ్వాలను అడుగుతాడు. ఏ బస్తీకి అని అడుగుతుంది శౌర్య. శ్రీరామ్ నగర్ బస్తీకి అని అంటాడు. దీంతో తన చిన్నప్పటి విషయాలు గుర్తొస్తాయి జ్వాలకు. అతడిని శ్రీరామ్ నగర్ బస్తీలో దించుతుంది.
అతడిని దించాక.. ఈ బస్తీ గురించి మీకు తెలుసా. ఇక్కడ వారణాసి, లక్ష్మణ్ అని ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. నాకు తెలియదమ్మా.. ఇక్కడ అలాంటి పేరు ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరు అంటాడు. అక్కడి నుంచి వెళ్లబోతూ… తను చిన్నప్పుడు ఉన్న ఇంటిని గుర్తు తెచ్చుకుంటుంది.
ఇంట్లో లైట్స్ వెలిగే ఉంటాయి. దీంతో ఎవరో ఇంట్లో మేలుకొనే ఉన్నారు అనుకొని.. ఇంట్లోకి వస్తుంది శౌర్య. అక్కడ హిమను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.