
karthika deepam 1 december 2021 full episode
Karthika Deepam 1 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1211 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, దీప.. ఇద్దరూ కలిసి డాక్టర్స్ అసోసియేషన్ మీటింగ్ కు వెళ్తారు. వాళ్లతో పాటు సౌందర్య, ఆనందరావు కూడా వస్తారు. డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అందరూ ఏకగ్రీవంగా డాక్టర్ కార్తీక్ గారిని ఎన్నుకున్నాం. సెక్రటరీగా డాక్టర్ రవిని ఎన్నుకున్నాం.. అని భారతి స్టేజ్ మీద చెబుతుంది.
karthika deepam 1 december 2021 full episode
నిజానికి కార్తీక్ ఈ పదవి వద్దన్నారు కానీ.. ఈ పదవికి కార్తీక్ అన్ని విధాలా అర్హుడని అందరి అభిప్రాయం. స్నేహభావం, అంకిత భావం కలవాడు అని చెబుతుంది భారతి. కొడుకు గురించి తల్లికన్నా ఎక్కువ ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి. కార్తీక్ గురించి ఓ నాలుగు మాటలు సౌందర్య గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాం అని అంటుంది భారతి. దీంతో సౌందర్య కాస్త కంగారు పడుతుంది కానీ.. తర్వాత స్టేజ్ మీదికి వెళ్తుంది సౌందర్య. మా అబ్బాయి కార్తీక్ ను ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతుంది సౌందర్య.
ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే అని అంటారు. మా అబ్బాయి అని కాదు కానీ.. కార్తీక్ చాలా మంచివాడు. మృదుస్వభావి. మొహమాటం కొంచెం ఎక్కువే. చిన్న సంఘటనలు రెండు చెప్పి నేను ముగిస్తాను. చిన్నప్పుడు జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ స్కెతస్కోప్ కావాలని అడిగాడు. బొమ్మది కొనిచ్చినా కూడా వినలేదు. దీంతో నిజమైన స్కెతస్కోప్ కొనిచ్చాను.. అని చెబుతుంది సౌందర్య.
ఇంకొకటి ఏం జరిగిందంటే అని సౌందర్య చెప్పబోతుండగా.. మీకంటే నేనే బాగా చెబుతాను అంటూ మోనిత ఎంట్రీ ఇస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. కార్తీక్ గురించి నేనే బాగా చెబుతాను అంటుంది మోనిత. అందరికన్నా ఎక్కువ నాకే తెలుసు కాబట్టి నేను మాట్లాడితేనే బాగుంటుంది అని అంటుంది మోనిత.
దీంతో సౌందర్య.. ఒక వ్యక్తి గురించి తెలిసేది తల్లిదండ్రులకు గురువులకు బాల్యస్నేహితులకు. ఆ తర్వాత బాగా తెలిసేది కలిసి నడిచే భార్యకు మాత్రమే.. అని అంటుంది. కార్తీక్ గురించి నా తర్వాత కార్తీక్ భార్య దీప మాట్లాడుతుంది.. అని చెప్పి షాక్ ఇస్తుంది సౌందర్య.
దీపను పిలుస్తుంది సౌందర్య. మీ వారి గురించి ఎవరో ఊరు పేరు లేనివాళ్లు చెబితే ఏం బాగుంటుంది చెప్పు. దీప రా.. అంటుంది సౌందర్య. ఇంతలో మోనిత నడుచుకుంటూ ముందుకు వస్తుంది. స్టేజ్ ఎక్కుతుంది. మోనిత ఏంటిది.. గొడవ చేయకు అంటే నేనూ డాక్టర్ నే కదా.. మాట్లాడే హక్కు నాకూ ఉంది.. వచ్చే హక్కు కూడా నాకుంది అంటుంది మోనిత.
అందరికీ నమస్కారం.. ఇది డాక్టర్స్ మీటింగ్. ఇక్కడ కొందరు డాక్టర్స్ కాని వారు.. యాక్టర్స్ కనిపిస్తున్నారు. భారతి ఏంటిది.. డాక్టర్ కానివాళ్లను ఇక్కడికి ఎందుకు రానిచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన కార్తీక్ గారి నా హృదయ పూర్వక అభినందనలు. కార్తీక్ గురించి ఆయన తల్లి చెప్పింది. తన భార్యకు కూడా బాగా తెలుసని అన్నారు.. అంటూ నవ్వుతుంది.
ఎందుకు నవ్వుతున్నానంటే పెళ్లయిన కొన్నాళ్లకే తన భార్యకు 11 ఏళ్లు దూరం అయ్యారు. ఈ మధ్యే కలిశారు. అసలు భర్తతో కలిసిలేని భార్యకు భర్త గురించి ఏం తెలుస్తుందంటారు. ఇప్పుడు పేషెంట్ కు ట్రీట్ మెంట్ చేయని డాక్టర్ పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని ఎలా చెప్పగలరు.. ఇదీ అంతే అంటుంది మోనిత.
ఇక్కడున్న మీ అందరికీ మా గురించి తెలుసు. కార్తీక్ బిడ్డకు తల్లిగా నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. మా గురించి అందరికీ తెలుసు. అయితే వచ్చిన దాంట్లో నిజానిజాలు పూర్తిగా తెలియవు కదా. అందుకే అవి చెప్పడానికే నేను వచ్చాను. అందరూ కార్తీక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాడు. గుడ్.. కంగ్రాట్స్ అంటుంది మోనిత.
ఇంతలో కార్తీక్ లేచి వెళ్లిపోదామనుకుంటాడు. కానీ.. కార్తీక్ వద్దు. ప్లీజ్ కూర్చో. నీ ముందే నిజాలు చెబుతాను. అందులో ఏదైనా అబద్ధం ఉంటే నువ్వు చెప్పు అంటుంది మోనిత. కార్తీక్ చెడ్డవాడు అని నేను అనటం లేదు. కార్తీక్ ను ప్రెసిడెంట్ గా మీరు ఎంపిక చేశారు. కానీ నాకు న్యాయం చేస్తేనే కార్తీక్ ప్రెసిడెంట్ గా కొనసాగుతారు.. అంటుంది మోనిత.
కార్తీక్.. తను కట్టుకున్న భార్య ఎక్కడికో అలిగి వెళ్లిపోతే నా దగ్గరికి వచ్చేవాడు. ఫ్రెండ్ షిప్ అన్నాడు. పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే నమ్మాను. తీరా పెళ్లి పీటల మీద కూర్చున్నాక.. ఈ మహానుభావురాలు ఈవిడ గారు పీటల మీది నుంచి కార్తీక్ ను లాక్కెళ్లింది. అప్పుడు నా గుండె పగిలేలా ఏడ్చాను. నన్ను పెళ్లాడుతామని వందల మంది క్యూలో నిలుచున్నారు.
అయినా వాళ్లను కాదని కార్తీక్ పెళ్లి చేసుకుంటా అన్నాడని కార్తీక్ కోసం అందరినీ వదులుకుంటే.. వాళ్ల అమ్మ గారు నా పెళ్లి ఆపేశారు. అప్పుడు నేను ఏం చేయాలి. వేరే ఎవరూ నన్ను చేసుకోరు. కార్తీక్ కూడా నన్ను కాదంటాడు. ఇదెక్కడి న్యాయం అండి.. అంటుంది మోనిత.
గత్యంతరం లేక.. ఆర్టిఫిషియల్ ఇన్సెమ్యులేషన్ తో కార్తీక్ బిడ్డకు తల్లిని అయ్యాను. డెలివరీ టైమ్ లో ఆపరేషన్ కోసం నా భర్తగా హాస్పిటల్ లో సంతకం చేశాడు. ఇదిగో చూడండి.. అంటూ లెటర్ చూపిస్తుంది మోనిత. బిడ్డ పేగు మెడలో వేసుకొని పుట్టాడని శాంతి పూజ చేయాలని కార్తీక్ అమ్మగారే వచ్చి అడిగితే వెళ్లి గుడిలో పూజ కూడా చేశాం.. అంటూ మోనిత చెప్పడం అయిపోగానే.. చప్పట్లు కొట్టుకుంటూ స్టేజ్ మీదికి వస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
This website uses cookies.