
Karthika Deepam 21 september 2022 full episode
Karthika Deepam 1 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 1288 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనితకు తన కొడుకు ఇక్కడే ఉన్నాడని ముందే తెలిసి ఈ నాటకం ఆడుతోందా అని అనుకుంటుంది దీప. మరోవైపు పిల్లలు ఇద్దరూ ఆనంద్ తో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ వస్తాడు. రిమోట్ కారు తీసుకొని వస్తాడు కార్తీక్. ఒరేయ్ తమ్ముడు నీకు కొత్త కారును తెచ్చాడు నాన్న అంటుంది హిమ. ఆనంద్ మనం కారు ఆట ఆడుకుందామా అంటాడు కార్తీక్. అక్కడే ఉన్న దీప, సౌందర్యలకు ఇదేమీ నచ్చదు. డాడీ.. నేను ఇలాంటి కారే నడుపుతూ తమ్ముడిని స్కూల్ కు తీసుకెళ్తాను అంటుంది హిమ.
karthika deepam 1 march 2022 full episode
అసలు.. మోనిత ప్లాన్ ఏంటి. బాబు ఇక్కడే ఉన్నా ఎందుకు తీసుకెళ్లకుండా వెతకమంటోంది అని అనుకుంటుంది దీప. బిడ్డ మీద ఇంత ప్రేమ ఎందుకు పెంచుకుంటన్నావు కార్తీక్. ఇంత ప్రేమ పెంచుకున్నాక.. వీడు మోనిత బిడ్డ అని చెబితే నువ్వు తట్టుకోగలవా అని అనుకుంటుంది సౌందర్య. మీరు తాడికొండకు వెళ్లకుండా వేరే ఊరికి వెళ్లినా బాగుండేది కార్తీక్ అని అనుకుంటుంది సౌందర్య. ఇంతలో కార్తీక్ కు మోనిత ఫోన్ చేస్తుంది. చెప్పు మోనిత అంటాడు. విషయం ఏంటో చెప్పు అంటాడు. సొల్లు ఆపి అసలు విషయం చెప్పు అంటాడు. నా బిడ్డ సంగతి ఏంటి వెతుకుతున్నావా అని అడుగుతుంది మోనిత. బాబును వెతకడంలో నేను నీకు హెల్ప్ చేయనా అని అడుగుతుంది మోనిత. బాబును వెతికే విషయంలో నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి నీకు ఇస్తాను. అవి నీదగ్గరికి తీసుకొస్తాను అంటుంది మోనిత.
దీంతో నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. ఈ వంకతో నా ఇంటికి రావాలని అనుకుంటున్నావా.. అవసరం లేదు. నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను అంటాడు కార్తీక్. దీంతో మోనితకు చాలా సంతోషం వేస్తుంది. కార్తీక్.. నా ఇంటికి రావడం ఏంటి.. అంటూ తెగ సంతోషిస్తుంది.
విన్నీ.. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అంటుంది మోనిత. తనను పట్టుకొని తెగ సంతోషంలో అటూ ఇటూ పరిగెత్తుతూ కిందపడిపోతుంది మోనిత. దీంతో తన కాలు బెనుకుతుంది. ఏంటి విన్ని. మా ఆయన వస్తుంటే ఇలా జరిగింది.. అని అనుకుంటుంది మోనిత.
మరోవైపు కార్తీక్.. కారులో మోనిత ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి అడుగుపెట్టకముందే.. తనకు స్వాగతం పలుకుతూ పూలతో డెకరేషన్ చేస్తుంది మోనిత. దీంతో కార్తీక్ వాటిని చూసి షాక్ అవుతాడు. రా కార్తీక్ అంటుంది మోనిత. దీంతో పూల మీది నుంచి నడుచుకుంటూ వస్తాడు కార్తీక్.
నిజంగానే దెబ్బ తగిలిందా అని అడుగుతాడు. దీంతో అదేంటి కార్తీక్. కాలు మడతపడి స్లిప్ అయింది అంటుంది. కూర్చో అంటే అక్కర్లేదు అంటాడు. బాబును వెతకడానికి ఆధారాలు ఉన్నాయి అన్నావు కదా. అవి ఇస్తే వెళ్లిపోతాను అంటాడు కార్తీక్.
నేను నీతో మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. బాబును వెతకడానికి ఉన్న ఆధారాలు ఉంటే ఇవ్వు. లేదంటే వెళతాను అని అనబోతూ.. ఇద్దరూ ఉన్న ఫోటోను చూస్తాడు. పరిహారదోషం సమయంలో తీసిన ఫోటోను చూసి షాక్ అవుతాడు.
ఇది ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటాడు కార్తీక్. నువ్వు, నేను కలిసి ఉన్న ఫోటో ఉండటం చాలా అరుదు కదా అంటుంది మోనిత. మనం హాస్పిటల్ కు వెళ్లాలి. అక్కడ ఒక లిస్ట్ తీసుకోవాలి అంటుంది మోనిత. తను లేవబోతుంది కానీ.. తనకు లేవరాదు. దీంతో విన్నీని పిలుస్తుంది. విన్నీ తనను లేపుతుంది.
ఆ తర్వాత పదా హాస్పిటల్ కు వెళ్దాం.. అంటుంది. దీంతో నువ్వు ఎందుకు.. నేను వెళ్తానులే అంటాడు కార్తీక్. కానీ.. హాస్పిటల్ లో బాబు పుట్టడానికి ముందు ఉన్న లిస్ట్ తీసుకోవాలి. వేరే ఉద్దేశంతో కాదు అంటుంది మోనిత. దీంతో మోనితను తీసుకొని వెళ్తాడు కార్తీక్.
హాస్పిటల్ కు వెళ్లి లిస్టు తీసుకుంటుంది మోనిత. ఈ లిస్టును ఒకసారి నువ్వు కూడా చూడు అంటుంది మోనిత. ఇందులోనుంచి శ్రీవల్లి, కోటేశ్ పేర్లు తీసేశాను కార్తీక్.. అని మనసులో అనుకుంటుంది మోనిత. నువ్వు వాళ్లను వెతుక్కుంటూనే ఉంటావు. ఆ టైమ్ లో నేను నీకు దగ్గరవుతాను అనుకుంటుంది.
మరోవైపు సౌందర్య, దీప ఒక ప్లాన్ వేస్తారు. బాబును వేరే వాళ్లకు ఎవరికైనా దత్తత ఇవ్వాలనుకుంటారు. దీంతో కార్తీక్ కు ఈ విషయం తెలియకుండా వేరే వాళ్లకు దత్తత ఇచ్చేందుకు ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలిసి వెంటనే అక్కడికి వెళ్లిన మోనిత.. బాబును దత్తత ఇవ్వడానికి నేను ఒప్పుకోను. వాడు నా కన్న కొడుకు అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.