Karthika Deepam 10 March Today Episode : కార్తీక్, దీప, హిమ మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సౌందర్య.. మోనితకు ఈ విషయం తెలిసి ఏం చేస్తుంది?

Karthika Deepam 10 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 1296 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే.. దీప దగ్గరికి వెళ్లి తన ముఖం మీద గాలి ఊదుతాడు. ఆ గాలికే దీప లేచి.. తన పక్కకు కార్తీక్ ను లాక్కుంటుంది. డాక్టర్ బాబు.. రాత్రి నేను ఏమైనా చేశానా అని అంటుంది. దీంతో చాలా చేశావు అంటాడు కార్తీక్. ఏం చేశానో చెప్పండి అంటుంది దీప. దీంతో.. నువ్వు ఏది చేసినా బాగానే ఉంటుందిలే అంటాడు కార్తీక్. మరోవైపు ఆనంద రావు ఎక్కడికో రెడీ అవుతాడు. ఆదిత్య, శ్రావ్య కూడా రెడీ అవుతారు. మమ్మీ ఏది అని అడుగుతాడు ఆనంద రావు. రెడీ అవుతోంది వస్తుంది మమ్మీ అంటాడు ఆదిత్య.

karthika deepam 10 march 2022 full episode

కార్తీక్ ఫోన్ కూడా కలవడం లేదు.. అక్కడ నెట్ వర్క్ ప్రాబ్లమ్ ఉందేమో అని అనుకుంటా అంటాడు ఆదిత్య. ఇంతలో నేను ఫంక్షన్ కు రాలేను.. మీరు వెళ్లండి అని అంటుంది సౌందర్య. మరోవైపు హిమ, శౌర్య ఇద్దరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. దీప కూడా రెడీ అయి అక్కడికి వస్తుంది. అమ్మ.. నువ్వు నాన్న పక్కన నిలుచో. నేను ఫోటోలు తీస్తాను అంటుంది శౌర్య. నాన్నను పట్టుకో అంటుంది శౌర్య. అమ్మను అలాగే పట్టుకొని ఉండు నాన్న.. అంటుంది శౌర్య. దీంతో మీ అమ్మను ఎప్పటికీ వదలను.. చావులో కూడా అంటాడు కార్తీక్. మరోవైపు కారు నేను డ్రైవ్ చేస్తా అంటుంది హిమ. దీంతో ఇప్పుడు వద్దులే.. దారిలో ఎక్కడైనా నీకు రోడ్డు బాగున్నప్పుడు ఇస్తాలే అంటాడు కార్తీక్.

అందరూ కలిసి కారులో బయలుదేరుతారు. హిమను ముందట కూర్చోబెట్టుకొని కారు డ్రైవ్ చేస్తుంటాడు కార్తీక్. మరోవైపు సౌందర్య.. దీపతో కానీ.. కార్తీక్ తో కానీ మాట్లాడాలి అని అనుకుంటుంది. కిందికెళ్తే ఆదిత్య, ఆయన ఉంటారు. కిందికెళ్లి వ్దదు.. అని అనుకుంటుంది.

ఇంట్లో ఎవ్వరికీ లేని బాధ, భయం నాకు మాత్రమే ఎందుకు. గుడిలో అందరూ ఉన్నారు కదా.. పూజారి గారు చెప్పిన దాన్ని అందరూ విన్నారు కదా. అయినా కూడా నేను ఎందుకు ఇంగా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను అని అనుకుంటుంది సౌందర్య.

వెంటనే కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కానీ.. నెంబర్ అందుబాటులో లేదని ఫోన్ కలవదు. దీంతో ఏం చేయాలో సౌందర్యకు అర్థం కాదు. మరోవైపు కారులో సంతోషంగా వెళ్తూ ఉంటారు కార్తీక్ ఫ్యామిలీ. డాడీ.. నాకు అప్పుడే డ్రైవింగ్ వచ్చేసినట్టుంది కదా అంటుంది హిమ.

Karthika Deepam 10 March Today Episode : సౌందర్య నెంబర్ నుంచి ఎక్కువ మిస్డ్ కాల్స్ రావడంతో కారు ఆపిన కార్తీక్

లేదు నాన్నా.. స్టీరింగ్ తిప్పగానే డ్రైవింగ్ వచ్చినట్టు కాదు అంటాడు కార్తీక్. చుట్టుపక్కన ప్లేస్ చూడటానికి బాగుంది కదా డాడీ అంటుంది హిమ. ఏం వంటలక్క ఏం ఆలోచిస్తున్నావు. ఈ కొండలు గుట్టల మధ్య టూరిస్టులకు హోటల్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నావా అంటాడు కార్తీక్.

నేను ఏ హోటల్ పెట్టను.. ఏం చేయను. మీరు ఎక్కడికెళ్తే నేను అక్కడికి వస్తాను అంటుంది దీప. అవును నాన్న మనం ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్దాం. తాడికొండకు వెళ్లి వచ్చిన తర్వాత నాకు ఎలాగో ఉంది అంటుంది శౌర్య. దీంతో ఇంకోసారి తాడికొండ టాపిక్ ఇంకోసారి తీయకు అంటుంది హిమ.

ఇంతలో కార్తీక్ ఫోన్ కు సిగ్నల్స్ వస్తాయి. సౌందర్య ఫోన్ చేసినట్టు మిస్డ్ కాల్స్ పడతాయి. దీంతో కారు పక్కకు ఆపుతాడు కార్తీక్. సిగ్నల్స్ మళ్లీ పోతాయి. దీంతో సిగ్నల్స్ కోసం కొంచెం దూరం వెళ్తాడు కార్తీక్. దీప కూడా వెళ్లబోతుంది. దీంతో అమ్మ నువ్వు ఆగు ఎక్కడికి అంటుంది దీప.

కారు ఎలాగూ నడపనీయడం లేదు కదా.. నడిపినట్టు యాక్ట్ చేస్తాను. నువ్వు నా పక్కన లోపల కూర్చో అంటుంది హిమ. శౌర్య కూడా సిగ్నల్స్ కోసం పైకి వెళ్తుంది. దీంతో అమ్మ కారులో కూర్చో అని చెప్పి.. నేను ఇప్పుడు కారు నడుపుతాను అని చెబుతుంది హిమ.

వద్దు అన్నా కూడా వినకుండా కారు స్టార్ట్ చేస్తుంది హిమ. కారు నడుపుతూ ఉంటుంది. కానీ.. హిమకు కంట్రోల్ ఆగదు. దీంతో కారు అదుపుతప్పుతుంది. వెంటనే కారు వెనుక పరిగెత్తి కారును అందుకునేందుకు ప్రయత్నిస్తాడు కార్తీక్. కారు డోర్ తీసి లోపలికి వెళ్తాడు. అంతలోనే రాయికి కారు టైర్ తగిలి అదుపుతప్పి లోయలో పడిపోతుంది. దీంతో కార్తీక్, హిమ, దీప.. ముగ్గురూ లోయలో పడి చనిపోతారు. కారు కూడా పేలిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

9 minutes ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

1 hour ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

2 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

3 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

4 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

5 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

6 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

7 hours ago