Karthika Deepam 10 Sep Today Full Episode
Karthika Deepam 09 Sep Today Episode : కార్తీకదీపం సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1454 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీపకు, డాక్టర్, పెద్దావిడ ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు దీప అది నన్ను ఏమీ చేయలేదు. నా భర్తని నా నుంచి దూరం చేయలేదు. అని అంటూ ఉంటుంది. అప్పుడు పెద్దావిడ సరేగాని రేపు వినాయకుడు పూజ ఇక్కడే చేసుకో అని అడుగుతుంది. అప్పుడు లేదమ్మా నేను డాక్టర్ బాబు ని పిలిచాను తన అక్కడికి వస్తాడు. అక్కడే జరుపుకుంటాను. అని అంటుంది. సరే అనడంతో దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మౌనిత దీప గురించి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది. అంతలో శివ వచ్చి దీపక్క వచ్చింది మేడం అని అంటాడు. అప్పుడు మౌనిత శివ చంప పగలకొట్టి అక్క ఏంట్రా..
అక్క అంటున్నావ్ నా దగ్గర ఉంటు…నా ఉప్పు తింటూ.. అంటూ తనకి వార్నింగ్ ఇస్తుంది. ఇక తర్వాత మౌనిక దీప దగ్గరికి వెళ్లి అక్క అని పిలుస్తూ ఎటకారంగా మాటలు అంటూ నేను మా ఆయన పక్కపక్కన కూర్చుని పూజ చేసుకుంటున్నాం నువ్వు రావాలి అంటూ కౌంటర్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడు దీప నా భర్తని నా నుంచి నువ్వు దూరం చేయలేవు నా భర్తని నేను నా సొంతం చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు.. అప్పటివరకు నా డాక్టర్ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకో చెల్లి నేను నీకోసం వస్తా అని అంటూ మౌనితకి రీకౌంటు ఇస్తుంది. ఇక కట్ చేస్తే సౌర్య వారణాసి బొమ్మల అమ్ముతూ ఉండగా కొనడానికి ఎవరు రాపోయేసరికి బాధపడుతూ ఉంటారు. అప్పుడు వారణాసి నువ్వు వెళ్లి కూర్చోమ్మ అమ్మగారు అయ్యగారు చూశారంటే నన్ను తిడతారు చిన్న పిల్లలతో బొమ్మలమ్మిస్తున్నావా అని అంటారు అని అంటూ ఉంటాడు. అప్పుడు నేను అమ్మానాన్నల కోసం వచ్చాను అది నీకు తెలుసుగా… అని అంటూ సరే నేను పక్కన కూర్చుంటా నువ్వు అమ్ము అని అంటుంది. అప్పుడు అటువైపుగా కార్తీక్, మౌనిత వెళ్తూ కార్తీక్ సౌర్య ని చూసి కారు ఆపి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది మోనిత నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ లేదు కార్తీక్ అమ్మాయిని ఇప్పుడే ఫస్ట్ చూడడం అని ఉంటుంది.
Karthika Deepam 10 Sep Today Full Episode
పాపం చిన్నపిల్ల బొమ్మలు అమ్ముతూ ఉంది అని అంటుండగా.. కొందరి తలరాత అంతే అని మౌనిత అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ తలరాతని మనం మార్చలేము కానీ సహాయం చేయొచ్చు కదా అని కార్ దిగి వెళుతూ ఉండగా మౌనిత తనని ఆపి కార్లు కూర్చోబెడుతుంది. నేను శివాని పంపిస్తాను అని శివాని పంపిస్తుంది. అప్పుడు కార్తీక్ శివ బొమ్మలు మొత్తం తీసుకురా.. బేరాలాడకు అని అంటాడు. అప్పుడు శివ వెళ్లి మొత్తం బొమ్మలు తీసుకొని వస్తాడు. అప్పుడు కార్తీక్ శివ చంప పగలగొట్టి నువ్వు వెళ్లి చిన్నపిల్లలకి పని చెప్తావా.. తన పని చేస్తుంటే నాకు ఏదో అయిపోతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత సరేలే ఏదో తెలియక చేశాడు అని అంటుంది. అప్పుడు సౌర్య ఆ మేడంకి నేను థాంక్స్ చెప్పి వస్తా అని వస్తూ ఉండగా ..అక్కడ నుంచి మౌనిత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వాళ్లు వెళ్లిపోయినందుకు బాధపదుతు ఉండగా.. ఏం కాదులే అని వారణాసి అంటాడు.
ఇక ఆ డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటుంది శౌర్య. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిక ఇంట్లో పూజ జరుగుతూ ఉండగా.. పంతులుగారు దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చుండి అంటుండగా.. మౌనిత కార్తీక్ కూర్చోబోతూ ఉండగా దీప ఆగండి డాక్టర్ బాబు మీరు నాకు ఒక మాట ఇచ్చారు మర్చిపోయారా అని అంటుంది. అవును మర్చిపోయాను అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప మీరు ఇలా మర్చిపోతారని నేను ఒక చిట్టి మీద రాశాను కదా అని అనగానే కార్తీక్ వెళ్లి చిట్టి తీసుకొచ్చి చదువుతూ ఉండగా.. మౌనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీప సంతోష పడబోతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాలి..
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.