Karthika Deepam 11 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జనవరి 2023, బుధవారం ఎపిసోడ్ 1559 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లు మిమ్మల్ని కలవకపోవడానికి నేను జైలుకు వెళ్లకముందు నేనే కారణం. కానీ.. నేను జైలుకు వెళ్లాక వాళ్లు మిమ్మల్ని ఎందుకు కలవలేదో దానికి నేను కారణం కాదు. అయినా అసలు ఏం జరిగిందో వాళ్లు ఇప్పటికీ మీకు చెప్పలేదా? ఇన్నాళ్లు చెప్పలేదు అంటే ఓకే కార్తీక్. కానీ.. ఆంటీ కనిపించాక అయినా చెప్పాలి కదా. ఇది టూమచ్ అంటుంది మోనిత. దీంతో ఏంట్రా అది. ఏం చెప్పాలి అంటుంది అని అడుగుతుంది సౌందర్య. దీంతో దీనికి మన కుటుంబంలో ఎలా గొడవలు పెట్టాలో అని మాత్రమే తెలుసు. నువ్వు ముందు నడవవే.. అంటూ మోనితను బయటికి వెళ్లగొడుతుంది. తనను లాక్కెళ్లి బయటికి పంపిస్తుంది దీప. ఆ తర్వాత డోర్ పెట్టేస్తుంది. దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. పెద్దోడా ఏంట్రా అది. ఏదేదో మాట్లాడుతోంది. ఏంటా నిజం అని అడుగుతుంది సౌందర్య.
దీంతో మమ్మీ.. మోనిత గురించి తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నవు అంటాడు కార్తీక్. ఏం లేదు అంటుంది దీప. పదండి ఇంటికి వెళ్లిపోదాం అంటుంది సౌందర్య. దీంతో ఏం చేయాలో కార్తీక్, దీపకు అర్థం కాదు. కట్ చేస్తే మోనితకు ఇంజెక్షన్ వేస్తుంది చారుశీల. ఇంజెక్షన్ నొప్పి లేకుండా వేయాలని తెలియదా అంటుంది మోనిత. దీంతో టీపాయ్ ను పగులగొట్టి చేయి కోసుకున్నావు. అసలు ఏమైంది అని అడుగుతుంది చారుశీల. దీంతో కోపం, బాధ, ఆవేశం అంటుంది. కార్తీక్ గురించే నా బాధ. నన్ను కార్తీక్ అర్థం చేసుకునే వరకు నేను ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తాను. అసలు ప్రపంచంలో ఏ ఆడది కూడా ఇన్ని ప్రయత్నాలు చేయదు. కానీ.. నేను చేస్తున్నాను. నన్ను, కార్తీక్ ను ఒక్కటి కాకుండా ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి అంటుంది మోనిత. దీంతో ఏ ఆటంకం రాకుండా ఉండేందుకు నువ్వు ప్రేమించింది పెళ్లి కాని కార్తీక్ ను కాదు.. పెళ్లి అయిన కార్తీక్ ను. పెళ్లాం చాలదా అడ్డు పడటానికి అంటుంది చారుశీల.
కార్తీక్, దీప మధ్య అనుమానం పెంచి.. కార్తీక్ ను దీపకు ఎప్పుడో దూరం చేశా కానీ.. నాకు ఎప్పుడూ అడ్డం వచ్చేది సౌందర్య ఆంటి. ఆ తర్వాత నాకు మరో చాన్స్ వచ్చింది. చనిపోయాడు అనుకున్న కార్తీక్.. బతకడంతో నాకు దక్కాడు అనుకున్నా. కానీ.. మళ్లీ ఇప్పుడు దీప వచ్చింది అంటుంది మోనిత.
అందుకే.. ఇప్పటికైనా కార్తీక్ గురించి ఆలోచించడం మానేస్తే మంచిది అంటుంది చారుశీల. కార్తీక్ కు కూడా నీ మీద మంచి ఉద్దేశం లేదు కదా అంటుంది చారుశీల. దీంతో ఆ ఉద్దేశాన్ని మార్చడానికే నేను చేస్తున్న ఈ ప్రయత్నాలు. ఆ గడువు లోపలే నా కార్తీక్ ను దక్కించుకుంటాను అని శపథం చేస్తుంది మోనిత.
మరోవైపు కార్తీక్, దీప, పిల్లలను తీసుకొని తన ఇంటికి వెళ్లిపోతుంది సౌందర్య. మోనిత చెప్పింది నిజమేనా. అసలు.. ఇద్దరూ నాకు చెప్పని విషయాలు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటుంది సౌందర్య. మరోవైపు కిచెన్ లో దీప వండటం చూసి కార్తీక్ కు టెన్షన్ వేస్తుంది. దీప వంట గదిలో ఉండకూడదు. అలా అని వంట గదిలో ఎక్కువ సేపు పని చేయొద్దు అంటే మమ్మీకి అనుమానం వస్తుంది అని అనుకుంటాడు కార్తీక్.
ఇంతలో దీప.. వండిన పదార్థాలు తీసుకొని వస్తుంది. దీపను చూస్తాడు. తినండి అంటుంది. దీంతో తర్వాత తింటాడులే దీప. ఏదో ఆలోచిస్తున్నాడు కదా. ముందు అది ఆలోచించుకోనివ్వు అంటుంది సౌందర్య. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్ అంటే ఏం లేదు మమ్మీ అంటాడు కార్తీక్.
ఏం లేదు అత్తయ్య. ఒక్కోసారి అలా పరధ్యానంగా ఉంటారు అంటుంది దీప. ఇంతలో అంజి వస్తాడు. మీరందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటాడు అంజి. నీకు కూడా ముందే తెలుసు కదా వీళ్ల గురించి అంటుంది సౌందర్య. దీంతో ముందు తెలియదు కానీ.. ఆ తర్వాత తెలిసింది.
మా అమ్మ కూడా దీపమ్మ ఇంట్లోనే పని చేసేది. అలా తెలిసింది అంటాడు అంజి. భోజనం చేసిన తర్వాత దీప, కార్తీక్ ఇద్దరూ పైకి వెళ్లి మాట్లాడుకోవడం చాటుగా వింటుంది సౌందర్య. దీంతో కార్తీక్ సౌందర్య తమ మాటలు వింటుందని చూసి టాపిక్ మారుస్తాడు. వెంటనే హైదరాబాద్ వెళ్లిపోదామని అమ్మకు చెబుతాను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.