Intinti Gruhalakshmi 11 Jan Today Episode : ప్రేమ్ జీతం మొత్తాన్ని లాక్కున్న లాస్య.. తులసి ఇచ్చిన గిటార్ ను అమ్మేసిన ప్రేమ్.. ఇంతలో తులసికి అది పెద్ద షాక్

Intinti Gruhalakshmi 11 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జనవరి 2023, బుధవారం ఎపిసోడ్ 839 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వేంటో నీ కుటుంబ సభ్యుల ముందు నిరూపించుకో అని నందుకు సవాల్ విసురుతుంది లాస్య. దీంతో అప్పుడే తులసిని చూసి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులను పట్టుకొని నా గురించి మీరంతా ఏమనుకుంటున్నారు. ఆటలో అరటిపండును అనుకుంటున్నారా? అంటాడు నందు. అలా అని మేము ఏం అనలేదు కదా అంటాడు పరందామయ్య. దీంతో మరి తులసి అమ్మ ఎందుకు అలా మాట్లాడింది. నన్ను అన్ని మాటలు అంటుంటే మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు. మీరు ఒక్కరైనా నన్ను సమర్థించారా? ఏం జరుగుతోంది అని అడుగుతాడు నందు. దీంతో ఏం జరుగుతోందో నీ ఆంతరాత్మకే తెలుసు నాన్న అంటాడు ప్రేమ్. ఆసుపత్రిలో జరిగిన గొడవను అక్కడే వదిలేయండి. అమ్మ కోలుకుంది. తిరిగి నార్మల్ అయింది. మళ్లీ దాని గురించి మాట్లాడకండి అంటాడు ప్రేమ్.

intinti gruhalakshmi 11 january 2023 full episode

మరోవైపు మా నుంచి నువ్వే వేరు పడ్డావు అని నందును అంటుంది అనసూయ. కుటుంబ సభ్యులు అందరూ నందు మీదనే రెచ్చిపోతారు. నందునే తప్పు పడతారు. అభి కూడా అదే మాట అంటాడు. తప్పు మీవైపు ఉన్నా మీరు మా మనిషి కాబట్టి నోరెత్తకుండా పడి ఉన్నాం. ఇది కూడా ఒక రకంగా మిమ్మల్ని సపోర్ట్ చేయడమే అంటాడు ప్రేమ్. సామ్రాట్ గారు అమ్మను అనుమానించలేదు.. చావు బతుకుల మధ్య పడి ఉంటే.. హాస్పిటల్ కు తీసుకొని చేర్పించారు. తులసిని కాపాడుకోవాలనే తొందరలో ఏం చేయాలో తెలియక తన భర్తగా సైన్ చేశాడు అంటాడు పరందామయ్య. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియని అమాయకురాలిగా ఎంత సైలెంట్ గా ఉందో చూడు అంటూ లాస్యపై విరుచుకుపడుతుంది అనసూయ. అయినా చెప్పాల్సింది వీళ్లు కాదు కదా.. చెప్పాల్సింది తులసి అంటుంది లాస్య. దీంతో అయినా మా అమ్మ ఇప్పటికే ఎక్స్ ప్లనేషన్ ఇచ్చేసింది అంటాడు ప్రేమ్. మీరు ఒప్పుకుంటారేమో కానీ.. మేము ఒప్పుకోం అంటాడు నందు.

నువ్వు ఎందుకు దీపక్ మామయ్యను కొట్టావు. అది తప్పు కాదా అని అంటాడు ప్రేమ్. నీ భార్యను ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు నీకు తెలుస్తుంది అంటాడు నందు. దీంతో అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోను. నేను దిగజారి అలా ప్రవర్తించను అంటుంది శృతి.

దీంతో చూశావా నందు.. ఎలా మాట్లాడుతుందో అంటుంది లాస్య. దీంతో శృతి.. లాస్యకు క్షమాపణ చెప్పు అంటాడు నందు. దీంతో నేను చెప్పను అంటుంది శృతి. అందరూ మీ ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నమాట. అందుకే నా నిర్ణయం కూడా వినండి.

నా బిజినెస్ డెవలప్ మెంట్ కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టాలని అనుకుంటున్నా. కానీ.. మిమ్మల్ని కన్విన్స్ చేసి దీనికి ఒప్పించాలని అనుకున్నా. కానీ.. మీకు అస్సలు ఈ విషయంపై సమాచారం ఇస్తే చాలని ఇప్పుడే తెలిసింది. ఈ ఇల్లు రేపే తాకట్లోకి వెళ్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.

Intinti Gruhalakshmi 11 Jan Today Episode : తులసికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పిన శృతి

మరోవైపు తులసి ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది తులసికి. ఏమ్మా శృతి అని అడుగుతుంది. దీంతో ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. డాక్టర్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచమన్నారు కానీ.. నేను మాత్రం మీ ప్రశాంతతను చెడగొట్టడానికి ఫోన్ చేస్తున్నాను అంటుంది శృతి.

అంకుల్, లాస్య ఆంటి కలిసి ఇంటిని తాకట్టు పెట్టడానికి రెడీ అయ్యారు అని చెబుతుంది శృతి. అంత అవసరం ఏమొచ్చింది అంటే.. బిజినెస్ కోసం అట అంటుంది శృతి. అంకుల్ ఎవరి మాట వినేలా లేరు అంటుంది శృతి. ఇంటి విషయంలో ఆయన నిర్ణయం ఆయనే తీసుకున్నారు అంటుంది శృతి.

ఏది అయితే జరగకూడదు అనుకున్నానో.. అదే జరిగింది. ఆ ఇల్లు తాకట్టులోకి పోతే ఇక తిరిగి రాదు. దాని కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటుంది తులసి. మరోవైపు ప్రేమ్.. ఆఫీసుకు బయలుదేరుతాడు. రోజూ ఆఫీసుకు వెళ్లాలా అంటుంది శృతి. దీంతో నాకూ ఇంట్లో ఉండాలని ఉంటుంది కానీ.. సంపాదించాలి కదా అంటాడు ప్రేమ్.

మరోవైపు తనకు వచ్చిన జీతాన్ని ఇంట్లో పెడదామని అనుకొని పర్సు నుంచి తీసి లెక్కబెడుతుంటాడు. ఇంతలో అక్కడికి వస్తుంది లాస్య. ఒకసారి నువ్వు, మీ అన్నయ్య.. తొడ గొట్టి చెప్పారు కదా. ఈ ఇంటి బాధ్యతలను చూసుకుంటామని అంటుంది లాస్య.

దీంతో అవును ఇచ్చాం. మాట తప్పేదే లేదు అంటాడు ప్రేమ్. లెక్క పెట్టి ఇస్తుండగా మొత్తం లాక్కొని వెళ్తుంది. దీంతో ఏం చేయాలో ప్రేమ్ కు అర్థం కాదు. రేపు శృతిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి ఎలా అనుకుంటాడు. దీంతో పక్కనే తనకు గిటార్ కనిపిస్తుంది.

దీంతో వెంటనే ఆ గిటార్ ను తీసుకొని షాపునకు వెళ్లి అమ్మబోతాడు. తులసి.. ప్రేమ్ గిటార్ అమ్మడం చూస్తుంది. బాధపడుతుంది. గిటార్ ను తాకట్టు పెట్టి ఏదైనా డబ్బు ఇవ్వండి అంటాడు ప్రేమ్. దానికి తాకట్టు పెట్టడం ఏంటి.. దాన్ని అమ్మేయ్. ఎంతో కొంత ఇస్తాను అంటాడు షాపు అతడు.

మా అమ్మ ఇచ్చిన దాన్ని అమ్మడం అంటే నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పి షాప్ అతడిని బతిమిలాడి దాన్ని తాకట్టు పెట్టి కొంచెం డబ్బు తీసుకుంటాడు. బయటికి వచ్చాక నీకు వచ్చిన జీతం ఏం చేశావు అని తన ఫ్రెండ్ అడిగితే లాస్య చేసిన విషయాన్ని మొత్తం చెబుతాడు.

అవన్నీ తులసి విని షాక్ అవుతుంది. మరోవైపు భోజనం వడ్డిస్తా కూర్చోండి అని చెప్పి లాస్య.. పరందామయ్య, అనసూయకు భోజనం పెట్టదు. దీంతో వాళ్లకు బాగా ఆకలి వేసి బయటికి వెళ్లి ఒక ఫంక్షన్ లో భోజనం చేస్తుంటారు. అక్కడే సామ్రాట్, తులసి కూడా ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

8 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

9 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

10 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

11 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

12 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

13 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

14 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

15 hours ago