karthika deepam 12 february 2022 full episode
Karthika Deepam 12 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 1274 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద్ తో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఏంటే మీ ఆనందం అని అడుగుతుంది సౌందర్య. ఆనంద్ ఉంటే చాలు అత్తయ్య వీళ్లకు అంటుంది దీప. పాపం ఎవరు కన్న బిడ్డో.. ఈ ఇంటికి చేరాడు అంటుంది సౌందర్య. దీంతో వీడు మా తమ్ముడే నానమ్మ. బయటికి వాళ్లకు మా తమ్ముడు అనే చెబుతాం అంటుంది హిమ. ఒరేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు. నువ్వు మా ఇంటి సభ్యుడివా అని అడుగుతుంది సౌందర్య. నానమ్మ తమ్ముడిని బాగా చూడు.. అచ్చం నాన్న లాగే ఉంటాడు కదా అంటుంది శౌర్య. దీంతో తప్పు రౌడీ అలా అనకూడదు అంటుంది సౌందర్య. అలా అనకూడదు అమ్మా అంటాడు కార్తీక్.
karthika deepam 12 february 2022 full episode
మనం ఎక్కడికైనా వెళ్దాం నానమ్మ అంటారు పిల్లలు. దీంతో మనం ఎక్కడికీ వెళ్లడం లేదు అంటుంది సౌందర్య. మన ఇంట్లోనే పార్టీ చేసుకుంటున్నాం. మీ నాన్న గారు ఫోన్ చేసి అందరికీ పార్టీ ఇవ్వమన్నారు అంటుంది సౌందర్య. మరో వైపు కారులో వెళ్తున్న మోనిత.. ఓసారి తన అత్తగారింటిని చూడటం కోసం కారు తిప్పతుంది. ఏంటి మోనిత.. ఈ రూట్ లో వెళ్తున్నావు అని భారతి అడుగుతుంది. దీంతో ఓసారి కార్తీక్ ఇంటికి వెళ్లి చూసి వెళ్దాం అంటుంది మోనిత. కొంపదీసి ఇంట్లోకి వెళ్తావా ఏంటి అని అడుగుతుంది భారతి. ఇప్పుడు అంత ఓపిక లేదులే.. ఏదో ఇంటి బయటి నుంచి చూడటమే అంటుంది మోనిత. తన ఇంటి దగ్గర ఆగి.. ఇంటి బయట చూసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది మోనిత.
కట్ చేస్తే కార్తీక్, దీప.. పెళ్లి రోజును ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక్, దీపను పెళ్లికొడుకు, పెళ్లికూతురుగా ముస్తాబు చేస్తారు. బంధువులు, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి రోజును నిర్వహిస్తారు. వాళ్లిద్దరూ ఎవ్వరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకోవడంతో దగ్గరుండి వాళ్ల పెళ్లిని మళ్లీ జరిపిస్తుంది సౌందర్య. అప్పుడు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది సౌందర్య.
అప్పుడు దీపపై సౌందర్య విరుచుకుపడటం.. ఇంట్లోకి రాబోతే రావద్దు అంటూ బెదిరించడం.. మా ఇంట్లోకి నువ్వు ఎలా వస్తావు.. ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో అంటూ హెచ్చరించడం అన్నీ మరోసారి గుర్తుకు తెచ్చుకుంటుంది సౌందర్య. దీప గొప్పది అని మనసులో అనుకుంటుంది సౌందర్య.
పెళ్లి అనేది అందరికీ కలలా ఉండిపోతుంది. కానీ.. నీకు పెళ్లి ముందు కష్టాలే వచ్చాయి. పెళ్లి తర్వాత కష్టాలు వచ్చాయి. నీ కష్టాలన్నీ ఇంతటితో పోవాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నాను అని దీపతో అంటుంది సౌందర్య. ఇంకెప్పుడూ మమ్మల్ని వదిలేసి వెళ్లమని ఒట్టేసి చెప్పు దీప అని అడుగుతుంది సౌందర్య.
మీరంతా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతే మేం ఏం కావాలి అనుకున్నారు. పిల్లలు లేరు.. నువ్వు లేవు. ఈ సంతోషాలు లేవు. ఎక్కడుంటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. ఇలా అయితే ఎలా దీప. ప్రతిక్షణం నరకం అనుభవించాం తెలుసా. నువ్వు కూడా పెద్దోడితో పాటు వెళ్లిపోతే ఎలా దీప అంటుంది.
దీంతో రాముడి వెంట వెళ్లడమే సీత ధర్మం కదా అత్తయ్య అంటుంది దీప. దీంతో నువ్వు గొప్ప ఇల్లాలువి దీప అంటుంది సౌందర్య. నువ్వు పడ్డ కష్టం ఇంకెవరూ పడి ఉండరు. ఎంత గొప్ప మనసును ఇచ్చాడు దేవుడు నీకు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న నిన్ను నాకు కోడలుగా ఇచ్చాడు అంటుంది సౌందర్య.
మరోవైపు మహేశ్.. ఎవరో కాదు అరుణ తమ్ముడే. ఫుల్లుగా తాగి తిరుగుతుంటాడు. నీకు తాగడానికి డబ్బులు ఎక్కడివిరా అని అడుగుతుంది. ఓ పెద్ద మనిషి కనిపించకుండా పోతే అతడిని వెతకడం కోసం డబ్బులు ఇచ్చారులే అంటుంది. సరే కానీ.. అక్క బావ ఎక్కడున్నాడు అని అడుగుతుంది.
ఇంతలో లోపలికి వస్తాడు మహేశ్. అది మోనిత ఇల్లు. మోనిత.. అతడిని చూస్తుంది. అరుణ ఎవరు ఇతడు అని అడుగుతుంది. మా తమ్ముడు.. తాగుబోతు చచ్చినోడు అంటుంది. ఇంతలోనే కార్తీక్ ఫోటోను మహేశ్ చూస్తాడు. అక్క.. ఈ సారు ఫోటో ఇక్కడుందేంటి అని అడుగుతాడు మహేశ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
This website uses cookies.