Karthika Deepam 12 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 1402 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం జ్వాల లేచి చూసేసరికి తను ఎక్కడున్నానో తెలియక షాక్ అవుతుంది. నేను ఎక్కడున్నాను అనుకుంటుంది. ఇంతలో తన రూమ్ లోకి సౌందర్య, ఆనంద రావు వస్తారు. మీరేంటి ఇక్కడున్నారు. అసలు నేను ఎక్కడున్నాను అంటుంది జ్వాల. ఇంతలో హిమ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అంటుంది జ్వాల. నిన్ను ట్రీట్ మెంట్ చేసి హిమ ఇక్కడికి తీసుకొచ్చింది అంటుంది సౌందర్య. తీసుకొచ్చి ట్రీట్ మెంట్ చేసినందుకు డబుల్ ఫీజు ఇస్తా అని చెప్పి వెళ్లబోతుంది శౌర్య. దాన్ని చూశావా.. దాని మొహం చూడవే. పాపమే. నీకు జ్వరం అని రాత్రంతా నిద్రలేకుండా నీ పక్కనే కూర్చొని టెంపరేచర్ టెస్ట్ చేస్తూ ట్యాబ్లెట్లు వేస్తూ ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఫీజు మొహాన కొడతావా? అదేం డాక్టర్ గా నీకు ట్రీట్ మెంట్ చేయలేదు. తోడ బుట్టిన దానిలా ఒక అమ్మలా నిన్ను చూసుకుంది అని చెబుతుంది సౌందర్య.
దీంతో ఆ మాకు తెలుసులే.. నువ్వు బాగా మాటకారివి అని కూడా తెలుసు. నీకు ఎంత తెలివి ఉందో అందరికీ తెలుసు అంటుంది జ్వాల. మీరు నన్ను మోసం చేశారు. ఇది మోసం చేసింది. అబద్ధాలు మోసాలు.. కపట ప్రేమ నటిస్తూ.. ఇప్పుడేదో నాకు జ్వరం వస్తే అన్నీ మరిచిపోయి హాయ్ తాతయ్య.. హాయ్ నానమ్మ అంటూ ఎప్పటిలా తిరగాలా? నా వల్ల కాదు.. అంటుంది శౌర్య. దీంతో శౌర్య అసలు జరిగింది ఏంటి అని చెప్పబోతుంది హిమ. దీంతో తనను అస్సలు మాట్లాడనీయదు శౌర్య. అసలు జరిగింది ఏంటో నీకు తెలియదు అని సౌందర్య చెప్పబోగా అస్సలు వినదు శౌర్య. నాకు ఏం చెప్పొద్దు అంటుంది శౌర్య. దానిని గొప్ప త్యాగ మూర్తిని చేయకండి అంటుంది జ్వాల. మీరు ఏం చెప్పినా నేను నమ్మను. జరిగిందేంటో చాలా క్లియర్ గా నాకు తెలుస్తోంది అంటుంది జ్వాల.
నువ్వు నన్ను నానమ్మ అన్నావు.. తనను తాతయ్య అని పిలిచావు. కోపాలు, అపార్థాలు ఇవన్నీ సహజం. కానీ.. బంధం ఎప్పటికీ నిజం అంటుంది సౌందర్య. మీ అమ్మానాన్నలను పోగొట్టుకొని నువ్వే అంత బాధపడితే వాడు నాకొడుకు.. అది నా కోడలు అంటుంది సౌందర్య.
వాళ్లను పోగొట్టుకొని మేము ఎంత బాధపడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతుంది సౌందర్య. లేదు కదా ఆలోచించవు. ఎప్పుడూ నీ వైపే కాదు. మా వైపు నుంచి కూడా ఆలోచించు అంటుంది సౌందర్య. దీంతో ఇన్నాళ్లకు ఇంటికి వచ్చావు. మా కళ్ల ముందు ఉన్నావన్న ఆనందం అయినా మాకు మిగలనివ్వు అంటాడు ఆనంద రావు.
మధ్యలో మేము ఏం తప్పు చేశాం అంటుంది సౌందర్య. దీంతో దూరంగా ఉండటం నీకు అలవాటు అయిందేమో కానీ.. దూరం చేసుకోవడం మరిచిపోవడం మాకు ఇంకా తెలియదు అంటాడు ఆనంద రావు. నువ్వు కనిపించనప్పుడు రోజు ఆ దేవుడిని నా మనవరాలును నా ఇంటికి వచ్చేలా చేయి అని ఆ దేవుడిని కోరుకునేవాడిని.
ఇప్పుడు నువ్వు పోతే.. నేను పోయాక నా మనవరాలిని వచ్చి చూడేలా చేయి అని మొక్కుకోవాల్సి వస్తుంది అంటాడు ఆనంద రావు. నేను వెళ్తాను అంటుంది జ్వాల. ఉండు అనగానే ఎలా.. వెళ్లి నా ఆటో తెచ్చుకోవాలి కదా. నా లగేజ్ తెచ్చుకోవాలి కదా అంటుంది జ్వాల.
దీంతో అందరూ సంబురపడతారు. ఇక్కడ ఉంటున్నాను కదా అని అన్నీ మరిచిపోతాను అనుకోకండి. నా బతుకు నాది. నా ఆటో నాది అంటుంది. దీంతో మళ్లీ ఆటో నడపడం ఎందుకు అంటుంది హిమ. దీంతో నడుపుతాను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నేను మారను. నా కోపం తగ్గదు అంటుంది జ్వాల.
మరోవైపు జ్వాలను చూడాలని ఉన్నా.. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతారు ఇంద్రుడు, చంద్రమ్మ. తర్వాత శౌర్యకు అసలు నిజం ఎప్పుడు చెప్పాలి అని ఆలోచిస్తుంది హిమ. ఎలాగైనా శౌర్య మనసులో కోపాన్ని తగ్గించగలుగుతాను అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Railway Jobs : దక్షిణ మధ్య రైల్వే స్కౌట్స్ మరియు గైడ్స్ కోటాలో గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టుల భర్తీకి అర్హులైన…
Shaniswar : జ్యోతిష శాస్త్రం ప్రకారం న్యాయదేవతగా శనీశ్వరుని భావిస్తారు. గ్రహాలలోనే శని ప్రత్యేకమైన గ్రహం. అయితే శనీశ్వరుడు మిగతా…
Waqf Amendment : పార్లమెంటులో శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తులు, మతపరమైన విషయాల…
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun మరి కొద్ది రోజులలో పుష్ప2 అనే సినిమాతో…
Nagababu : ఆంద్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడం మనం చూశాం. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్…
Pawan Kalyan : మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుపుతున్న అకృత్యాలను అరికట్టాలని కోరిన మత…
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుంచి 28 వరకు భారీ…
Eknath Shinde : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తనను ముఖ్యమంత్రిని చేయకుంటే ఏక్నాథ్ షిండే రాష్ట్ర…
This website uses cookies.