Home » Entertainment » Rashmika Mandanna With Tharun Bhascker About Sita Rama Characters
Entertainment

Rashmika Mandanna : మన జర్నీ ఆల్రెడీ మొదలైంది.. నీ కోసం వస్తున్నా.. రష్మిక మందాన్న పోస్ట్ వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 12, 2022, 11:00 am
Advertisement

Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ బిజీగా తిరిగేస్తోంది. హిందీలో ఆల్రెడీ రెండు మూడు సినిమాలు చేస్తోంది. అందులో ఓ సినిమా షూటింగ్ కూడా అయిపోయినట్టుంది. అమితాబ్‌తో కలిసి రష్మిక మందాన్న నటించేసింది. అలా ఇప్పుడు రష్మిక మందాన్న అన్ని భాషల్లో సినిమా చేసినట్టు అవుతోంది. ఇక ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్ సినిమాల్లోనూ రష్మిక నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతోన్న సీతారామం సినిమాలో రష్మిక నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్నా దత్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తోంది.

Advertisement

బక్రీద్ సందర్భంగా ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక ముస్లీం అమ్మాయిగా కనిపించబోతోంది. అఫ్రీన్ అనే పాత్రలో రష్మిక పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది నా పాత్రకు సంబంధించిన పోస్టర్.. దీని మీద ఎమోజీలు చేయకండి అంటూ రష్మిక కోరింది.మొత్తానికి రష్మిక ఫస్ట్ లుక్ మీద విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో రష్మికకు జోడిగా పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటిస్తున్నట్టు అనిపిస్తోంది. బాలాజీ పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.

Rashmika Mandanna With Tharun Bhascker about sita rama characters

Advertisement

రష్మిక ఫస్ట్ లుక్ మీద తరుణ్ ఇలా స్పందించాడు.ఓయ్ రష్మిక మందాన్న.. ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి.. బాలాజీ ఉన్నాడు కదా? అని అడిగేశాడు.దీనికి రష్మిక మందాన్న వెరైటీగా రిప్లై ఇచ్చింది. మన జర్నీ ఆల్రెడీ మొదలైంది బాలాజీ.. ఇండియా (నీ కోసం) రావడానికి ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాను అని చెప్పుకొచ్చింది. మొత్తానికి సీతారామం అనే ఈ లవ్ స్టోరీ సినిమా ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో అయినా హను రాఘవపూడికి హిట్ వస్తుందో లేదో చూడాలి. ఆయన చివరగా తెరకెక్కించిన పడిపడిలేచే మనసు సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి