
Do you know what this man did when he was angry that Karthika Deepam Serial
Karthika Deepam 12 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 నవంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 1508 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాలకు మన మీద అనుమానం వచ్చిందని చంద్రమ్మకు ఇంద్రుడు చెబుతాడు. మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 ఒత్తులు వెలిగించేందుకు దీప గుడికి వస్తుంది. అదే సమయంలో మోనితతో పాటు కార్తీక్ కూడా గుడికి వస్తాడు. ఇవాళ పూజ అయ్యేంత వరకు నువ్వు నాతోనే ఉండు అని మోనిత చెబుతుంది. పిలవగానే గుడికి వస్తావనుకోలేదు కానీ వచ్చావు చాలా సంతోషం కార్తీక్. అలాగే ఓపికగా చివరి వరకు నా దగ్గరే ఉండు చాలు అంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ ఎక్కడికో వెళ్తాడు. ఎంత చెప్పినా తప్పించుకొని పోయాడా అని అనుకుంటుంది మోనిత.
karthika deepam 12 november 2022 full episode
గుడిలో దీప కోసం ఎదురు చూస్తుంటాడు కార్తీక్. ఇంతలో మోనిత వచ్చి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. ఇది కేవలం ఆడవాళ్ల పూజ. నువ్వు వెళ్లి దీపాలు వెలిగించుకో అంటాడు కార్తీక్. దీంతో వేరే వాళ్ల సంగతి నాకు తెలియదు అంటుంది. దీంతో నా కర్చీఫ్ తీసుకో అంటాడు. నా కర్చీఫ్ పట్టుకుంటే నా చేయి పట్టుకున్నట్టే. ఇది పట్టుకొని దీపాలు వెలిగించు. ఇప్పుడే వస్తాను. తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు కార్తీక్. ఇంతలో దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. అతడిని చూసి వచ్చారా డాక్టర్ బాబు అంటుంది. దీంతో కార్తీక దీపం వెలిగిస్తున్నావు కదా. అందుకే వచ్చేశా అంటాడు కార్తీక్.
ఇద్దరూ కలిసి దీపాలు వెలిగించడం చూస్తుంది మోనిత. దీంతో తనకు కోపం వస్తుంది. నేను పిలవగానే గుడికి బయలు దేరినప్పుడే అర్థం అయింది. ఏదో తేడాగా ఉందని. ఇందుకోసం వచ్చావా.. నిన్ను వదలను.. దాన్ని వదలను. ఏ దీపం అయితే వెలిగించావో.. ఆ దీపంతోనే దాన్ని తగలబెడతాను అని అనుకుంటుంది మోనిత.
ఇంతలో తనను శివలత లాక్కెళ్తుంది. మేడమ్.. గుడిలో అందరూ ఉన్నారు. గొడవ అవుతుంది అంటుంది. మేడమ్ నేను చెప్పేది వినండి మేడమ్. రండి అంటుంది శివలత. దీపాలు వెలిగించడం అయిపోయిందా అని అడుగుతాడు కార్తీక్.
దీంతో లేదు డాక్టర్ బాబు. సాయంత్రం అయ్యాక కార్తీక దీపం వెలిగించాలి. అది మీరు వెలిగిస్తే నేను దాన్ని నీళ్లలో వదిలేస్తాను అంటుంది దీప. మరోవైపు ఇద్దరు మెట్లు దిగబోతుండగా దీప కింద పడబోతుంది. దీంతో కార్తీక్ తనను పట్టుకుంటాడు.
నా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవే జాగ్రత్తలు గతమంతా గుర్తొచ్చి నా డాక్టర్ బాబులా తీసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది దీప. మరోవైపు ఈరోజు వంటలక్క సంగతి చూడాలని అనుకుంటుంది మోనిత.
బంగారం లాంటి మిమ్మల్ని వదిలేసి ఆ కార్తీక్ సార్ ఆ వంటలక్క వెంట ఎందుకు పడుతున్నారు మేడమ్ అని అడుగుతుంది శివలత. అది మాయ చేసింది. అది ఉండగా నేను, కార్తీక్ సంతోషంగా ఉండలేం. ఈరోజే దాన్ని ఏదో ఒకటి చేయాలి అంటుంది మోనిత.
దీంతో ఈరోజు కార్తీక పౌర్ణమి. ఆ దేవుడికే వదిలేయండి అంటుంది శివలత. ఆవిడ వదిలితే ఆవిడ భర్త దగ్గరవుతాడు అంటుంది శివలత. కార్తీక్ దాని మొగుడు అని మనసులో అనుకుంటుంది మోనిత.
మరోవైపు రాత్రి అవుతుంది. నేను మీ భార్యనని మీకు గుర్తు లేకపోయినా మీతో కలిసి కార్తీక దీపం వెలిగించే భాగ్యం దక్కింది డాక్టర్ బాబు అని అనుకుంటుంది దీప. కార్తీక్ దీపాలు వెలిగిస్తాడు. దీంతో వాటిని తీసుకెళ్లి కొలనులో విడిచిపెట్టి రావడానికి వెళ్తుంది దీప.
మరోవైపు మోనిత కూడా అదే సమయంలో దీపాలు వదిలేందుకు వస్తుంది. ఈరోజుతో నీ దీపం ఆరిపోతుంది. నీకు రోజులు దగ్గరపడ్డాయి అంటుంది మోనిత. దీంతో ఆ మాట నేను నిన్ను అనాలి. నీ పాపం పండిపోయింది. ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు అంటుంది దీప.
నువ్వు కోటి దీపాలు పెట్టినా కార్తీక్ ఎప్పుడూ నీ వాడు కాదు అంటుంది మోనిత. ఇదే గుడిలో నువ్వు ఉండగా నాతో కలిసి ఈ దీపాలు వెలిగించారు. ఆయనకు ఏదీ గుర్తు లేకపోయినా, నేను భార్య అని తెలియకపోయినా నా పక్కనే ఉండి దీపం వెలిగించేలా చేశాడు ఆ దేవుడు. అది భార్యాభర్తల బంధం అంటే. మూడుముళ్ల బంధం అంటే.. అంటుంది దీప.
మధ్యలో వచ్చిన దానివి మధ్యలోనే కొట్టుకుపోతావు అంటుంది దీప. డాక్టర్ బాబు ఇప్పుడు నా వైపు ఉన్నారు అంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.