Karthika Deepam 12 Oct Today Episode : వారణాసిని గుర్తుపట్టి దీప ఎక్కడ అని అడుగుతున్న కార్తీక్… దీపని చంపేయమని రౌడీలకి చెప్పిన మోనిత…!

Karthika Deepam 12 Oct Today Episode బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1481 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… అందరూ బతుకమ్మలను నీళ్లలో వదులుతూ ఉండగా.. దీప మాత్రం నా బతుకు నిలబెట్టు బతుకమ్మ అని కోరుకుంటూ బతుకమ్మని వదులుతుంది. డాక్టర్ బాబు చాలా సమయం నుంచి కనిపించట్లేదమ్మా అది నా నుంచి దూరం చేయడానికి ఏమైనా చేస్తుందమ్మా అని పెద్దావిడతో చెబుతూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ దీప కి ధైర్యం చెబుతూ ఉంటుంది. మోనిత ఎవరికో ఫోన్ చేసి ఈ రాత్రికి అది జరిగిపోవాలి అది రేపటి సూర్యధయం చూడొద్దు అని చెప్తూ ఉంటుంది. ఇక దీప ని చూసి నీ పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది. ఇక దీప డాక్టర్ బాబుని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇంకొకపక్క గండ, శౌర్య దీప వెతుకుతూ ఉంటారు. ఇక మోనిత కూడా కార్తీక్ ని వెతుకుతూ ఉంటుంది. ఇక దీప గండ, దీప దగ్గరికి వచ్చి అమ్మ నీ కోసమే వెతుకుతున్నావమ్మా మా అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటుంది. మీరు ఒకసారి కనపడాలి అని అనగానే దీప నేను అసలే కంగారులో ఉన్నాను మీరు వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు గండ శౌర్య గురించి చెప్తూ ఉండగా తను వెళ్ళిపోతుంది.

ఇక మౌనితకి సౌర్య అడ్డుపడుతుంది. మీ అమ్మానాన్నలు వెతుకుతున్నావా వాళ్ళ నేనే మట్టిలో కలిపాను అని చెప్పానుగా అని తిడుతూ ఉంటుంది. ఇక గండా కూడా శౌర్య దగ్గరికి వచ్చి ఆవిడ కలిసింది కానీ కంగారులో ఉండి రానని కసురుకుంది. నీ కథ చెప్తుండగా ఆవిడ వెళ్లిపోయింది అని చెప్తాడు. అప్పుడు సౌర్య ఆవిడ మా అమ్మ కాదులే అంత కంగారులో ఉన్న మా అమ్మాయి అయితే కసురుకోదు అని వెళ్ళిపోతూ ఉంటారు. కార్తీక్ ఒంటరిగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. కార్తీక్ కోసం అందరూ తలా ఒకపక్క వెతుకుతూ ఉంటారు. ఇక మౌనిత కార్తీక్ గతం గుర్తుకొస్తుందేమోనని భయపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ ఒక దగ్గర నిలబడి రాజ్యలక్ష్మి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడికి రాజ్యలక్ష్మి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ బాబు అని కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మీరు అక్కడ చెప్పినంత నిజమేనా ఇది మా ఊరు కాదా వంటలక్క నా వెంట ఎందుకు పడుతుంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడు రాజ్యలక్ష్మి.నీ గురించి అంత చెప్పింది అయితే సీక్రెట్ గా సంబంధాలు పెట్టుకున్నా ఆడవాళ్లు ఉంటారు కానీ తన భర్తని పక్కనపెట్టి నిన్ను తన భర్త అని వెంటపడేవాళ్లు ఉంటారా ఆలోచించు అని అంటుంది. అప్పుడు కార్తీక్ మౌనితా నా భార్య అని చెప్తుంది నా కోసం తాపత్రయపడుతుంది కదా అది నిజం కాదా అనగానే… నాకేమీ అర్థం కావడం లేదమ్మా ఎవరిది నమ్మాలో అర్థం కావడం లేదు అని కార్తీక్ అంటాడు.

Karthika Deepam 12 october 2022 full episode

అప్పుడు రాజ్యలక్ష్మి దీప నీ మాత్రమే నమ్ము అమ్మాయి చెప్పి మాటల్లో నిజం ఉంది నేను పెద్దదానిగా చెప్తున్నాను దీప మాటని విశ్వసించు బతకమ్మ సాక్షిగా చెప్తున్నాను నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.ఇక కార్తీక్ ఆలోచిస్తూ వెళ్తుండగా.. వారణాసి ఎదురవుతాడు. అప్పుడు వారణాసి కార్తీక్ ని పట్టుకొని మీరు బ్రతికే ఉన్నారా డాక్టర్ బాబు నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఎవడ్రా నువ్వు అని గళ్ళ పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఎవరి మాటలు నేను నమ్మను అని వారణాసిని తిడుతూ ఉంటాడు. అప్పుడు వారణాసి నన్ను గుర్తుపట్టలేదా డాక్టర్ బాబు ఈ ఫోటోలు చూసి ఆ మాట చెప్పండి అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ ఆ ఫోటోని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే సౌర్య గండాకి మోనీత గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడు గండ తను చెప్పింది అంతా అబద్ధం అమ్మానాన్నలు బ్రతికే ఉన్నారు ఆమె మాటలను బట్టి చూస్తే అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సౌర్య అది అబద్ధం అయితే బాగుంటుంది. బాబాయ్ అని చెప్తూ ఉంటుంది.

కట్ చేస్తే రౌడీలు మోనితకి ఫోన్ చేస్తారు. మౌనిత వచ్చారా మీరు అక్కడే ఉండండి నేను చెప్తాను అని అంటుంది. అంతలో దీప మౌనిక దగ్గరికి వచ్చి డాక్టర్ బాబుని ఎక్కడ దాచి పెట్టావు అని అడుగుతూ ఉంటుంది. మోనిత కార్తీక్ నీకు భయపడి ఎక్కడ దాస్తాను ఇక్కడే ఉన్నాడు. అని అంటుంది. అప్పుడు నేను మొత్తం వెతికాను కానీ తను ఎక్కడ లేడు అనగానే నీకు భయపడాల్సిన అవసరం నాకేముంది అలా వీధి చివరిదాకా వెళ్లొస్తానని వెళ్ళాడు అది అనగానే దీప నేను అక్కడికి వెళ్లి చూస్తాను అక్కడకు లేకపోతే నీ పని చెప్తా అని దీప వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మౌనితా వెళ్ళవే నీకోసం అక్కడ రౌడీలు ఎదురుచూస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ వారణాసి కింద పడిపోతాడు. కార్తీక్ వారణాసి వారణాసి లేరా దీప ఎక్కడ అని అంటూ దీప అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు. అప్పుడు దీప చూసి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే…

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

9 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

10 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

11 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

12 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

13 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

14 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

15 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

16 hours ago