
Karthika Deepam Fame Premi Viswanath has a rare disease
Karthika Deepam 13 Dec Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు అంటే ఆదివారం ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 13 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1221 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, దీప, పిల్లల గురించే ఆలోచిస్తూ సౌందర్య తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. పిల్లలు లేని ఈ ఇల్లు బోసిపోయినట్టు కనిపిస్తోంది అంటూ సౌందర్య చాలా బాధ పడుతుంది. ఎలాగైనా వాళ్లను వెతికి తీసుకురా అని ఆదిత్యకు చెబుతుంది సౌందర్య. కానీ.. వాళ్లు దొరకొద్దని జాగ్రత్తలు తీసుకుంటే వెతకడం కష్టం అవుతుంది అని చెబుతాడు ఆదిత్య. పెద్దోడు మోనిత వల్ల చాలా నరకం అనుభవించాడు అని ఆనంద రావు చెబుతాడు. వాళ్లంతట వాళ్లు మనసు మార్చుకొని రావాలి కానీ.. మనం వెతికితే మాత్రం వాళ్లు దొరకడం కష్టం మమ్మి అంటాడు ఆదిత్య.
karthika deepam 13 december 2021 episode highlights
ఈ ఇంట్లో మళ్లీ పెద్దోడు అడుగుపెడతాడంటావా అంటుంది సౌందర్య. వాడు నన్ను మమ్మీ అని పిలుస్తాడా.. అని వెక్కి వెక్కి ఏడుస్తుంది సౌందర్య. మరోవైపు ఉండేందుకు ఇల్లు కిరాయికి దొరకడంతో దీప.. గుడికి వెళ్లి దేవుడికి మొక్కుకుంటుంది. 11 ఏళ్ల ఎడబాటు తర్వాత మళ్లీ కలిశామనుకుంటే ఏమైందో కానీ.. డాక్టర్ బాబు మళ్లీ నిస్సాయకస్థితికి వచ్చారు అని అంటుంది దీప. నా పిల్లలు ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. నా డాక్టర్ బాబుని మళ్లీ పాత డాక్టర్ బాబులా చూడాలి. నాకు కష్టాలు ఇవ్వొద్దని నేను అనడం లేదు. వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని అడుగుతున్నాను అంటుంది దీప.
ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది దీప. అందరూ కలిసి పడుకుందామని పక్క వేస్తారు. ఇంతలో ఇంటటి బయట నుంచి ఓ మహిళ ఏడుపు వినిపిస్తుంది. వెళ్లి చూస్తే.. ఓ మహిళకు పురిటి నొప్పులు వస్తుంటాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాదు దీపకు. డాక్టర్ బాబు మీరు డాక్టరే కదా.. వెళ్లి చూడండి అంటుంది దీప.
కానీ.. డాక్టర్ బాబు మాత్రం నాలో డాక్టర్ ఎప్పుడో చచ్చిపోయాడు. నేను డాక్టర్ కాదు ఇప్పుడు అంటాడు. ఆమె చచ్చిపోతుంది అంటుంది. దీంతో వాళ్ల ఫోన్ తీసుకొని కార్తీక్ వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తాడు. వెంటనే అంబులెన్స్ వచ్చి ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తుంది.
ఎందుకు ఇలా చేస్తున్నారు డాక్టర్ బాబు అని అడుగుతుంది దీప. ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ నిలబడ్డారు. మీరు ఇలా చేయడం ఏంటి.. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే మీరు.. ఇలా చూస్తూ నిలిచోవడం ఏంటి… అంటూ దీప కార్తీక్ ను నిలదీస్తుంది.
నువ్వు అస్తమానం నన్ను డాక్టర్ బాబు అని పిలవకు. నేను డాక్టర్ ను కాదు. నా డాక్టర్ లైసెన్స్ రద్దు చేశారు. నేను ఇప్పుడు డాక్టర్ ను కాదు.. నేను ఎక్కడా ప్రాక్టీస్ కూడా చేయకూడదు అని చెబుతాడు కార్తీక్. నేను ఇప్పుడు అస్సలే డాక్టర్ ను కాదు. డాక్టర్ గా కొనసాగకుండా నన్ను సస్పెండ్ చేశారు.. అని చెబుతాడు కార్తీక్.
దీంతో బతకడం కోసం మళ్లీ వంటలక్కగా మారుతుంది దీప. పక్కనే ఉన్న ఆవిడతో వంటల పని ఉంటే ఇప్పించాలని అడుగుతుంది దీప. మధ్యాహ్నం భోజనం పనులు చూసుకోండి అని చెబుతుంది. పిల్లలకు కూడా నేను డాక్టర్ అనే విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అంటాడు కార్తీక్. దీంతో పిల్లలు షాక్ అవుతారు.
మీ నాన్న ఏం చేస్తాడు అంటే ఏం చెప్పాలి నాన్న అని అడుగుతారు పిల్లలు. దీంతో ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తాడని చెప్పండి అంటాడు. దీంతో పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తారు. వెంటనే ఒకసారి చెప్పండి.. పిల్లలు మీ నాన్న ఏం చేస్తాడు అని అడుగుతాడు కార్తీక్. దీంతో ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తారు అని చెబుతారు పిల్లలు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.