karthika deepam 13 may 2022 full episode
Karthika Deepam 13 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 1351 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన ఆటో ఎక్కిన ఓ మహిళకు క్లాస్ పీకుతుంది జ్వాల. దీంతో ఆ మహిళ ఆటో దిగి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన ఫోన్ లో డాక్టర్ సాబ్ ఫోటోను చూస్తూ.. డాక్టర్ సాబ్ చూశావా.. నేను ఆటో నడిపితే తప్పేంటి.. పెళ్లయ్యాక కూడా నడుపుతాను అని అనుకుంటుంది. శౌర్య మొగుడు డాక్టర్ సాబ్.. ఎంత బాగుందో కదా.. అనడానికి వినడానికి అని అనుకుంటుంది. ఇంతలో గుడికి వెళ్లాలి వస్తావా అని మరో మహిళ వచ్చి అడుగుతుంది. దీంతో తనను తీసుకెళ్తుంది. ఏ గుడి అని అడుగుతుంది. దీంతో వేంకటేశ్వర స్వామి గుడి అంటుంది.
karthika deepam 13 may 2022 full episode
మరోవైపు అదే గుడిలో నిరుపమ్, హిమ ఎంగేజ్ మెంట్ జరుగుతూ ఉంటుంది. హిమ టెన్షన్ పడటం చూసి.. ఏమైంది టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు నిరుపమ్. దీంతో ఏం లేదు అంటుంది హిమ. మరోవైపు అసలు నిశ్చితార్థం జరగదు కదా అని అనుకుంటుంది స్వప్న. నువ్వు సంబురపడు మమ్మీ. ఈ నిశ్చితార్థం జరుగదు గాక జరుగదు అని అనుకుంటుంది స్వప్న. మీకు ఊహించని షాక్ ఇస్తాను చూడు అని అనుకుంటుంది స్వప్న. నువ్వు అస్సలు కంగారు పడకు అని హిమతో సౌందర్య అంటుంది. మరోవైపు ఆటోలో నిరుపమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది జ్వాల. నా పాత ఫోన్ బాగలేదు అనుకున్నారో ఏమో.. కొత్త ఫోన్ కొనిచ్చారు. అవును.. నాకు ఇంత పెద్ద ఫోన్ డాక్టర్ సాబ్ ఎందుకు కొనిచ్చినట్టు అని అనుకుంటుంది. ఎవ్వరైనా తన గర్ల్ ఫ్రెండ్ చేతుల్లో మంచి ఫోన్ ఇవ్వాలనుకుంటారు కదా అని అనుకుంటుంది జ్వాల.
మనసులో మాట చెబుతా అన్నాడు. ఆ అవకాశమే లేకుండా పోయింది అని అనుకుంటుంది. డాక్టర్ సాబ్ కు మళ్లీ ఒకసారి ఫోన్ చేద్దాం అని అనుకుంటుంది జ్వాల. కానీ.. నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది డాక్టర్ సాబ్ కు అని అనుకుంటుంది.
మరోవైపు హిమ కోసం కొన్న ఉంగరాన్ని పడేస్తాడు ప్రేమ్. హిమే లేనప్పుడు ఇక ఈ ఉంగరం ఎందుకు అని అనుకుంటాడు. మళ్లీ ఆ ఉంగరాన్ని తీసుకొని ఇప్పుడు నేను ఇలా నిరుపమ్ ఎంగేజ్ మెంట్ కు వెళ్లడం అవసరమా అని అనుకుంటాడు.
వెళ్లకపోతే అందరూ ఫోన్లు చేస్తారు. ఏవేవో ఊహించుకుంటారు. వీటన్నింటికంటే వెళ్లడమే బెటర్ అని అనుకుంటాడు ప్రేమ్. భగవంతుడా.. ఏంటి నాకీ పరీక్ష అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు జ్వాల.. ఆటోలో సత్యం సార్ ఇంటికి వస్తుంది.
కానీ.. ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్లి ఉంటారు అని అనుకుంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ మమ్మీ డాడీ ఫంక్షన్ కు నేను వెళ్లనందుకు ఫీల్ అయి ఉంటారు. కలిసినప్పుడు సారీ చెప్పాలి అని అనుకొని జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు నిరుపమ్, హిమ ఎంగేజ్ మెంట్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చి ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తాడు ప్రేమ్. హిమను చూసి.. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అని అనుకుంటాడు ప్రేమ్. సత్యం తనను చూసి ఏంట్రా లేట్ అయింది అని అడుగుతాడు సత్యం. దీంతో అవును డాడీ లేట్ అయింది. నేను ఎప్పుడూ లేటే అంటాడు ప్రేమ్.
మరోవైపు నిశ్చితార్థం రింగ్స్ కనిపించవు. ముహూర్తం టైమ్ దాటిపోతోంది. ఉంగరాలు మార్చుకోకపోతే ముహూర్తం టైమ్ దాటిపోతే కష్టం అంటాడు పంతులు. దీంతో ఇప్పుడు ఎలా.. నిశ్చితార్థం ఆగినట్టే కదా అంటుంది స్వప్న. ఏంటి డాడీ ఇలా చేశారు అంటాడు నిరుపమ్.
నిజానికి.. నిశ్చితార్థం రింగులను తీసింది స్వప్నే. ఇంతలో సౌందర్య తన దగ్గర ఉన్న రింగ్స్ ను తీసి ఇస్తుంది. ఇదిగో నిశ్చితార్థం రింగ్స్ అంటుంది. ఎందుకైనా మంచిదని నేను కూడా ఉంగరాలు కొని తీసుకొచ్చాను. దీన్నే ముందు చూపు అని కూడా అంటారు స్వప్న అంటుంది సౌందర్య.
పంతులు గారు మీరు కానియ్యండి అంటుంది. ఈ శుభకార్యాన్ని ఎవ్వరూ ఆపలేరు అంటుంది సౌందర్య. మరోవైపు ఆటోలో మహిళను గుడికి తీసుకొస్తుంది జ్వాల. ఆ తర్వాత ఆ మహిళ కాసేపు ఆగమంటుంది. దీంతో సరే.. అంటుంది జ్వాల.
ఆ గుడి ముందే ఉంటుంది కానీ.. అక్కడే నిరుపమ్, హిమ ఎంగేజ్ మెంట్ జరుగుతోందని ఊహించదు జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.