karthika deepam 13 november 2021 full episode
Karthika Deepam 13 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 నవంబర్ 2021, శనివారం 1196 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు సినిమా ఇప్పుడే మొదలవుతోంది మోనిత. నీ క్రిమినల్ బుర్రకు అందని విధంగా ఉంటుంది చూడు. నావైపు ఎవరు ఉన్నారు అని అడిగావు కదా. గుండె ధైర్యం ఉంది. గుండెల్లో కొండంత ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఏంటో.. నా దమ్ము ఏంటో నీకు అతి త్వరలోనే తెలుస్తుంది మోనిత.. అంటూ మోనితకు దీప వార్నింగ్ ఇస్తుంది.
karthika deepam 13 november 2021 full episode
ఊప్ అని గట్టిగా ఊదితే కొట్టుకుపోతావు జాగ్రత్త. దీప అంటే దేవుడు ఇచ్చిన అక్క, వంటలక్క అని అనుకుంటున్నావు కదా. ఈ దీప తలుచుకుంటే ఏం చేయబోతుందో చేసి చూపిస్తాను. రెడీగా ఉండు. సినిమా మొదలవబోతోంది. బాగా తిను మోనిత. ముందు ముందు బాగా ఏడవడానికి ఓపిక, బలం కావాలి కదా నీకు. ఈ దీపతో ఎందుకు పెట్టుకున్నానురా అని తల గోడకు వేసుకొని బాదుకునేలా చేస్తాను. నీమీద ఒట్టు.. అని చెప్పి దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఏంటిది ప్రియమణి.. దీప ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటుంది. నాకు కూడా అదే అర్థం కావడం లేదమ్మా అంటుంది. తుఫాను వచ్చినట్టు దులిపేసి పోయిందమ్మా అంటుంది. చూడబోతే దీపమ్మ సినిమానే హిట్ అయ్యేలా ఉంది అంటుంది. దీప ధైర్యం ఏంటి.. అని మోనిత తెగ ఆలోచిస్తుంది.
కట్ చేస్తే ఆదిత్య.. ఇంటికి వస్తాడు. బాబాయ్.. బాబాయ్ అంటూ ఎదురు వస్తారు. ఏంటి అంటాడు. అమ్మ కనిపించిందా అని అడుగుతారు. అమ్మ పొద్దున అనగా బయటికి వెళ్లింది. ఇంకా రాలేదు బాబాయ్ అంటారు. ఫోన్ కూడా తీసుకువెళ్లలేదు అంటారు. ఏమైంది.. మళ్లీ ఏమైనా గొడవలు జరిగాయా ఇంట్లో అని అడుగుతాడు ఆదిత్య.
మోనిత దీప చెప్పిన విషయాలనే గుర్తు చేసుకుంటుంది. దీప ఎందుకు ఇంత ధైర్యంగా ఉంది. ఏంటి తన ధైర్యం. ఎక్కడా దీపకు అవకాశం ఇవ్వకున్నా.. ఎందుకు దీప అంత కాన్ఫిడెంట్ గా ఉంది. నా అంచనాలను ఎలా మంచి ప్రవర్తిస్తోంది.. ఏమై ఉంటుంది అని తెగ టెన్షన్ పడుతుంటుంది మోనిత. దీప దగ్గర ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అని అంటుంది ప్రియమణి. నేను నిన్ను సలహా అడగలేదు అంటుంది మోనిత.
మరోవైపు కార్తీక్ దీప కోసం వెతుకుతుంటాడు. ఎక్కడికి వెళ్లావు దీప అంటూ తనలో తానే బాధపడుతుంటాడు. ఇంతలో కార్తీక్ కు ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కార్తీక్. హలో డాక్టర్ బాబు అంటుంది. దీంతో దీప అనుకొని నువ్వేనా దీప అంటాడు. కానీ.. ఫోన్ చేసింది మోనిత. అయ్యో కార్తీక్ అంటుంది. డాక్టర్ బాబు అని పిలవగానే దీప అనుకున్నావా? అంటుంది మోనిత. షటప్ నువ్వెవరో నేనెవరో.. అంటూ ఫోన్ కట్ చేస్తాడు.
సౌందర్య, ఆనంద రావు.. ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు. దీప మంచికోసమే చేశా కానీ.. ఇలా అవుతుంది అనుకోలేదు అంటుంది సౌందర్య. కార్తీక్ ఒక మాట అన్నాడని.. దీప 11 ఏళ్లు దూరంగా ఉంది. అప్పటికైనా నీకు తన గురించి అర్థం కాలేదా? అప్పుడంటే దీపకు మనం తోడుగా నిలిచాం. ఇప్పుడు ఏం చేయగలం చెప్పు.. అని అంటాడు ఆనంద రావు.
అందరూ దీప గురించి ఆలోచిస్తున్న సమయంలో కూరగాయలు పట్టుకొని దీప ఇంటికి వస్తుంది. అప్పుడే కార్తీక్ కూడా ఇంటికి వస్తాడు. దీపను చూసి పిల్లలు కూడా సంతోషిస్తారు. ఏంటమ్మా నువ్వు నాన్న కారులో రావచ్చు కదా అంటారు పిల్లలు. మీ నాన్న దారి వేరు.. నా దారి వేరు.. ఇద్దరం ఒకే కారులో ఎలా ప్రయాణిస్తాం అంటుంది దీప. కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతుంది. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా.. అని కార్తీక్ ముందు కొత్తగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.