Karthika Deepam 13 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ క్లయిమాక్స్ కు చేరుకున్నట్టు అనిపిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైన సీన్లు రానున్నాయి. చివరకు మోనిత కటకటాలపాలు అవుతుందా? ఈరోజు 13 సెప్టెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది. ఈరోజు 1143 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కోర్టులో భోజన విరామ సమయం రావడంతో.. కార్తీక్ కోసం లంచ్ తీసుకొస్తుంది సౌందర్య. తిను.. అని అంటుంది. ఆనంద రావు, ఆదిత్య.. ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. తిను నాన్నా.. నీకేం కాదు.. అని అంటుంది సౌందర్య. దీప ఏమైందో తెలియట్లేదు మమ్మీ. ఉన్నట్టుండి ఆసుపత్రి నుంచి మాయమైంది. ఆ మోనితను వెతుక్కుంటూ వెళ్లింది. మోనిత ఏం చేస్తుందో అని భయమేస్తుంది.. అంటాడు కార్తీక్.
ఒకవేళ మోనితే కనుక దీపకు కనిపిస్తే.. ప్రాణాలకు తెగించి అయినా సరే.. మోనితను కోర్టుకు తీసుకొస్తుంది.. అని అంటుంది సౌందర్య. మోనిత బతికే ఉండి.. ఇలా మనందరితో ఆడుకుంటోందా? అసలు.. మోనిత ఆ రోజు ఆసుపత్రిలో రీటా వేషంలో వచ్చిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు.. అంటాడు ఆనంద రావు.
ఇంతలో పోలీస్ వచ్చి.. కోర్టుకు టైమ్ అవుతోంది.. తొందరగా తినేయండి.. అంటాడు. మళ్లీ కోర్టు ప్రారంభం అవుతుంది. ఎస్.. ప్రొసీడ్ అంటాడు జడ్జి. యువర్ ఆనర్.. వాదోపవాదాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఈ కేసులో సదరు ముద్దాయి కార్తీక్ పథకం ప్రకారమే హత్య చేసినట్టు స్పష్టమౌతోంది. ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉండి.. సాటి డాక్టర్ ను చంపడం.. హేయనీయం కాబట్టి.. ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించాలని నేను కోర్టు వారిని కోరుతున్నాను.. అని మోనిత తరుపు లాయర్ చెబుతాడు.
దీంతో.. ముద్దాయి తరుపున మీరు ఏమైనా సాక్ష్యులు కానీ.. సాక్ష్యాధారాలు కానీ.. ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారా.. అని అంటాడు జడ్జి. దీంతో కార్తీక్ తరుపు లాయర్ నథింగ్ యువర్ ఆనర్ అంటాడు. దీంతో వాదోపవాదాలు పూర్తయ్యాయి.. అని అంటాడు జడ్జి.
తీర్పు చెప్పేముందు నువ్వు కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా.. అని అడుగుతాడు జడ్జి. దీంతో నేను ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నాను. చాలా గౌరవమైన కుటుంబంలో పుట్టాను. నాకు నా తల్లిదండ్రులు విద్యతో పాటు సంస్కారాన్ని కూడా ఇచ్చారు. నేను ఒక అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకున్నాను. కానీ.. నా చదువు, సంస్కారం, వ్యక్తిత్వం.. ఇవన్నీ పక్కన పెట్టి.. ఒక సాధారణ మగాడిగా… నా భార్యను అనుమానించి 10 ఏళ్లు దూరంగా ఉంచాను. నేను నా భార్యను అనుమానించి వదిలేయడానికి కారణం.. చనిపోయింది అని అంటున్న మోనిత. మోనిత నేను నా భార్యను అనుమానించేలా చాలా ప్రయత్నాలు చేసింది. కవిత్వాన్ని ఇష్టపడే నా భార్య.. ఒక కవిని అభిమానిస్తే.. ఆ అభిమానాన్ని అక్రమ సంబంధంలా మార్చింది ఆ మోనిత. మోనిత అలా చేయడానికి కారణం.. ఆమె పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ. నా మీద ప్రేమతో నన్ను, నా భార్యను విడదీసి.. తను నన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కుట్రలు చేసింది. ఫలితంగా నేను నా భార్య 10 ఏళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది.
10 ఏళ్ల తర్వాత నా భార్య పవిత్రమైనదని నేను గుర్తించి.. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగి నా భార్యను నేను ఇంటికి తీసుకొచ్చాను. మమ్మల్ని విడదీసినా.. మళ్లీ మేము కలిసిపోవడం తట్టుకోలేని మోనిత.. నేను ఇచ్చిన శాంపిల్స్ తో ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ ద్వారా గర్భం దాల్చింది. మా జీవితాల్లోకి అలా ప్రవేశించి అల్లకల్లోలం చేసింది. పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసింది. ఒప్పుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. మోనిత చేసిన మోసాలను నా భార్య సాక్ష్యాలతో సహా చూపించింది. దీంతో అప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి. ఆవేశంతో రివాల్వర్ తీసుకొని బయలుదేరాను. చంపాలనే అనుకున్నాను. కానీ.. వివేకం నా వెన్ను తట్టింది. విచక్షణ నన్ను వెనకడుగు వేసేలా చేసింది. నేను జైలుకు వెళ్తే నా భార్యాబిడ్డలకు అన్యాయం చేసిన వాడిని అవుతాను.. అని అనుకున్నా. అందుకే.. ఇకనైనా దూరంగా ఉండమని హెచ్చరించి వెనక్కి వచ్చాను. ఆ తర్వాత మోనితకు నేను దక్కనని అర్థం అయింది. ఆమె చేసిన పని.. ఈ హత్య కేసులో నన్ను ముద్దాయిగా నిలబెట్టడం. ఇప్పటి వరకు గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు.. మోనిత చనిపోయింది అని వాదిస్తూ వచ్చారు. వారు వాదించినట్టు.. మీరు భావించినట్టు మోనిత చనిపోలేదు.. బతికే ఉంది.. అని చెబుతాడు కార్తీక్.
కట్ చేస్తే.. మోనిత చేతుల్లోంచి గన్ లాక్కున దీప.. మోనిత తలకు గురి పెడుతుంది. నా కళ్లలో ప్రాణభయం చూడాలని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు నేను నీ కళ్లలో ప్రాణభయం నా కళ్లారా చూస్తున్నాను. నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉందే. చావు.. చావు.. అంటూ మోనిత తలకు గన్ గురిపెడుతుంది దీప. ఒక్క నిమిషం దీప నా మాట విను. కార్తీక్ నన్ను చంపినా.. ఆయనకు జీవిత ఖైదు పడేది. నువ్వు నన్ను చంపినా నీకు జీవిత ఖైదు పడుతుంది. ఇలా కాకుండా ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాం.. అంటుంది మోనిత.
ఏంటి పరిష్కారం.. నిన్ను నా భర్తకు ఇచ్చి పెళ్లి చేయాలా? నా ఇంట్లో పెట్టుకోవాలా? నీకు చావే పరిష్కారం.. చచ్చిపో.. అంటుంది దీప. నేను చచ్చిపోతే నేను ఒక్కదాన్నే చచ్చిపోను దీప.. నా కడుపులోని బిడ్డ కూడా చచ్చిపోతుంది.. అంటూ మరో నాటకం ఆడుతుంది మోనిత. తిరుగులేని అస్త్రం సంధించా.. ఇక కాల్చదు.. అని అనుకుంటుంది మోనిత. నువ్వు కూడా ఇద్దరు బిడ్డలను కన్నావు కదా.. దీప. వాళ్లు కూడా ఒకరు తండ్రి దగ్గర.. మరొకరు తల్లి దగ్గర పెరిగారు. అలాగే నా బిడ్డ కూడా తండ్రి లేకుండా పెరగాలా? అంటూ ఏదేదో చెప్పబోతుంటే.. ఆపవే.. నీ విషయంలో నా భర్త.. నైతిక బాధ్యత వహించాల్సిన అవసరమే లేదు.. అంటుంది దీప.
కరెక్టే కానీ.. నా తప్పుకు నా బిడ్డ బలైపోవాలా? నేను ఏం చేసినా అది కార్తీక్ కోసమే చేశాను దీప. నా పాపాలకు నాబిడ్డ అన్యాయం అయిపోవాలా? అంటుంది మోనిత. నా గర్భంలో పెరిగేది.. కార్తీక్ అంశ కాదా?.. అంటుంది. అలసిపోయాను దీప.. ఈ ఆట ఇక నావల్ల కాదు.. అంటుంది. కడుపుతో ఉన్నాను.. ఇక నేను ఎలాంటి ప్రయత్నాలు చేయను.. నేరుగా వచ్చి కోర్టులో లొంగిపోతాను. అవును.. నేను లొంగిపోయి కార్తీక్ ను విడిపిస్తాను.. అంటుంది మోనిత.
దీంతో ఇప్పుడు వస్తావా? కోర్టుకు వస్తావా? నీ నేరాలన్నీ ఒప్పుకుంటావా? ఆయన్ను విడిపిస్తావా? అనగానే.. విడిపిస్తాను.. తప్పకుండా విడిపిస్తాను.. అంటుంది మోనిత. మీరంతా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు అందుకే.. నువ్వు నన్ను చంపలేకపోయావు. కార్తీకే కాదు.. కార్తీక్ భార్య కూడా అలాంటిది కాదు. కానీ ఒక్కమాట చెప్పు.. కార్తీక్ నన్ను పెళ్లి చేసుకుంటానని రెండు సార్లు మాటిచ్చాడా లేదా? ఒకసారి అయితే పీటల మీది నుంచే లేచి వెళ్లిపోయాడు. ఎన్నిసార్లు నాలో ఆశలు కల్పించాడో నీకు తెలియదా? పదహారేళ్లు పిచ్చిదానిలా ప్రేమించినదాన్ని. పెళ్లి చేసుకుంటానంటే.. ఎంత ఆశపడతానో చెప్పు. నిజానికి నేను కాదు.. నా కార్తీకే నన్ను మోసం చేశాడు. అయినా సరే.. నా కార్తీక్ నా మూలంగా జైలుకు వెళ్లకూడదు. అప్పటికీ ఆ వెర్రివాడికి చెబుతూనే ఉన్నాను. నా మెడలో తాళి కట్టవయ్యా మొగుడా.. నీ బదులు నేను జైలుకు వెళ్తానని. నాది అర్థం లేని వాదన అనుకున్నాడో ఏమో.. మరోసారి నన్ను వెర్రిదాన్ని చేశాడు. ఇప్పుడెళ్లి.. కోర్టు బోనులో నిలబడ్డాడు. ఇప్పుడు నేనేం చేసినా ఏం లాభం. నేను బతికే ఉన్నానని నీకు తెలిసిపోయింది. నీకు తెలిసిపోతే.. లోకానికి తెలిసిపోతుంది. ఆ రోషిణి ఎలాగూ నన్ను వదలదు.. వెంటాడి వేధించి.. నన్ను పట్టుకుంటుంది. మళ్లీ మళ్లీ ఈ పరుగులు నా వల్ల కావు. వస్తాను.. లొంగిపోతాను.. అంటుంది మోనిత. దీంతో.. గన్ తీసి అక్కడ పడేస్తుంది దీప. దీపతో కలిసి మోనిత కూడా అక్కడి నుంచి బయలు దేరుతుంది.
కట్ చేస్తే మళ్లీ కోర్టు సీన్ వస్తుంది. యువర్ ఆనర్.. శిక్ష నుంచి తప్పించుకోవడానికి.. ముద్దాయి చనిపోయిన మోనిత బతికే ఉందంటూ అబద్ధాలు చెబుతున్నాడు.. అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. ఈ కట్టుకథలతో కోర్టు వారి సమయాన్ని వృథా చేయొద్దని చెప్పండి.. అంటాడు లాయర్. దీంతో కోర్టు సమయం కన్నా కూడా మనిషి జీవితం చాలా విలువైనది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఆయన్ను చెప్పనివ్వండి.. అంటాడు జడ్జి.
థ్యాంక్యు మిలార్డ్. మోనిత బతికే ఉంది అనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఏం లేదు. అంత తెలివిగా.. పకడ్బందీగా నా జీవితంలో ప్రవేశించడానికి మారు వేషంలో నా చుట్టూ తిరుగుతూనే ఉంది. నా భార్యను చంపాలని సోదమ్మ వేషంలో వచ్చింది. అప్పుడే నా భార్య గుర్తు పట్టింది. ఆ తర్వాత టీ ఇచ్చే మూగమ్మాయిగా పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఆ టీలో కలిపిన ఏదో పదార్థం వల్ల నాకు ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడికి డాక్టర్ రీనా వేషంలో మళ్లీ వచ్చింది మోనిత. తనను పెళ్లి చేసుకుంటే కోర్టుకు లొంగిపోతాను.. అన్న ప్రపోజల్ తో వచ్చింది. ఒప్పుకోకపోతే.. నా కుటుంబాన్ని మొత్తం చంపేయాలని బెదిరించింది. ఇదే జరిగింది. మోనితను నేను చంపలేదు. ఈ హత్యానేరం నేను చేయలేదు.. అంటాడు కార్తీక్.
అయితే.. ముద్దాయిని ప్రశ్నించడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని లాయర్.. కోర్టును కోరుతాడు. ఎస్.. ప్రొసీడ్ అంటాడు జడ్జి. మీరు మోనితను చంపలేదు.. బతికే ఉంది కదా.. మీరు మోనితను చంపలేదు అనడానికి.. మోనిత బతికే ఉంది అనడానికి మీరు, మీ భార్య తప్ప వేరే సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని అడుగుతాడు లాయర్. లేవు.. అంటాడు కార్తీక్.
ఇంతలోనే కార్తీక్ తరుపు లాయర్ లేచి యువర్ ఆనర్.. కార్తీక్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ కేసు మలుపు తిరిగిందని నేను భావిస్తున్నాను. ఏసీపీ గారిని కొన్ని ప్రశ్నలు అడిగేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని నేను కోరుతున్నాను.. అంటాడు. ఎస్.. అంటాడు జడ్జి.
కట్ చేస్తే.. దీప.. ముఖ్యమైన సాక్ష్యాన్ని కోర్టుకు తీసుకొచ్చి ఆ సాక్షిని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతుంది. దీంతో జడ్జి కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.