Home » Entertainment » Karthika Deepam 14 April 2022 Full Episode
Entertainment

Karthika Deepam 14 April Today Episode : మోనిత ఇంట్లో కార్తీక్ ఫోటో చూసి ఆనంద్ షాక్.. తన అమ్మానాన్న ఎవరో ఆనంద్.. జ్వాలకు చెబుతాడా?

Authored By
Varun G
The Telugu News | Published on: April 14, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 14 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 1326 హైలైట్స్ ఏంటో ఇఫ్పుడు చూద్దాం. హిమను చూసి కారులో ఫాలో అవుతుంటుంది సౌందర్య. తనను చూసి కూడా హిమ ఆగకుండా వెళ్తుందేంటని టెన్షన్ పడుతుంది సౌందర్య. ఈ మధ్య హిమలో చాలా మార్పు కనిపిస్తోంది. ఏం జరిగి ఉంటుంది. ఈ మార్పు మంచిదే అయినా సడెన్ గా హిమలో మార్పు ఏంటి అనేదే అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. నేను స్పీడ్ గా వెళ్తుంటే వాళ్లు ఇంకా స్పీడ్ గా వెళ్తున్నారు ఏంటి.. కావాలనే నన్ను తప్పించుకోవాలని వెళ్తున్నారా.. హిమ ఎందుకు ఇలా చేస్తోంది. అసలు బైక్ మీద ఉన్న అమ్మాయి ఎవరు అని అనుకుంటుంది.

Advertisement

karthika deepam 14 april 2022 full episode

మరోవైపు స్పీడ్ గా పోనియ్ అని జ్వాలతో అంటుంది. చివరకు కారు మధ్యలో ఆగిపోతుంది. మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఆపు.. ఆపు అని సడెన్ గా అంటుంది. దీంతో బైక్ దిగి నువ్వు వెళ్లు అంటుంది. కానీ.. ఏమైంది తింగరి అంటుంది జ్వాల. నిన్ను రోడ్డు మీద వదిలేసి నేను ఎలా వెళ్తాను అంటుంది జ్వాల. చెబుతుంటే నీకు అర్థం కావడం లేదా.. నువ్వు వెళ్లు ఫస్ట్ అంటుంది. వెళ్లను అంటున్నాను కదా అంటుంది. మాట్లాడకుండా వెళ్లు అంటుంది. ఇదే కోపం నీలో చూడాలనుకున్నా అంటుంది జ్వాల. దీంతో ముందు తనను వెళ్లు అంటుంది. తను వెళ్లిపోయాక.. కారులో సౌందర్య వచ్చి కారు ఆపుతుంది.

Advertisement

ఏంటి హిమ.. నువ్వు బైక్ మీద వెళ్లడం ఏంటి అని అడుగుతుంది. దీంతో ఏం లేదు నానమ్మ అంటుంది. ఆ బైక్ మీద వచ్చిన అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. జ్వాల అని అంటుంది. దీంతో ఆ ఆటో అమ్మాయా అని అడుగుతుంది. అవును అంటుంది. తన బైక్ మీద నువ్వెందుకు వెళ్తున్నావు. నన్ను చూసి కూడా నువ్వు ఎందుకు బైక్ ఆపలేదు అంటుంది.

ఒక పేషెంట్ దగ్గరికి అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది. అందుకే జ్వాల బైక్ మీద తీసుకెళ్తోంది అని చెబుతుంది తింగరి. మొత్తానికి ఎలాగోలా సౌందర్యను మేనేజ్ చేస్తుంది తింగరి. మరోవైపు జ్వాల బాక్స్ కోసం ఎదురు చూస్తుంటాడు సత్యం. ఫోన్ చేద్దామా అని అనుకుంటాడు.

Advertisement

ఇంతలోనే తను వస్తుంది. నీకు నూరేళ్ల ఆయుష్షు అమ్మ అంటాడు సత్యం. దీంతో నా ఆయుష్షు కొంచెం మా అమ్మానాన్నలకు వచ్చినా బాగుండేది అని అనుకుంటుంది. సరే.. క్యారేజ్ బాక్స్ ఏదమ్మా అని అడుగుతాడు సత్యం. దీంతో నా అసిస్టెంట్ తీసుకొస్తున్నాడు అని అంటుంది జ్వాల.

Karthika Deepam 14 April Today Episode : జ్వాలపై కోపం పెంచుకున్న ప్రేమ్

అసిస్టెంట్ ను కూడా పెట్టుకున్నావా అని అంటాడు. ఇంతలో ఆటోలో ప్రేమ్ ఇంటికి వస్తాడు. బాక్స్ తీసుకొని తెచ్చి ఇంట్లో పెడతాడు. నువ్వేంట్రా ఆటోలో అంటాడు సత్యం. డాడీ.. ఇవన్నీ నన్ను అడగకండి. ఇవన్నీ మమ్మీ దారిలో అడిగింది. చెప్పలేక నా తల ప్రాణం తోకకు వచ్చింది అంటాడు ప్రేమ్.

మన ఇంటికి ఆటో అమ్మాయి రావద్దు.. ఈ ఫుడ్ రావద్దు.. ఆటో రావద్దు. కావాలంటే నేనే వంట నేర్చుకుంటాను అంటాడు. అర్జెంట్ గా ఈ తిక్కను ఇక్కడి నుంచి పంపించేయండి అంటాడు ప్రేమ్. ఏమైంద జ్వాలా నువ్వైనా చెప్పు.. అంటాడు సత్యం.

తనకు ఇష్టం లేకనే ఆటో నడుపుతూ వచ్చాడా అంటుంది జ్వాల. ఏం లేదు సార్.. దారిలో రెగ్యులర్ చెకప్ కోసం పోలీసులు ఆటో ఆపారు. మధ్యలో ఎక్స్ ట్రా వచ్చి ఎక్స్ ట్రా చేశాడు. రెచ్చిపోయాడు సార్. అందుకే.. తన బైక్ నేను తెచ్చాను.. నా ఆటోను తనను తీసుకురమ్మని చెప్పాను. ఏయ్ ఎక్స్ ట్రా నీ బైక్ అక్కడ పార్క్ చేశాను చూసుకోపో అంటుంది జ్వాల.

Advertisement

బాగుంది.. ఎలా ఉంది ఆటో డ్రైవింగ్ అంటాడు సత్యం. బాగుంది.. ఒక ఆటో కొనివ్వండి అని చెప్పి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. కట్ చేస్తే నువ్వు బాగా మారిపోయావు అంటుంది సౌందర్య. ఇప్పుడు అంత అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లొచ్చు కదా.. బైక్ మీద వెళ్లడం ఎందుకు అంటుంది.

మరోవైపు జ్వాల.. మోనిత ఇంటికి వెళ్తుంది. అక్కడ దీపం వెలిగించి ఉండటం చూస్తుంది. ఏం జరుగుతోంది అసలు. ఈ ఇంట్లో ఎవరూ లేరని చెబుతూనే ఉన్నారు. కానీ.. ఇల్లు మాత్ర శుభ్రం చేస్తున్నారు. దీపం పెడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అనుకుంటుంది జ్వాల.

మోనిత ఆంటి చేస్తున్నారా? అసలు మోనిత ఆంటి ఎక్కడికి వెళ్లింది. ఇక్కడికి నా శత్రువు హిమ వస్తుందా అని అనుకుంటుంది. ఇంతలో జ్వాల దగ్గరికి వస్తాడు రవ్వ ఇడ్లీ. నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది. దీంతో ఫ్రెండ్ తో వచ్చాను అంటాడు. సరే పదా వెళ్దాం అంటుంది.

ఇంతలో తన ఫోన్ ఆ ఇంట్లో మరిచిపోతుంది జ్వాల. దీంతో రవ్వ ఇడ్లీ నా ఫోన్ అక్కడ మరిచిపోయాను. వెళ్లి తీసుకురా అంటుంది. దీంతో లోపలికి వెళ్లి కార్తీక్ ఫోటో చూసి షాక్ అవుతాడు రవ్వ ఇడ్లీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి