Karthika Deepam 14 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 డిసెంబర్ 2021, మంగళవారం 1222 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్.. పిల్లలు ఇద్దరినీ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ఇక నుంచి తను డాక్టర్ అనే విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అంటాడు. దీంతో శౌర్య, హిమ షాక్ అవుతారు. అదేంటి నాన్న.. నువ్వు పెద్ద డాక్టర్ వి కదా. డాక్టర్స్ అందరికీ ప్రెసిడెంట్ వి కూడా అయ్యావు అన్నారు కదా. డాక్టర్ కాదని ఎలా చెప్తాం అంటారు. దీంతో ఈరోజు నుంచి అవన్నీ మరిచిపోండి అంటాడు. మీ నాన్న డాక్టర్ కార్తీక్ కాదు. ఉట్టి కార్తీక్ అంటాడు. ఎందుకు నాన్న అబద్ధం చెప్పడం. నువ్వు గొప్ప డాక్టర్ వి కదా అంటుంది శౌర్య. మా డాడీ ఫేమస్ డాక్టర్ తెలుసా అని మా ఫ్రెండ్స్ తో చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు అబద్ధం చెప్పడం ఎందుకు అంటుంది హిమ. దీంతో నేను చెప్పేది వినండిరా ప్లీజ్. నేను డాక్టర్ ని కాదు అని చెప్పడంలో ఎవ్వరికీ ఏ నష్టం లేదు కదా.. ఈ అబద్ధం ఎవ్వరికీ హాని చేయదురా అంటాడు కార్తీక్.
నా మాట వింటారు కదా.. అని అడుగుతాడు కార్తీక్. దీంతో సరే.. అని తలూపుతారు పిల్లలు. శౌర్య అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరి.. మీ నాన్న ఏం చేస్తాడంటే ఏం చెప్పాలి నాన్న అని అడుగుతుంది శౌర్య. ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తాడని చెప్పండి అమ్మ అంటాడు కార్తీక్. నాన్నా… ఎరువుల కొట్టులోనా అని అంటుంది శౌర్య. అవును అమ్మ. ఏం చెబుతారు.. ఏదీ ఒకసారి చెప్పండి అంటాడు కార్తీక్. పిల్లలూ మీ నాన్న ఏం చేస్తాడు.. అంటే ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తారు అని చెబుతారు పిల్లలు. చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తారు ఇద్దరు పిల్లలు. కార్తీక్ కు కూడా ఏడుపు ఆగదు. మరోవైపు దీప.. పని కోసం ఒకామె దగ్గరికి వెళ్తుంది. నేను వంటలు చేస్తాను అని చెబుతుంది. నీకు పని అర్జెంటా అంటుంది. మధ్యాహ్నం పిల్లల కోసం వంటలు చేయాలి అని చెబుతుంది ఆమె. సరే చేస్తా అంటుంది. రేపు ఉదయమే స్కూల్ దగ్గరికిరా అంటుంది. సరే వస్తాను అంటుంది.
ఇప్పటి వరకు ఆ పని శ్రీవల్లి చేసేది అని చెబుతుంది మేడమ్. శ్రీవల్లి డెలివరీ కోసం హైదరాబాద్ కు వెళ్లిందని చెబుతుంది. దీంతో పాపం.. శ్రీవల్లికి ఎలా ఉందో అని అనుకుంటుంది దీప. కట్ చేస్తే.. రుద్రాణి మనుషులు తన దగ్గరికి వెళ్లి.. వాడు ఎవడో కొట్టాడు అక్క అని చెబుతారు. వాడెవడో కొట్టి.. శ్రీవల్లి సామాన్లు వాళ్లింట్లో పెట్టాడు అంతేనా అంటుంది. అవును అక్క అంటారు.
అయితే.. రుద్రాణి మాత్రం అవేమీ పట్టించుకోదు. వాడు కొట్టాడు అన్నా కూడా వేరే విషయాలు మాట్లాడుతుంది రుద్రాణి. మరోవైపు ప్రియమణి.. తన కొడుకు కోసం బొమ్మలు కొనడానికి వెళ్తుంది. కారులో పిల్లాడు పడుకొని ఉంటాడు. దీంతో పిల్లాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కారులోనే పడుకోబెడుతుంది.
కానీ.. ఎందుకైనా మంచిది అని అక్కడే ఉన్న ఓ వ్యక్తికి కాసేపు బాబును చూసుకో అని చెబుతుంది. సరే అంటాడు. ఆ తర్వాత షాపింగ్ కు వెళ్తుంది. ఇంతలో ఎవరో వ్యక్తి వచ్చి ఆ బాబును ఎత్తుకుపోతాడు. షాపింగ్ నుంచి తిరిగి వచ్చి చూసేసరికి.. బాబు ఉండడు. తను చెప్పిన వ్యక్తి ఫోన్ లోనే మాట్లాడుతుంటాడు. బాబు లేడు.. అని అతడిని పిలుస్తుంది. ఎవరూ రాలేదు అక్క అంటాడు.
కారు దగ్గరకి ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది. ఎవరో ఓ వ్యక్తి అయితే కారు దగ్గరికి వచ్చాడు అక్క అని చెబుతాడు. 30 సంవత్సరాలు ఉంటాయి అని చెబుతాడు. దీంతో ఇది ఆ కార్తీక్ పనే అని అనుకుంటుంది మోనిత. వెంటనే కారులో బయలుదేరుదామనుకునేసరకి.. కారు స్టార్ట్ కాదు. దీంతో అప్పుడే తన హాస్పటిల్ లో పనిచేసే బబిత స్కూటీ మీద వెళ్తుంది. తన స్కూటీ తీసుకొని బయలుదేరుతుంది మోనిత.
కట్ చేస్తే.. కార్తీక్.. తన తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నాన్నా అని పిల్లలు పిలుస్తారు. అమ్మ ఎక్కడికి వెళ్లింది అని అనేలోపే.. దీప వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అమ్మ అంటే కూరగాయలు కొనడానికి వెళ్లాను అంటుంది దీప. ఇంతలేటు అయింది ఎందుకమ్మా అంటే ఒక చోటుకు మంచిని వెతుక్కుంటూ వెళ్లాను అంటుంది.
నాకు ఒక పని, పిల్లలకు ఒక స్కూల్ దొరికింది డాక్టర్ బాబు అంటుంది దీప. మీతో పాటు.. నేను అదే స్కూల్ లో వంట చేస్తాను అంటుంది. స్కూల్ లో పని ఏంటి దీప అంటే.. మధ్యాహ్నం భోజనం చేసే పని దొరికింది డాక్టర్ బాబు అంటుంది. ఏంటి దీప మళ్లీ వంటలక్క పని మొదలు పెడుతున్నావా అంటే.. నాకు తెలిసింది అదే కదండి అంటుంది దీప.
రేపటి నుంచి డాడీ ఒక్కరే ఇంట్లో ఉంటారా అని అడుగుతారు పిల్లలు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. మరోవైపు కార్తీక్ వెళ్లినప్పటినుంచి ఆనంద రావు రంది పెట్టుకుంటాడు. సరిగ్గా తినడు. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. వాడి పక్కన దీప ఉంది.. అని ఆనంద రావుకు ధైర్యం చెబుతుంది. ఇంతలో మోనిత.. స్కూటీ వేసుకొని నేరుగా సౌందర్య ఇంట్లోకే వచ్చేస్తుంది. రావడం రావడమే కార్తీక్ కార్తీక్ అంటూ అరుస్తుంది.
కార్తీక్ మన బాబును ఎవరో ఎత్తుకెళ్లారు అంటుంది మోనిత. మరోవైపు రుద్రాణి.. దీప ఇంటికి వస్తుంది. అదే సమయానికి కార్తీక్, దీప.. పిల్లలు భోజనం చేస్తుంటారు. టైమ్ బాగోలేక వచ్చాను అన్నావు. మరి.. ఇంట్లో సామాన్లు చూస్తే బాగానే ఉన్నాయి కదా అంటుంది రుద్రాణి. బయట వాళ్ల సామాన్లు ఉంటే నేనే తీసుకొచ్చానండి అంటాడు కార్తీక్.
దీంతో వాళ్లు తింటున్న గిన్నెలను తన కాళ్లతో తన్నేస్తుంది రుద్రాణి. నోర్ముయ్ అంటుంది. రుద్రాణి సామ్రాజ్యం ఇది అంటుంది. దీంతో ఏం మనుషులండి మీరు అంటాడు కార్తీక్. దీంతో ఏయ్ అంటూ కార్తీక్ ను వెనక్కి నెట్టేస్తుంది రుద్రాణి. దీంతో ఏయ్ అంటూ రుద్రాణి చెంప చెళ్లుమనిపిస్తుంది దీప. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.